హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: బైక్‌పైనే పాప్‌ కార్న్ బిజినెస్‌ .. 30వేల పెట్టుబడితో మంచి లాభాలు

Vijayawada: బైక్‌పైనే పాప్‌ కార్న్ బిజినెస్‌ .. 30వేల పెట్టుబడితో మంచి లాభాలు

X
Business

Business idea

Vijayawada: తాను ఆహార రంగానికి సంబంధించిన వ్యాపారం చేయాలనుకున్నాడు. అది చిన్నదా పెద్దదా అని ఆలోచించలేదు. తనకు అందుబాటులో ఉన్న వనరులతో ఓ చిరు వ్యాపారాన్ని ప్రారంభించాడు. తక్కువ పెట్టుబడితో ఎంత సంపాధిస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

(B.Yashwanth,News18,Jaggayyapet)

వ్యాపారంలో లాస్ వస్తే చాలామంది మనకెందుకులే వ్యాపారం అచ్చు రావడం లేదు అని ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు.మరి కొంతమంది ఏదైనా చెయ్యాలని అనుకుంటారు..అలాంటి వాళ్ళు కష్టపడి చివరికి సాధిస్తారు.మన స్థాయికి, సామర్ధ్యానికి మించినది కావడంతో.. లక్ష్యాన్ని సాధించకుండానే వ్యాపారస్తులుగా మారాలనుకునే అనేక మంది అక్కడితోనే. కాని కొంతమంది మాత్రం తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ప్లాన్ చేసుకుంటారు. ఆకాశానికి నిచ్చెన వేయకుండా తమ సామర్థ్యాన్ని, స్థాయిని బట్టి లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న వారు తప్పకుండా విజయం సాధిస్తారు.సరిగా అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన ఇలాంటి ఓ స్ఫూర్తిదాయక సంఘటన ఇది.

Donkey Meet: గాడిద మాంసానికి ఏపీలో ఫుల్ డిమాండ్ పెరగడానికి కారణం ఇదే..?

బైక్‌పై బిజినెస్..

తాను ఆహార రంగానికి సంబంధించిన వ్యాపారం చేయాలనుకున్నాడు.అది చిన్నదా పెద్దదా అని ఆలోచించలేదు. తనకు అందుబాటులో ఉన్న వనరులతో ఓ చిరు వ్యాపారాన్ని ప్రారంభించాడు. తన ఆలోచనను ఏ విధంగా ఆచరణలో పెట్టాడో వివరిస్తూ ఓ గ్రామ గ్రామాన తిరుగుతూ వ్యాపారం అభివృద్ధి చేస్తున్నాడు.అయితే, ఆతర్వాత బైక్ పై కూడా ఫుడ్ బిజినెస్ చేయవచ్చని తెలుసుకుని.. తక్కువ పెట్టుబడితో చేయగల వ్యాపారం కోసం ఆలోచించాడు. అదే సమయంలో తాను చేయగలనో లేదో, తన దగ్గర ఉన్న వనరులను చూసుకున్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. సమయాన్ని వృథా చేయకుండా ఉద్యోగానికి స్వస్తి చెప్పి టీవీఎస్ బైక్ పై పాప్కాన్ బిజినెస్ మొదలుపెట్టాడు.

30వేల పెట్టుబడితో ..

ఇతను పేరు కోటేశ్వరరావు ఇతనిది ఎన్టీఆర్ జిల్లాలోని వత్సవాయి మండలం భీమవరం గ్రామం కరోనాకి ముందు ఇతను మిర్చి వ్యాపారం చేసేవాడు. కరోనా సమయంలో వ్యాపారం లేకపోవడంతో మూడు సంవత్సరాలు ఇంట్లో ఖాళీగా ఉంటూ కుటుంబాన్ని గడిపారు. కోటేశ్వరరావు తన జీవనోపాధి కోసం హైదరాబాదులోని ఒక పదివేల రూపాయలు వెచ్చించి మొక్కజొన్న పాప్కాన్ తయారీ మిషన్ కొనుగోలు చేశాడు. మరొక పదివేల రూపాయలు వెచ్చించి టీవీఎస్ ని (బేక్) కొనుగోలు చేశాడు మరొక వెయ్యి రూపాయలు పెట్టి ఐదు కేజీల గ్యాస్ బండని కొనుగోలు చేశాడు. మొత్తం 30 వేల రూపాయలతో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. గ్రామ గ్రామాన తిరుగుతూ టీవీఎస్ బైక్ కు ఐదు కేజీల గ్యాస్ బండ పాప్కాన్ తయారీ మిషన్, పాప్కాన్ తయారీ సామాగ్రిని ఆ టీవీఎస్ బేక్ కి అమర్చుకొని కొనుగోలుదారులు ఎక్కడ కావాలంటే అక్కడ వేడి వేడి పాప్కాన్ తయారుచేసి రూ.10కే ప్యాకెట్ అమ్మేస్తూ వ్యాపారం చేస్తున్నాడు రోజుకు పెట్టుబడి పోను 500పైగా ఆదాయం వస్తుందని తెలిపిన కోటేశ్వరరావు

First published:

Tags: Andhrapradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు