K Pawan Kumar, News18, Vijayawada
మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కు ఫేమస్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ఆ ప్రాంతానికి గుర్తింపు తీసుకొస్తాయి. ఫుడ్ ఐటమ్స్ తో పాటు కొన్ని రకాల డ్రింక్స్ కూడా ప్రాచుర్యం పొందాయి. వాటిలో ముఖ్యమైనది రాజమండ్రి రోజ్ మిల్క్ (Rajahmundry Rose Milk). రాజమండ్రి అనగానే మొదటగా అందరికి గుర్తుకు వచ్చేది రోజ్ మిల్క్. రాజమండ్రి రోజ్ మిల్క్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. కానీ రాజమండ్రి వెళ్తేగానీ రోజ్ మిల్క్ దొరకదని చాలా మంది బాధపడుతుంటారు. అటువైపు వెళ్లినప్పుడు వీలు చేసుకొని రోజ్ మిల్క్ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు. ఐతే రాజమండ్రి రోజ్ మిల్క్ ఇప్పుడు విజయవాడలోనే అందుబాటులోకి వచ్చింది.
రాజమండ్రి రుచికి ఏమాత్రం తీసిపోని విధంగా బెజవాడ వాసులను అలరిస్తోంది. విజయవాడ బందరు రోడ్డులోని పీవీపీ మాల్ సమీపంలో రోజ్ మిల్స్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం విజయవాడకు చెందిన జ్యోత్స్న ఈ సెంటర్ ను ప్రారంభించారు. సేమ్ టు సేమ్ రాజమండ్రి ఫ్లేవర్స్ తోనే రోజ్ మిల్క్ అందిస్తుండటంతో బెజవాడ వాసులు ఫిదా అవుతున్నారు.
రాజమండ్రిని తలపించేల విజయవాడలో ఉన్న రోజ్ మిల్క్ ఎంతో ఫేమస్ అయ్యింది అక్కడ రోజ్ మిల్క్ 50/- స్పెషల్ రోజ్ మిల్క్ 60 /- సేమియా 70/- కోవ 80/- ఇలా ఎన్నో వెరైటీ ఐటమ్స్ ఇక్కడ తక్కువ ధరలోనే అందరికి అందుబాటు ఉన్నాయని ఓనర్ జ్యోత్స్న చెబుతున్నారు.
రాజమండ్రిలో ఉండే రోజ్ మిల్క్ వలే అదే టేస్ట్ కోసం ఆ రోజ్ మిల్క్ కి కావల్సిన పదార్థాలన్నీ కూడా రాజమండ్రి నుండే తీసుకొస్తుంటారు. ఇక్కడ వాడే సరుకులన్నీ రాజమండ్రి నుంచి తెచ్చినవే. రోజ్ మిల్క్ తయారీకి సేమియాతో పాటు స్వచ్ఛమైన పాలను మాత్రమే వినియోగిస్తారు. ప్యాక్ పాలు కూడా వాడమని నిర్వాహకులు చెబుతున్నారు. సో మీరు కూడా బెజవాడ బందర్ రోడ్డులోని పీవీపీ మాల్ వైపుకు వెళ్లినప్పుడు రోజ్ మిల్క్ ను టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada