(K.Pavan Kumar, News18, Vijayawada)
రాఘవేంద్ర స్వామినినమ్మిన భక్తులపాలిట కొంగు బంగారం చేస్తారని ప్రజల యొక్క విశ్వాసం. విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి ఆలయం నిర్మించి దాదాపు 40 సంవత్సరాలు అయ్యింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మంత్రాలయంలో ఆలయం ఎలా ఐతే ఉన్నదో భక్తులకు ఎలా దర్శనమిస్తారో స్వామి వారు విజయవాడలో కూడా అలానే ఆ ఆలయం వలె ఇక్కడ కూడా దర్శమిస్తారు. అంతే కాకుండా మంత్రాలయంలో బృందావనం(సమాధి) వద్ద ఉన్న మట్టిని తీసుకుని విజయవాడలో ఉన్నటువంటి రాఘవేంద్ర ఆలయంలో కూడా అలానే ఉండేలా ఆ మట్టితోనే బృందావనాన్ని నిర్మించారు
రాఘవేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర
కంచి పట్టణానికి 26 మైళ్ళ దూరంలో గల భువనగిరి లో క్రి శ 1598 లో వెంకట బట్టు అనే బాలుడు జన్మించాడు. ఆయనే పెరిగి పెద్దవారు అయి శ్రీ రాఘవేంద్ర స్వామిగా ప్రసిద్ది చెందినారు. రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు, గోపికాంబ అనే కనడ భట్టు రాజులు రెండవ సంతానంగా జన్మించారు. ఈ రాఘవేంద్ర స్వామి పాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథి నాడు జన్మించాడు. ఆ రోజునే స్వామి వారి జన్మదినంగా ఎంతో ప్రత్యేకంగా విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.రాఘవేంద్ర స్వామి వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు.
శ్రావణ బహుళ ద్వితీయ” నాడు క్రీ.శ. 1671 లో సజీవ సమాదిలోకి వెళ్లి తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారు. ఆ సమాధినే అందరూ రాఘవేంద్ర బృందావనం అని పిలుచుకుంటారు .ఆ బృందావనం అప్పటి నుండి ఇప్పటి వరకు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి గాంచుతుంది . శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుని అవతారమని భక్తుల విశ్వాసంగా నమ్ముతారు. కష్టమంటూ తనను నమ్మి ఆ స్వామి దగ్గరికి వచ్చిన వారి కోరికలు, ఆపదలు తప్పకుండ తీర్చు మహిమ గల స్వామి. ఈ స్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం అవుతుంది అని భక్తులు యొక్క విశ్వాసం. ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి.
బృందావనం వెలసిన చోటే పూర్వం భక్త ప్రహ్లదుడు యజ్ఞం చేసాడని. అతడే కలియుగంలో రాఘవేంద్ర స్వామిగా జన్మించాడని ప్రజలు యొక్క ప్రగాఢ విశ్వాసం అలాగే విజయనగర సామ్రాజ్యధినేత శ్రీ కృష్ణ దేవరాయల మత గురువైన శ్రీ వ్యాసరాయల వారే రాఘవేంద్ర స్వామి అని అక్కడ వారు అంత కూడా చెబుతుంటారు. స్వామిని దర్శించిన భక్తుల కోరికలు తీర్చటమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని, సిరి సంపదలను కలగచేస్తారు ఈ రాఘవేంద్ర స్వామి అని భక్తులు ఆ ఆలయం చుట్టుపక్కల వారంతా చెప్తూ వుంటారు.
విజయవాడలో ఉన్నటువంటి భాస్కర్ అనే వ్యక్తి కి కాళ్ళు పడిపోగా ఆయన కలలో రాఘవేంద్ర స్వామికి 40 రోజులు పాటు ప్రదక్షణం చేస్తే మరల కాళ్లు తిరిగి వస్తాయని కలలో చెప్పగా అతను అలానే పాకుతూ 40 రోజులు పాటు ప్రదక్షిణలు చేయగాకాళ్ళు వచ్చాయి. ఇలా ఎన్నో లీలలు చేసి భక్తులకోర్కెలు తీర్చిన ఘనత స్వామి వారిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada