హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

హైకోర్టు చెప్పినా వినని మల్టీప్లెక్స్.. ఆ బాదుడు తప్పడం లేదుగా..!

హైకోర్టు చెప్పినా వినని మల్టీప్లెక్స్.. ఆ బాదుడు తప్పడం లేదుగా..!

విజయవాడలో అక్రమంగా పార్కింగ్ వసూలు

విజయవాడలో అక్రమంగా పార్కింగ్ వసూలు

షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సుల్లో ఉచిత పార్కింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. విజయవాడ (Vijayawada) లో తాజాగా మల్టీ ప్లెక్స్‌ కాంప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయొద్దని న్యాయస్థానాలు తీర్పులిచ్చినా, వాటిని అమలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చినా యాజమాన్యాలు మాత్రం వాటిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సుల్లో ఉచిత పార్కింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. విజయవాడ (Vijayawada) లో తాజాగా మల్టీ ప్లెక్స్‌ కాంప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయొద్దని న్యాయస్థానాలు తీర్పులిచ్చినా, వాటిని అమలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చినా యాజమాన్యాలు మాత్రం వాటిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. హై కోర్టు ఆదేశాలను ప్రభుత్వ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా పీవీపీ మాల్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మాల్ కు వచ్చేవారికి మరియు సినిమా కు వచ్చే వారి వద్ద ఫీజు వసూల్ చేయరాదు అంటూ ఆదేశాలు ఇచ్చిన వారు తీరు మారడం లేదు... పైగా పార్కింగ్ ప్లేస్ లో ఎలాంటి సరైన సౌకర్యాలు లేకున్నా సరే మేము పార్కింగ్ ఫీస్ వసూల్ చేస్తాం.. లక్షలు లక్షలు పెట్టి పార్కింగ్ పాట పాడుకుంటున్నాం ఏమి చేయమంటారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

కోర్టు ఆదేశాలు ఉన్నా మేము వసూల్ చేస్తామంటూ నిర్వాహకులు ప్రేక్షకులకు దీటుగా సమాధానం చెవుతున్నారు. సినిమా కు వచ్చిన ప్రేక్షకులు వద్ద పార్కింగ్ ఫీస్ వసూలు చేయడం తో ఈ విషయం మీద నిర్వాహకులతో వాగ్వాదం కు దిగారు. కావాలంటే పార్కింగ్ బిల్ ఇస్తాం ఎవరికి చూపిస్తారో చూపించించండి అని జూలుం ప్రదర్శించారు నిర్వాహకులు.

ఇది చదవండి: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాటి కోసం దూరాభారం అక్కర్లేదు..

నిర్వాహకుల తీరుపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. గత వారం స్పందనలో ఇదే విషయంపై ఫ్లకార్డు ప్రదర్శించి జిల్లా కలెక్టరుకు ఒక్క వ్యక్తి ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే..! అర్జీ ఇచ్చినప్పటికీ అధికారులు ఎందుకు తీసుకోలేదంటూ పీవీపీకి వచ్చే వారు మండి పడుతున్నారు. ఒకవేళ అధికారులు చర్యలు తీసుకుని ఉండి ఉంటే నిర్వాహకులు లెక్క చేయకుండా ఎందుకు వ్యవరిస్తున్నారంటూ నిర్వాహకులు తీరుపై మండి పడుతున్నారుఇప్పటికైనాఅధికారులు స్పందించినిద్రావస్థను వదిలి అధికార యంత్రాంగం నిర్వాహకులు పై చర్యలు తీసుకోవాలి అంటూమండి పడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు