K Pawan Kumar, News18, Vijayawada
డాక్టర్ అంటే సమాజంలో ఎంతో గౌరవం, గుర్తింపు ఉన్నాయి. దేవుడికి మొక్కనివారు కూడా డాక్టర్ కు దండం పెడతారు. కానీ ఓ కిలాడీలేడీ మాత్రం.. డాక్టర్ అవతారంలో చీకటి వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. వైద్యం పేరుతో వెకిలి పనులకు తెరలేపింది. పైకి డాక్టర్ గా నటిస్తూనే లోపల మాత్రం మరో బిజినెస్ స్టార్ట్ చేసి అడ్డంగా బుక్కయింది. ట్రీట్ మెంట్ పేరుతో తెర వెనుక వ్యభిచారం నడుపుతున్నట్లు విజయవాడ (Vijayawada) పోలీసులు గుర్తించారు. ఇన్నాళ్లుగా ఆర్ఎంపీగా చేస్తున్న రాధిక ఒక్కసారిగా ఆవిడ నిజస్వరూపం బయట పడటంతో చుట్టుపక్కల వారంతా ఆశ్చర్యపోయారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అమ్మాయిలను విజయవాడ రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం రావడంతో భవానీపురం స్వాతి రోడ్డు ఆర్ఆర్ దర్బార్ హోటల్ ప్రాంతంలో నివాసం ఉండే రాధికను సిఐ ఉమర్ చాలా తెలివిగా పట్టుకున్నారు.
భవనిపురం స్వాతి రోడ్డులో ఉంటున్న రాధిక ఆవిడ భర్త ఆర్ఎంపీగా చేస్తూ కరోనాతో మృతి చెందాడు. ఆ రోజు నుండి రాధిక ఇంటి దగ్గరే ఉంటూ వైద్యం చేస్తూ జీవనం గడుపుతుంది. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే అత్యాసతో వాట్సప్ గ్రూపులు ద్వారా పార్టీలను బుక్ చేసుకుని వారికి అమ్మాయిలను పంపిస్తుంది.
బుధవారం ఒక వ్యక్తి 10 వేలకు ఒక అమ్మాయిని బుక్ చేసుకోగా అతన్ని గొల్లపూడి స్కూల్ దగ్గరకు వచ్చాక ముందుగా 5000 తీసుకుని మిగిలిన డబ్బులు అతను వెళ్లే అమ్మాయికి ఇవ్వమని డీల్ కుదుర్చుకున్నది రాధిక. స్కూల్ దగ్గర ఉన్న బే లీవ్స్ హోటల్ రూంలో 101 ఉన్న అమ్మాయి వద్దకు అతన్ని పంపింది.
సమాచారం అందుకున్న భవానిపురం సీఐ ఉమర్ వారి టీమ్‌తో హోటల్ దగ్గరకు వెళ్లి ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించగా ఆమె పశ్చిమ బెంగాల్‌కి నుండి వచ్చినట్టు చెప్పింది. ఐతే వ్యభిచారం చేయిస్తున్న రాధికను అరెస్ట్ చేశారు .రూమ్‌లో ఉన్న యువతిని హోమ్ కి తరలించారు. ఆర్.ఎమ్.పి గా చేస్తున్న రాధికపై కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Prostitution, Vijayawada