హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: పోస్ట్ ఆఫీస్‌లో డబ్బులు కడుతున్నారా..? అయితే మీ డిపాజిట్ సేఫేనా.. బెజవాడలో ఏం జరిగిందో చూడండి..!

Vijayawada: పోస్ట్ ఆఫీస్‌లో డబ్బులు కడుతున్నారా..? అయితే మీ డిపాజిట్ సేఫేనా.. బెజవాడలో ఏం జరిగిందో చూడండి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Shocking: ప్రైవేటు వ్యాపారాల కోసం విచ్చలవిడిగా అప్పులు చేశాడు. వాటి వడ్డీలు కట్టడానికి చేతిలో డబ్బులు లేవు. దీంతో కళ్ల ముందు కనిపిస్తున్న డిపాజిటర్ల డబ్బులను దారి మళ్లించాడు. ఎవ్వరికీ దొరకడులే అనుకున్నాడు కానీ... పై అధికారుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Prayaga Raghavendra Kiran, News18, Vijayawadaప్రైవేటు వ్యాపారాల కోసం విచ్చలవిడిగా అప్పులు చేశాడు. వాటి వడ్డీలు కట్టడానికి చేతిలో డబ్బులు లేవు. దీంతో కళ్ల ముందు కనిపిస్తున్న డిపాజిటర్ల డబ్బులను దారి మళ్లించాడు. ఎవ్వరికీ దొరకడులే అనుకున్నాడు కానీ... పై అధికారుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. విజయవాడ నగరం కృష్ణలంకలోని నెహ్రూనగర్‌లోని ఉప తపాలా కార్యాలయం పోస్టు మాస్టర్‌ మనోజ్‌ నిర్వాకం ఆలస్యంగా బయటపడింది. ఉన్నతాధికారులు తనిఖీ చేయడంతో ఇన్నేళ్లుగా మనోజ్ చేస్తున్న వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అధికారులు సైతం అవాక్కయ్యారు. గత ఏడాది జూన్‌లో కృష్ణలంకలోని ఉపతపాలా కార్యాలయంలో పోస్టుమాస్టర్‌గా విధుల్లో చేరాడు మనోజ్‌. ఈ కార్యాలయంలో దాదాపు 7 వేల వరకు పొదుపు, ఎఫ్‌డి, ఆర్డీ ఖాతాలు ఉన్నాయి.
  కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ శాతం మంది కూలి, నాలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని స్వాహా చేశాడు. దీనికి తోడు విచ్చలవిడిగా అప్పులు చేసి పలు వ్యాపారాలు చేశాడు. వడ్డీలు పెరిగిపోవడంతో కళ్ల ముందు కనిపిస్తున్న సొమ్మును అప్పులు తీర్చడానికి ఉపయోగించుకున్నాడు. అంతేకాదు చికెన్‌, మటన్‌ దుకాణాలతో పాటు మరికొన్ని వ్యాపారాలు చేసినట్లు విచారణలో తేలింది. అవసరాలు పెరగడంతో ఖాతాదారులు డిపాజిట్‌ చేసే డబ్బును వారి పాస్‌పుస్తకాల్లో నమోదు చేయకుండా సొంత జేబులో వేసుకున్నాడు.

  ఇది చదవండి: అలాంటి పనులు చేస్తే లోపలేయడమే.. కర్నూలు జిల్లా పోలీసుల వార్నింగ్


  వారికి నకిలీ ఖాతాలు సృష్టించి, వాటిలో డబ్బు వేస్తున్నట్లు అందరినీ మభ్యపెట్టాడు. వారికి ప్రతి నెలా వడ్డీ చెల్లించే వాడు. కొన్నాళ్లు బాగానే సాగిన వ్యవహారం ఆతర్వాత తిరగబడింది. డబ్బులు సర్దుబాటు చేయలేక చేతులెత్తేశాడు. ఈ వ్యవహారంపై విజయవాడ డివిజన్‌ ఎస్‌ఎస్‌పీవో హరిప్రసాద్‌ శర్మ స్పందించి.., ఏడుగురు అధికారులతో విచారణ కమిటీని నియమించారు.

  ఇది చదవండి: సిటీలో వాహనాలు మాయం అవుతున్నాయి.. ఏజెన్సీలో తిరుగుతున్నాయి..! ఎలా అంటే..?


  ఈ బృందం ప్రతి ఖాతాను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వారు ఇచ్చిన మొత్తాన్ని డిపాటిట్‌ చేశారా? దాని తాలూకూ పాస్‌పుస్తకంలో నమోదు చేశారా? అన్న విషయాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు సాగిన దర్యాప్తు ప్రకారం దాదాపు రూ. కోటి వరకు సొమ్మును స్వాహా చేసినట్లు తేలింది. నిందితుడు నేరం అంగీకరించడంతో అతడి నుంచి రూ.10లక్షలు రికవరీ చేసినట్లు సమాచారం. ఈ గోల్ మాల్ వ్యవహారంపై ఉన్నతాధికారులు కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  ఇది చదవండి: రోడ్డుపై కారు బోల్తా పడింది...కానీ కారులో ఉన్న వాళ్లంతా పరుగో పరుగు..! ఎందుకంటే..!


  నిధుల కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో పలువురు డిపాజిటర్లు, ఖాతాదారులు కార్యాలయం వద్దకు వచ్చి తమ డిపాజిట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం సిబ్బంది వారు చెల్లించిన నగదు మొత్తం పుస్తకాల్లో నమోదు అయిందీ లేనిది పరిశీలించి పుస్తకాల్లో ఎంట్రీలు లేని వారు ఫిర్యాదు చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.


  సీబీఐకి ఫిర్యాదు చేసే అవకాశం
  అక్రమాలకు సంబంధించి పెద్ద మొత్తం కావడంతో దీనిపై పోస్టల్‌ అధికారులు సీబీఐకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసిన అనంతరం స్వాహా అయిన సొమ్ము మరింత ఎక్కువ ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేసే అంశంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Postal Deposits, Vijayawada

  ఉత్తమ కథలు