హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Murder Mystery: చిన్న క్లూ లేకుండానే మర్డర్ మిస్టరీని ఛేదించిన కానిస్టేబుల్.. అది ఎలాగంటే..!

Murder Mystery: చిన్న క్లూ లేకుండానే మర్డర్ మిస్టరీని ఛేదించిన కానిస్టేబుల్.. అది ఎలాగంటే..!

కానిస్టేబుల్ రామకృష్ణను అభినందిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

కానిస్టేబుల్ రామకృష్ణను అభినందిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

కొన్ని కేసుల్లో ఆధారాలున్నా నేరస్తులను పట్టుకోవడం కష్టమవుతోంది. కానీ ఒక్క చిన్న క్లూ కూడా దొరకని మహిళ మృతి కేసును ఓ కానిస్టేబుల్ చాలా తెలివిగా ఛేజ్ చేశాడు.

సాధారణంగా ఏదైనా హత్య గానీ, అనుమానాస్పద మృతిగానీ, ఆత్మహత్య గానీ, దొంగతనం గానీ.. నేరాలు జరిగినప్పుడు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తారు. ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలు, అక్కడి పరిస్థితుల ఆధారంగా నేరస్తులను పట్టుకుంటారు. కొన్ని కేసుల్లో ఎంత ప్రయత్నించినా ఒక్క క్లూ కూడా దొరకదు. అలాంటి కేసులు కొన్నాళ్ల తర్వాత క్లోజ్ చేస్తుంటారు. ఐతే ఒక్క చిన్న క్లూ కూడా దొరకని మహిళ మృతి కేసును ఓ కానిస్టేబుల్ చాలా తెలివిగా ఛేజ్ చేశాడు. ఛాలెంజింగ్ గా తీసుకొని సినిమా స్టైల్లో దర్యాప్తు చేసి మరీ నేరస్తుడ్ని పట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కృష్ణాజిల్లా  (Krishna District) కేంద్రమైన మచిలీపట్నం (Machilipatnam) సమీపంలో కాలేఖాన్ పేట వద్ద మురుగు కాల్వలో ఆగస్టు 21వ తేదీన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

దుండగులు మహిళను హత్య చేసి మృతదేహాన్ని సంచిలో మూటగట్టి డ్రెయినేజ్ లో పడేశారు. శవం కూడా గుర్తుపట్టలేని విధంగా ఉండటం, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వారిని ప్రశ్నించినా వివరాలు లభ్యం కాలేదు. ఘటనాస్థలిలో ఆధారాలు లభించలేదు. వేలముద్రలు, ఇతర సాక్ష్యాలు లేవు. అలాగే టెక్నాలజీ ఉపయోగించి దర్యాప్తు చేసే అవకాశం కూడా లేదు. దీంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఐతే కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న కానిస్టేబుల్ రామకృష్ణ..అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చేపలు, రొయ్యల చెరువుల వద్ద కాపలా ఉండే కుటుంబాలపై దృష్టి పెట్టాడు. ప్రతి చెరువు వద్దకు వెళ్లి ఇటీవల అక్కడి నుంచి వెళ్లిపోయిన కుటుంబాల ఆరా తీశాడు.

ఇది చదవండి: పెళ్లై 12ఏళ్లైనా వేర్వేరు గదుల్లో భార్యాబర్తలు... కానీ ఓ రోజు రాత్రి ఊహించని ఘటన...


ఈ క్రమంలో గుంటూరుకు చెందిన ఓ కుటుంబం ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లిన రామకృష్ణ.. ఆ కుటుంబం ఉంటున్న గ్రామానికి వెళ్లారు. ఓ వ్యక్తి భార్యను చంపి మృతదేహాన్ని సంచిలో మూటగట్టి కాల్వలో పడేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. కొన్ని కేసుల్లో ఆధారాలు దొరికినా నేరస్తులను పట్టుకోవడం ఆలస్యమవుతుంది. కానీ ఈ కేసులో ఎలాంటి ఆధారం దొరక్కుండానే రెండు వారాల్లో నేరస్తుడ్ని పట్టుకున్నారు.

 ఇది చదవండి: ఏపీలో కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో హై అలర్ట్..


చిన్న ఆధారం లేకుండా.. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగం లేకుండానే కేసును సమయస్ఫూర్తిగా చేయించడంలో కీలక పాత్ర వహించిన కానిస్టేబుల్ ను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అభినందించారు. కేసును ఎలా దర్యాప్తు చేసిందీ..? ఎక్కడెక్కడ తిరిగింది..? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి భార్యను హతమార్చి తెలివిగా మృతేహాన్ని కాల్వలో పడేసిన భర్తను చేసిన నేరం వెంటాడింది. పోలీసుల సమయస్ఫూర్తి, నైపుణ్యం అతడ్ని పట్టించింది. పోలీసులు ఎలాంటి కేసులనైనా ఛేదిస్తారనే దానికి ఈ ఘటనే నిదర్శనం. ఆధారాలు లేకుండా చేశామని భావించే నేరస్తులకు వార్నింగ్ లాంటిది కూడా.

First published:

Tags: Andhra Pradesh, AP Police, Crime news, Husband kill wife, Krishna District

ఉత్తమ కథలు