హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...!

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...!

నిత్యం బూతులతో వ్యాఖ్యలు చేసే వర్మ, రాజకీయాలకు సంబంధించిన విషయాలను, రెండు కులాలకు ఆపాదించి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాపులపై ట్విట్టర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు మంగళవారం పటమట పోలీస్ స్టేషన్‌లో సీఐ కాశీ విశ్వనాథ్‌కు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ కులాల మధ్య చిచ్చు పెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వర్మ చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపుతోంది.  టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధ్యక్షుడు పవన్ భేటీపై రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. డబ్బు కోసం కాపులను కమ్మ వాళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు, కంగ్రాట్స్ కమ్మ వాళ్ళు" అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లోనే కాక అటు కాపు, కమ్మ కులాల్లోనూ దుమారానికి కారణం అయ్యాయి. నిత్యం సంచలనాలు రేకెత్తించే కామెంట్స్ చేసే వర్మ ఈ సారి రాజకీయంగా, కులాలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది.

కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని కాపు నేతలు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం బూతులతో వ్యాఖ్యలు చేసే వర్మ, రాజకీయాలకు సంబంధించిన విషయాలను, రెండు కులాలకు ఆపాదించి చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, వర్మ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించారు. వర్మ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకొని, వరుసగా వివాదాలకు కేంద్రం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులపై వర్మ చేసిన వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు సైతం మండిపడుతున్నారు. వర్మ నోరు అదుపులో  పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు.

First published:

Tags: Local News, Ram Gopal Varma, Vijayawada

ఉత్తమ కథలు