అయ్యబాబోయ్... రూ.2,00,00,000... లారీలో సిమెంట్ బస్తాల్లో దాచి... ఏలూరుకు...

AP Assembly Elections 2019 : విజయవాడ నుంచీ ఏలూరుకు రూ.2 కోట్లు తరలుతుండటమంటే మాటలు కాదు... డబ్బు ప్రవాహం ఏ రేంజ్‌లో ఉందో ఆలోచించండి మరి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 10, 2019, 12:07 PM IST
అయ్యబాబోయ్... రూ.2,00,00,000... లారీలో సిమెంట్ బస్తాల్లో దాచి... ఏలూరుకు...
పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు
  • Share this:
రాజకీయాలకూ డబ్బుకీ విడదీయరాని సంబంధం కనిపిస్తోంది. ఈ పార్టీలేమో డబ్బున్నోడికే టికెట్లు ఇస్తున్నాయి. వాళ్లేమో బ్లాక్ మనీ బయటకు తీసి... ఎన్నికల సమయంలో పంచుతున్నారు. అందుకే ఇప్పుడు ఏపీలో ఎక్కడ వెతికినా డబ్బే... డబ్బు. అదికూడా వందలు, వేలు, లక్షలూ కాదు... కోట్లే. ఇదిగో... విజయవాడలోని ఎనికేపాడు దగ్గర పోలీసులు పైపై తనిఖీలు చేస్తుంటే... ఓ సిమెంట్ లారీ కనిపించింది. అందులో డ్రైవర్ ఏదో తప్పు చేసిన వాడిలా కాస్త భయపడుతూ కనిపించాడు. అన్ని వాహనాలనూ తనిఖీ చేస్తున్నట్లుగానే... ఆ వాహనాన్నీ అలా అలా చెక్ చేసి పంపించాలనుకున్నారు. దాని డ్రైవర్... సారూ సిమెంట్ బస్తాలు సారూ... అన్నాడు. అయితే ఏంటి... బండి పక్కకు ఆపు అన్నారు.

narendra modi,chandra babu,jagan,kcr,rahul gandhi,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha elections,2019 lok sabha elections,lok sabha election,lok sabha,india lok sabha election 2019,lok sabha polls,mandya lok sabha elections,lok sabha elections survey,india lok sabha election date,lok sabha elections 2019 opinion poll,lok sabha elections 2019 live updates,election 2019,loksabha election 2019,ap elections 2019,ap politics,ap assembly elections 2019,ap elections,ap news,ap assembly elections,ap assembly election,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly election schedule 2019,assembly elections,assembly elections 2019,2019 assembly elections,elections,assembly election 2019,andhra pradesh assembly elections 2019,elections 2019,ap assembly counting updates,ap assembly seats,లోక్ సభ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలు,జనరల్ ఎన్నికలు,ప్రధానమంత్రి,నరేంద్ర మోదీ,చంద్రబాబు,జగన్,వైఎస్ జగన్,కేసీఆర్,రాహుల్ గాంధీ,
పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు

బండి ఆపమనగానే డ్రైవర్‌ మొహంలో రంగులు మారిపోయాయి. అయిపోయాన్రా దేవుడా అన్నట్లు ఫేస్ పెట్టాడు. అది చూశాక పోలీసులకు డౌట్ వచ్చింది. ఏంటి మొహం అట్టలా పెట్టాడు... అనుకుంటూ బండి వెనక్కి ఎక్కారు. పైన అన్నీ సిమెంట్ బస్తాలే ఉన్నాయి. ఏం లేదులే అని బండి దిగిపోయారు. అంతే ఆ డ్రైవర్... చెప్పానుగా సారూ... సిమెంట్ అనీ... మరినే బోతా... అన్నాడు. వెళ్దువు గానీ... ఈ బస్తాలకు సంబంధించిన పత్రాలు చూపించు అన్నారు. అంతే... డ్రైవర్‌కి ఒక్కసారిగా గొంతులో నాలుగైదు వెలక్కాయలు పడినట్లు అనిపించింది. పత్రాలేవీ లేవు సారూ అంటూ నసగడం మొదలుపెట్టాడు. పత్రాలు లేవా... అలాగైతే... బండిని ఇక్కడే ఉంచి... పత్రాలు తే... అన్నారు. అట్లా కుదరదు సారూ... త్వరగా తీసుకెళ్లాల అన్నాడు.

narendra modi,chandra babu,jagan,kcr,rahul gandhi,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha elections,2019 lok sabha elections,lok sabha election,lok sabha,india lok sabha election 2019,lok sabha polls,mandya lok sabha elections,lok sabha elections survey,india lok sabha election date,lok sabha elections 2019 opinion poll,lok sabha elections 2019 live updates,election 2019,loksabha election 2019,ap elections 2019,ap politics,ap assembly elections 2019,ap elections,ap news,ap assembly elections,ap assembly election,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly election schedule 2019,assembly elections,assembly elections 2019,2019 assembly elections,elections,assembly election 2019,andhra pradesh assembly elections 2019,elections 2019,ap assembly counting updates,ap assembly seats,లోక్ సభ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలు,జనరల్ ఎన్నికలు,ప్రధానమంత్రి,నరేంద్ర మోదీ,చంద్రబాబు,జగన్,వైఎస్ జగన్,కేసీఆర్,రాహుల్ గాంధీ,
పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు
అంత కంగారేముంది... నీ వాలకం చూస్తుంటే... బండిలో ఏదో ఉండే ఉంటుందన్న డౌట్ వస్తోంది అని పోలీసులు మరోసారి బండి వెనక్కి ఎక్కారు. ఈసారి నాలుగైదు సిమెంట్ బస్తాల్ని పక్కకు లాగారు. కళ్లు జిగేల్ మన్నాయి. అన్నీ రూ.2000, రూ.500 నోట్లే. కట్టలు కట్టలుగా ఉండటంతో పోలీసులకే అంత డబ్బును చూసి... ఓర్నాయనో ఇంత డబ్బా... ఎంత ఉంటుంది... అని లెక్కలేశారు. రూ.2 కోట్లు ఉన్నట్లు తేలింది.

ఆ డబ్బును కంచికచెర్ల నుంచి ఏలూరుకు తీసుకెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు... అది ఎవరిది అన్నది తెలుసుకునే పనిలో ఉన్నారు. లారీని పటమట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇదంతా బ్లాక్ మనీ అని వేరే చెప్పాల్సిన పని లేదుకదా. ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది.

 ఇవి కూడా చదవండి :

కావేరీ ట్రావెల్స్ ఎందుకలా చేసింది... జనం ఓట్లు వెయ్యకుండా కుట్ర జరుగుతోందా

ఐసీసీ వరల్డ్ కప్ టీమ్స్ ఎప్పుడు ప్రకటిస్తారు... టైమ్ లైన్ ఇదిగో...

ఇంటర్నెట్ ఓటింగ్ తెచ్చేదెప్పుడు... ఎంతసేపూ పాత పద్ధతేనా... మనోళ్లు మారరా...

ఓటుకు రూ.500 నుంచీ రూ.5000... ఎక్కడిదీ డబ్బు... మనదే కదా...
First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు