K Pawan Kumar, News18, Vijayawada
పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెంచుతున్న గంజాయ్ స్మగ్లర్స్ అధికారులు కళ్లుకప్పి అక్రమంగా తరలిస్తున్నారు. ఇకపై అటువంటి తరహా ఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడే గట్టి చర్యలు చేపడుతున్నారు. ఈ తరహ ఘటనే విజయవాడ (Vijayawada) లో జరిగింది. గంజాయికి బానిసలుగా మారి అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు కొంతమంది దుండగులు. ఇలా అక్రమంగాగంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఉదయం 10గంటలకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారినిఅరెస్ట్ చేశారు... గవర్నర్ పేట పోలీసులు.ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి750గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంకాలువ దగ్గర ఖాళీ స్థలంలో ఈ ముగ్గురు వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అనసూరి దుర్గ సాయి...మరొకరు షేక్ అబ్దుల్ జమీర్ వద్ద నుంచి 350 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.మరొకరు షేక్ అక్బర్ వలీ, 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
గత కొంతకాలంగా దుర్గా సాయి వద్ద నుంచి షేక్ అబ్దుల్ జమీర్ మరియు షేక్ అక్బర్ వలీ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లుగా విచారణలో తేలిందని గవర్నర్ పేట సీఐ తెలిపారు.అలాగే దుర్గ సాయి వాంబే కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ దుర్గా మల్లేశ్వరరావు ,లక్కీ వద్ద నుంచి కొనుగోలు చేసినట్లుగా సీఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ganja smuggling, Local News, Vijayawada