Home /News /andhra-pradesh /

VIJAYAWADA POLICE ARRESTED CHEDDI GANG WHO ROBBED HOUSES IN RECENT DAYS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Cheddi Gang: సొంతూళ్లలో కూలి పనులు.. పక్క రాష్ట్రాల్లో దోపిడీలు.. ఇదే చెడ్డీ గ్యాంగ్ లైఫ్ స్టైల్..

విజయవాడ పోలీసుల అదుపులో చెడ్డీ గ్యాంగ్

విజయవాడ పోలీసుల అదుపులో చెడ్డీ గ్యాంగ్

ఇటీవల ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో చెడ్డీగ్యాంగ్ లు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో (Guntur District) చెడ్డీగ్యాంగ్ దోపిడీలకు పాల్పడటంతో ప్రజలు హడలిపోయారు. విజయవాడ (Vijayawada) శివారుతో పాటు తాడేపల్లి ప్రాంతంలోనూ దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు.

ఇంకా చదవండి ...
    ఇటీవల ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో చెడ్డీగ్యాంగ్ లు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో (Guntur District) చెడ్డీగ్యాంగ్ దోపిడీలకు పాల్పడటంతో ప్రజలు హడలిపోయారు. విజయవాడ (Vijayawada) శివారుతో పాటు తాడేపల్లి ప్రాంతంలోనూ దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో చోరీలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు చెడ్డీ గ్యాంగ్ లోని సభ్యులను అరెస్ట్ చేశారు. విజయవాడ టూటౌన్, ఇబ్రహీంపట్నం మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు చోరీలు జరిగిన తీరు, క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన ఆధారాలు, సి.సి. కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి మూడు చోట్ల చోరీలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర చోరీ సొత్త రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు.

    పనులు లేని రోజుల్లో దోపిడీలు..
    చెడ్డీగ్యాంగ్ దొంగల ముఠాలు గుజరాత్ , మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. స్వగ్రామాల్లో కూలీ పనులు చేసుకునే వీళ్లు.. పనులు లేని సమయంలో డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో రైళ్లలో ప్రయాణించి ఇతర రాష్ట్రాలకు వెళ్లి దొంగతనాలు చేస్తుంటారు. పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో ఇళ్ల తాళాలు పగులగొట్టి డబ్బు, బంగారం దోచుకెళ్తుంటారు.

    ఇది చదవండి: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. స్నాప్ చాట్ పరిచయం.. లాంగ్ డ్రైవ్ డ్రామా.. పట్టించిన సీసీ ఫుటేజ్..


    గత నెలలో గుజరాత్ (Gujarath) రాష్ట్రం నుండి రైలులో విజయవాడ చేరుకున్నారు. నగర శివారులోని మిల్క్ ప్రాజెక్టు వద్దనున్న ఫ్లై ఓవర్ దగ్గర మకాం వేశారు. సమీపంలోని అపార్ట్ మెంట్ ను ఎంపికచేసుకున్నారు. సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఉన్నారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో మారుణాయుధాలతో అపార్ట్ మెంట్లోకి వెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. ఈనెల 1వ తేదీన గుంటుపల్లిలో ఇలాగే దోపిడీకి పాల్పడికి యత్నించి విఫలమయ్యారు. అలాగే గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలోని విల్లాల్లో దొంగతానికి యత్నించగా అక్కడ ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. తర్వాతి రోజు రాత్రి కుంచనపల్లి గ్రామంలోని ఓ అపార్ట్ మెంట్ లో నగదు, బంగారం దొంగింలించారు.

    ఇది చదవండి: స్టూడెంట్ తో లెక్చరర్ ప్రేమాయణం.. ఫిజిక్స్ క్లాస్ లో కెమిస్ట్రీ పాఠాలు.. కట్ చేస్తే..


    ఈనెల 8న పోరంకి సమీపంలోని ఓ కాలనీలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ మూడు చోరీలు ఒకే విధంగా జరగడం, సీసీ కెమెరాల్లో దొంగలు చెడ్డీలు ధరించి ఉండటంతో అన్ని కోణాల్లో దర్యాప్తు సాగించిన పోలీసులు దొంగల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.20వేల నగదు, 32 గ్రామలు బంగారం, రెండున్నర కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Theft, Vijayawada

    తదుపరి వార్తలు