Andhra Pradesh: వీళ్లు దండుపాళ్యం బ్యాచ్ కంటే దారుణం... మర్డర్ చేస్తే చిన్న డౌట్ కూడా రాదు..!

ప్రతీకాత్మక చిత్రం

దండుపాళ్యం బ్యాచ్ సంగతి తెలుసుగా... చాలా సింపుల్ గా హత్యలు చేయడం, దొరికింది దోచుకుపోవడం వారి స్టైల్. సేమ్ టు సేమ్ అలాంటి బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.

 • Share this:
  దండుపాళ్యం బ్యాచ్ సంగతి తెలుసుగా... చాలా సింపుల్ గా హత్యలు చేయడం, దొరికింది దోచుకుపోవడం వారి స్టైల్. సేమ్ టు సేమ్ అలాంటి బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. అది ఎక్కడో కాదు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడలో. సొత్తు కోసం ఒంటి మహిళలు, వృద్ధులను ఎలాంటి అనుమానాలు లేకుండా చంపేయడం అందినకాడికి దొచుకెళ్లి జల్సాలు చేయడం ఈ బ్యాచ్ ప్రవృత్తి. విజయవాడ సమీపంలోని పోరంకి, తాడిగడప ప్రాంతాలకు చెందిన ఐదుగురు యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కారు. తొలుత చైన్ స్నాచింగ్ లు, చిన్నచిన్న దొంగతనాలు చేసేవారు. కానీ ఆ డబ్బులు సరిపోకపోవడంతో మరింత క్రూరంగా మారారు. ఏకంగా హత్యలు చేసేస్థాయికి చేరుకున్నారు. వీళ్ల ప్లానింగ్ ఎలా ఉంటుందంటే.. హత్య చేస్తే కనీసం రక్తపు బొట్టుకూడా కిందపడదు. ఇంట్లో సామాన్లు ఎక్కడివక్కడే ఉంటాయి. మంచం మీద నిద్రిస్తున్నవాళ్లు నిద్రలోనే చనిపోతారు. అంతపక్కాగా స్కెచ్ వేసి చంపేస్తారు.

  హత్యలను కూడా సహజ మరణాలుగా చేయడంలో ఈ ముఠా చాలా ఆరితేరిపోయింది. ఇలా ఒక్క కృష్ణాజిల్లాలోనే ఐదు మర్డర్లు చేశారు. చివరకు ఏటీఎంలో చోరీకి యత్నించి దొరికిపోయారు. విచారణలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. పోరంకికి చెందిన ఇద్దరు, తాడిగడపకు చెందిన మరో ముగ్గురు యువకులు జులాయిగా తిరిగేవారు. ఈ గ్యాంగ్ లో ఒకడు ఇంటింటికీ ప్యాకెట్లు వేసేవాడు. అందరికీ చెడువ్యసనాలుండటంతో నేరాల బాటపట్టారు. అలాగే ఏటీఎంలు దోచేయాలని కూడా ప్లాన్ వేశారు. కానీ ఫలితం లేకపోవడంతో పాల ప్యాకెట్లు వేసే వ్యక్తి ఇచ్చిన సలహాతో గత ఏడాది పోరంకిలో ఒంటరిగా ఉంటుంన్న వృద్ధురాలిని చంపేసి ఆమె వద్ద ఉన్న నగలు, నగదు దోచుకెళ్లారు.

  ఆ తర్వాత గ్యాంగ్ లో ఒకడు కంచికచర్లలో ఉన్న తల్లిదండ్రుల షాపు చూసుకునేందుకు వెళ్లాడు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చేశాడు. ఈ క్రమంలో కంచికచర్లలో తాను ఒంటరిగా ఉంటున్న వృద్ధదంపతులను చూశానని.. వారి చంపి దోచుకుందామని ఐడియా ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన బ్యాచ్... వారిని ఎలాంటి అనుమానాలు లేకుండా హత్య చేసి ఇంట్లో ఉన్న సొత్తును దోచుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తాడిగడప కట్టవద్ద ఒకర్ని, పోరంకి పాతపోస్టాఫీస్ సమీపంలో మరో వృద్ధురాలిని చంపేసి నగలతో పారిపోయారు.

  తాజాగా తెనాలి, మంగళగిరి, అవనిగడ్డ ప్రాంతాల్లో మరో ముగ్గుర్ని చంపేందుకు స్కెచ్ వేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ గ్యాంగ్ కు మరో అలవాటు కూడా ఉంది. హత్య చేసిన తర్వాతి రోజు ఘటనాస్థలానికి వెళ్లేవారు. పోలీసులు వచ్చారా..? కేసులు నమోదు చేశారా..? అసలు వాళ్లు చనిపోయారా..? అని కన్ఫమ్ చేసుకునేవారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితులతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసినట్లు తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published: