• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • VIJAYAWADA POLICE ARRANGED OXYGEN CYLINDERS IN TIME AND SAVED 30 LIVES IN ANDHRA PRADESH AND PEOPLE APPRECIATES THE EFFORTS FULL DETAILS HERE PRN

Andhra Pradesh: 30 ప్రాణాలు నిలబెట్టిన పోలీసులు.. చెయ్యెత్తి దండం పెట్టాల్సిందే..

విజయవాడ టైమ్ ఆస్పత్రి వద్ద పోలీసులు

పోలీసులంటే లాఠీతో శిక్షించడమే కాదు.. అవసరమైనప్పుడు ఊపిరి అందించి ప్రాణాలు నిలబెడతారు. ఇదే మాటను విజయవాడ పోలీసులు చేసి చూపించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొందరు స్వల్ప లక్షణలాతో బయటపడుతుండగా మరికొందరికి సీరియస్ అవుతోంది. వీరికి ఆక్సిజన్ కూడా అత్యవసరం అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కు భారీ డిమాండ్ వచ్చిపడింది. ఆక్సిజన్ కొరత లేదా సాంకేతిక సమస్యలతో అక్కడక్కడ మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్ కు ఎక్కడా లేని డిమాండ్ వచ్చిపడుతుండటంతో కరోనా పేషెంట్ల బంధువులు ఆక్సిజన్ సిలిండర్ల కోసం పరుగులు పెడుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో సకాలంలో సిలెండర్లు అంబాటులో లేకపోవడంతో రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా కాసేపు ఉత్కంఠ నెలకొంది. వివరాల్లోకి వెళ్తే కానూరులోని టైమ్స్ ఆస్పత్రులో ఆక్సిజన్ కొరత వచ్చింది. ఒక్కసారిగా ఆక్సజిన్ అయిపోవడం.. సరఫరా చేస్తామన్న ఏజెన్సీ సకాలంలో ఇవ్వకపోవడంతో రోగుల ప్రాణాలమీదకు వచ్చింది. ఆక్సిజన్ నిల్వలు అయిపోయే సమయానికి ఆస్పత్రిలో 40 మంది కొవిడ్ రోగులుండగా.. వారిలో 30 మంది వెంటిలేటర్లపై ఉన్నారు.

    బుధవారం రాత్రి 9గంటల వరకే ఆక్సిజన్ సరిపోయేలా ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ సమయంలో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ ముత్యాల సత్యనారాయణ రంగ ప్రవేశం చేశారు. వెంటనే విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులుతో పాటు జేసీ శివశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విజయవాడలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలెండర్ల వివరాలను సేకరించి.. సకాలంలో ఆక్సిజన్ సిలెండర్లను పోలీస్ వాహనాల్లోనే టైమ్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 9గంటల లోపు నిల్వలు అయిపోతాయని ఆస్పత్రి యాజమాన్యం తెలపగా.. 8గంటల సమయానికి 10 సిలిండర్లు, రాత్రి 10 గంటలకు మరో 10 సిలిండర్లను యుద్ధ ప్రాతిపదికన ఆస్పత్రికి తరలించారు. దీంతో కొవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆక్సిజన్ అందించింది.

    ఇది చదవండి: మే 8 నుంచి కంప్లీట్ లాక్ డౌన్... రోజుకు రెండుగంటలే షాపులు.. ఎక్కడో తెలుసా..?


    గురువారం నాటికి ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థ సిలిండర్లను అందిస్తుందని.. రోగులకు వచ్చే సమస్యేమీ లేదని టైమ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ఐతే రోగులు ఆపదలో ఉన్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిముషాల వ్యవధిలో ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసి ఏకంగా 30 మంది ప్రాణాలను నిలబెట్టారు. అదే ఆక్సిజన్ అందడం ఆలస్యమైతే పెద్ద ప్రమాదమే జరిగేదని పలుపురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రోగుల బంధువుల కూడా పోలీసులు చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. ఓ వైపు కర్ఫ్యూ సమయంలో విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతను తీర్చడంతో పెద్ద గండాన్ని తప్పించారు.

    ఇది చదవండి: 'ఈ పెళ్లి నాకొద్దు'.. చివరి నిముషంలో బాంబు పేల్చిన అమ్మాయి.. కారణం ఏంటంటే..!

    Published by:Purna Chandra
    First published: