ఏపీలో కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. ఈ అంతుచిక్కని వ్యాధి బారిన పడి పందులు మృత్యువాత పడుతున్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ అంతుచిక్కని వ్యాధితో 15 రోజుల్లో సుమారు వెయ్యి పందులు చనిపోయాయి. దీంతో పందుల పెంపకందారులు ఇప్పటికే కొన్ని వందల కళేబరాల్ని పూడ్చిపెట్టగా, మరికొన్ని కుళ్లిన స్థితిలో కనిపిస్తున్నాయి.
పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవాలయం దిగువ ప్రాంతంలో కొందరు పందుల్ని పెంచుతున్నారు.అయితే అవి సమీపంలోని మునేరు పరిసరాల్లో మేతకు వెళ్లి తిరిగిరావడం లేదు. వాటి కోసం పెంపకందారులు వెతకగా అవి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. తాము మూడు దశాబ్దాలుగా పందుల్ని పెంచుతున్నాం. ఎప్పుడూ ఇలా జరగలేదు. అసలు ఏం జరుగుతుందో తమకు అర్థం కావడం లేదని చెబుతున్నారు.
పెంచిన పందుల మృతితో ఒక్కొక్కరికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది' అని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారుల మాత్రం ఈ విషయం తెలిసి...మందులిచ్చామంటున్నారు. మృతి చెందిన జంతువుల నమూనాల్ని తీసేందుకు ప్రయత్నించినా అవి కుళ్లిపోవడంతో సాధ్యం కాలేదని తెలిపారు. పందులకు ఇచ్చే ఆహారం, నీరు మార్చాలని పెంపకందారులకు సూచించామని పశువుల డాక్టర్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Local News, Vijayawada