(K.Pawan Kumar,News18,Vijayawada)
దేవుడిపై భక్తి ఉండాలి... మరీ అది పరిధిని మించి ఉండకూడదు.అలా పరిధి దాటితే ఇలాంటి ఆలోచనలే వస్తాయి అనటానికి నిదర్శనం ఈ పాస్టర్(Pastor) గారే. జీవితంపై విరక్తి చెందిన వారికి కొన్ని మంచిమాటలు చెప్పి మంచి మార్గం వైపు నడిపిచాల్సిన ఇటువంటి వారే.. ఇలా సంచలన నిర్ణయాలు తీసుకోవటం ఎంత వరకు సమంజసం. మరి ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత వరకు సరైనది అనేది భక్తుల్లో చర్చనీయశం అయింది. పది రోజుల్లో చనిపోయి.. సమాధి నుండి లేచి మూడోరోజు తిరిగి వస్తానని చెప్పిన పాస్టర్ మాటలు స్థానికంగా కలకలం రేపుతోంది.కృష్ణా జిల్లా(Krishna District)లో ఓ పాస్టర్ వింత చేష్టల స్థానికుల్ని భయాందోళనకు గురి చేశాయి.
పాస్టర్ వింత మాటలు, విచిత్ర ప్రవర్తన..
మనిషి తనంతట తానే చనిపోతాడని ముందే ఎవరికైనా తెలుస్తుందా ఒకవేళ తెలిసిన మళ్ళీ రోజుల వ్యవధిలోనే బతికి వస్తామా ? పాస్టర్ నాగభూషణంకి తాను చనిపోయేది ముందే తెలుసు అంటూ స్థానికులతో, కుటుంబ సభ్యులు తో మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. కృష్ణా జిల్లాలో ఓ పాస్టర్ వింత చేష్టల స్థానికుల్ని భయాందోళనకు గురి చేశాయి. తాను 10 రోజుల్లో చనిపోయి.. సమాధి నుంచి మళ్లీ మూడో నాడు తిరిగి లేచొస్తానని చెప్పడం స్థానికంగా కలకలం రేపింది. గన్నవరం మండలం గొల్లనపల్లికి చెందిన పాస్టర్ పులపాక నాగభూషణం చనిపోయినా తిరిగొస్తానంటూ స్థానికం ప్రచారం చేశారు. సియోను బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ పేరిట స్థానికం చర్చి నిర్వహిస్తున్న ఆయన.. చనిపోయి మూడు రోజుల తర్వాత లేస్తానంటూ సంఘస్థులతో చెప్పాడని స్థానికులు చెబుతున్నారు. నాగభూషణం తన సమాధికి స్థలం కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
చనిపోయిన పది రోజుల బ్రతికి రావడం ఏంటీ..
ఈ విషయం తెలియడంతో స్థానికులు అవాక్కయ్యారు. పాస్టర్ గురించి సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు పూర్తి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. చనిపోయిన మనిషి తిరిగి ఎలా వస్తారంటూ చర్చించుకుంటున్నారు. పాస్టర్ నాగభూషణంకు ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నట్లు తెలుస్తోంది. నాగభూషణం వింత ప్రవర్తన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఆరా తీస్తున్న అధికారులు..
నాగభూషణం ఏకంగా తాను చనిపోతున్నానంటూ ఫ్లెక్సీ కూడా ఒకటి పెట్టించుకున్నాడు. గొల్లనపల్లిలోని తన స్థలంలో సమాధి కోసం గొయ్యిని కూడా తవ్వించుకున్నాడు.. తాను చనిపోతే ఇదే సమాధిలో పెట్టాలని అందరికీ చెప్పాడు. పాస్టర్ వింత చేష్టలతో కుటుంబసభ్యులతో పాటూ స్థానికులు కంగారుపడ్డారు. చనిపోయిన మనిషి ఎలా తిరగొస్తాడని ప్రశ్నిస్తున్నారు.. పాస్టర్కు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. టెక్నాలజీలో దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు మాత్రం వీడటం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పాస్టర్ ఎందుకు ఇలా వ్యవహారిస్తున్నాడు అనేది సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.