K Pawan Kumar, News18, Vijayawada
ఒకప్పుడుపిల్లలు ఏడిస్తేనో, ఏదైనా తినాలి అంటే బుజ్జగింజి అటు ఇటు తిప్పుతూ చెట్లను, పక్షులను చూపిస్తూ బుజ్జగించే వారు. కానీ ఇప్పుడు అలా కాదు ఇంట్లోని పిల్లలు ఏడ్చిన,ఏదైనా తినాలన్నా, వాళ్ళ పనులు చేసుకోడానికైనా తల్లిదండ్రులకు అడ్డు వస్తారని.., ఫోన్ ఇచ్చి అడుకోమని ఇచ్చేస్తున్నారు. కానీ పిల్లలేమో ఆ ఫోన్లుకు బానిసలౌతున్నారు.. ఈ విషయాలు గుజరాత్లోని సౌరాష్ట్ర యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో బహిర్గతమైంది. ఆ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ విభాగం స్మార్ట్ ఫోన్ లు వాడటం వలన ఎలాంటి అనర్దాలపై ఈ మధ్య ఓ అధ్యయనం చేసింది. ఇంట్లో పెద్దవారు పనిచేసుకుంటున్నా, టీవీ చూస్తున్న వారికి అడ్డు రాకుండా ఉండటం కోసం 55% మంది తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారని మరో పరిశోధనలో తేలింది..
ఇది ఇలా ఉంటే 85% మంది పిల్లలు వారికి మొబైల్ కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారని తేలింది. 80%మంది పిల్లలు అయితే మరి దారుణంగా ఏమైనా తినాలన్నామొబైల్ ఉంటేనే దాన్ని చూస్తూనే తింటున్నారని వెల్లడైంది. ఫోన్ ఇస్తేనే తింటున్నారనిలేదంటే తినకుండా మారాం చేస్తూ ఏమి తినడం లేదని తేలింది. ఫోన్లు వాడకం వలన పిల్లల్లోఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడైంది. ఎలాంటి ఫీలింగ్ అయిన అదుపులో ఉండక పోవడం,నిద్ర సరిగ్గా రాక పోవడం, దృష్టి లోపం, నరాలబలహీనత ,చేతులు, వెన్నెముక, మెడ నొప్పులు, వీరు అందరిలో కలవ కుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారని అధ్యయనంలో తేలింది.
అయితే ఇదే విషయంపై విజయవాడకు చెందిన చిన్న పిల్లలు మానసిక వైద్యుడు ఇండ్ల విశాల్ రెడ్డి స్పందిస్తూ... ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దని వాటికి బానిసలు అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుని చెబుతున్నారు. పిల్లలు ముందు తల్లిదండ్రులు ఫోన్ లు వాడకం తగ్గించి కాస్త పిల్లలతో సరాదగా సమయాన్ని కేటాయిస్తే పిల్లలు స్మార్ ఫోన్ వైపు మళ్లే అవకాశం ఉండదని అంటున్నారు. అలాగే ఔట్ డోర్ గేమ్స్ ఆడేందుకు పిల్లలు ఆసక్తి చూపే విధంగా చేస్తే మంచిదని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada