• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VIJAYAWADA OXYGEN TANKER GONE MISSING IN ANDHRA PRADESH AS VIJAYAWADA POLICE FIND IT WITHIN AN HOUR AND SENT IT THROUGH GREEN CHANNEL FULL DETAILS HERE PRN GNT

Andhra Pradesh: హైవేపై ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్... అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పోలీసులు..

Andhra Pradesh: హైవేపై ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్... అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పోలీసులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఆక్సిజన్ ట్యాంకర్లు కొవిడ్ రోగులకు ఊపిరి పోస్తున్నాయి. కొవిడ్ విజృంభిస్తున్న వేల ఆఖిసజన్ కు డిమాండ్ ఏర్పడింది.

  • Share this:
    ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ఆక్సిజన్ అత్యవసరమవుతోంది. కొవిడ్ బాధితులను బ్రతికించేందుకు ప్రాణవాయువుకు డిమాండ్ ఏర్పడుతోంది. ఆక్సిజన్ అందించడం కాస్త ఆలస్యమైనా.. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఒడిశా నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ఐతే ఎమర్జెన్సీ కోసం అందించే ఆక్సిజన్ తీసుకొస్తున్న వాహన డ్రైవర్ కు సడన్ గా నిద్రొచ్చింది. దీంతో వందల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విలవిల్లాడారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా నుంచి 18 టన్నుల ద్రవరూప ఆక్సిజన్ తో బయలుదేరిన టాంకర్ శుక్రవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి చేరవలసి ఉంది. ఐతే అనుకున్న సమయానికి ట్యాంకర్ రాకపోగా.. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారులు ఆందోళన చెందారు. ఓవైపు రోగులకు పెట్టిన ఆక్సిజన్ నిల్వలు తరిగిపోతుండగా.. మరోవైపు ఆక్సిజన్ ట్యాంకర్ ఆచూకీ గల్లంతైంది. దీంతో వందలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విలవిల్లాడిపోయారు.

    జీజీహెచ్ అధికారులు ఈ విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన సిటీ పోలీస్ కమిషనర్.. ఒడిశా నుంచి విజయవాడ వచ్చే అన్ని మార్గాల్లో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ఈ మార్గమధ్యలో అన్ని ఏరియాల్లో గాలించగా.. తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం వద్ద ఓ దాబాలో పోలీసులు ట్యాంకర్ ను కనుగొన్నారు. పోలీసులు డ్రైవర్ ను ప్రశ్నించగా.. ఒడిశాలో బయలుదేరిన ప్రాంతం నుంచి విజయవాడకు దాదాపు 900 కిలోమీటర్లు దూరం ఉందని..ఏక ధాటిగా డ్రైవింగ్ చేస్తుండటంతో అలసిపోయాయని వివరించాడు.

    డ్రైవర్ పరిస్థితిని అర్ధం చేసుకున్న పోలీసులు బాగా డ్రైవింగ్ తెలిసిన హోమ్ గార్డును రంగంలోకి దించారు. అంతేకాకుండా ధర్మవరం నుంచి విజయవాడకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం సాయంతో ఆక్సిజన్ ట్యాంకర్ ను విజయవాడకు తరరించారు. సకాలంలో ఆక్సిజన్ ను ఆస్పత్రికి చేర్చిన పోలీసులు వందలాది మంది కొవిడ్ బాధితుల ప్రాణాలు నిలబెట్టారు. ఆక్సిజన్ అత్యవసరమైన వేళ విజయవాడ పోలీసులు స్పందించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.

    ఇక రెండు రోజుల క్రితం కానూరులోని టైమ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు మరో గంటలో నిండుకుంటాయన్న తరుణంలో విజయవాడ పోలీసులు స్పందించి కేవలం గంట వ్యవధిలో 20 ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 30 మంది ప్రాణాలను కాపాడారు. కొవిడ్ విజృంభిస్తున్న వేళ లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి నిబంధనలు అమలు చేస్తున్న పోలీసులు.. అత్యసవర సమయంలో ఆపద్బాంధవుల అవతారమెత్తి కొవిడ్ రోగులకు ప్రాణం పోస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: