VIJAYAWADA OFFICIALS CEASED DECOMPOSED MUTTON IN VIJAYAWADA AS SELLERS NOT FOLLOWING RULES FULL DETAILS HERE PRN
Vijayawada: సండే వస్తే మటన్ లాగిస్తున్నారా..? ఈ సీన్ చూస్తే ముక్క ముట్టరు..! బాబోయ్ ఇంత దారుణమా..?
అధికారులు సీజ్ చేసిన మటన్
అదివారం (Sunday) వస్తే చాలు నాన్ వెజ్ (Non-Veg) ప్రియులు చికెన్ (Chicken(, మటన్ (Mutton) అంటూ పరుగులు పెడుతుంటారు. రూపాయి ఎక్కువైనా సరే మటన్ తెచ్చుకొని చక్కగా లాగించేస్తుంటారు. వీకెండ్ లోనే కాదు అప్పుడప్పుడు వారం మధ్యలో కూడా కొందరికి ముక్కలేనిదే ముక్కదిగదు.
అదివారం (Sunday) వస్తే చాలు నాన్ వెజ్ (Non-Veg) ప్రియులు చికెన్ (Chicken(, మటన్ (Mutton) అంటూ పరుగులు పెడుతుంటారు. రూపాయి ఎక్కువైనా సరే మటన్ తెచ్చుకొని చక్కగా లాగించేస్తుంటారు. వీకెండ్ లోనే కాదు అప్పుడప్పుడు వారం మధ్యలో కూడా కొందరికి ముక్కలేనిదే ముక్కదిగదు. అందుకే మార్కెట్ కు వెళ్లి దొరికిన చోట మటన్ తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు. ఐతే బయట నడిచే 90శాతం మటన్ దుకాణాల్లో ఎలాంటి నిబంధనలు పాటించరు. మటన్ కొట్టేయడం అమ్మేయడం మాత్రమే వ్యాపారులకు తెలుసు. కొందరు కాసుల కోసం అడ్డగోలుగా నాసిరకం మాంసాన్ని జనానికి అంటగడుతుంటారు. అధికారుల తనిఖీల్లో అలాంటి మోసాలు బయటపడుతుంటాయి. తాజాగా విజయవాడ (Vijayawada) మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు జరిపిన దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సీన్ చూస్తే అసలు మటన్ వైపు కన్నెత్తు చూడరు. విజయవాడలోని రాణిగారి తోట ప్రాంతంలో అధికారులు మటన్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. దాడుల్లో దాదాపు వంద కిలోల కుళ్లిపోయిన మాంసాన్ని సీజ్ చేశారు. కొందరు మటన్ వ్యాపారులు ఇతర జిల్లాల నుంచి చనిపోయిన జీవాలు, అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నిర్వహించే సంతల్లో చనిపోయిన గొర్రెలు, మేకలను తీసుకొస్తున్న వ్యాపారులు.. వాటిని కోసి పేగులు, అవయవాలను తొలగించి ఐస్ ముక్కలు పెట్టేసి ఆ మాంసాన్ని డీప్ ఫీజర్లో పెడుతున్నారు. వాటిని చిన్నచిన్న హోటళ్లు, పేదలు నివాసముండే ప్రాంతాల్లో మార్కెట్ ధరకంటే కాస్త తక్కువకు విక్రయించేస్తున్నారు. చనిపోయిన జీవాలను కేవలం వెయ్యి, రెండు వేలకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. వాటిని ఇక్కడికి తెచ్చి కేజీ రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలాంటి దుకాణాలు విజయవాడలో పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా అధికారులు సీజ్ చేసిన మాంసం పురుగులు పట్టి కుళ్లిపోయే దశలో ఉంది. అక్రమ వ్యాపారం చేస్తున్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మనం తినే మాంసం మంచిదేనా అని అంతా ఆందోళన చెందతున్నారు. గతంలోనూ విజయవాడలో నాసిరకం మాంసం విక్రయిస్తున్నవారిపై కేసులు నమోదు చేసినా కఠిన చర్యలు మాత్రం తీసుకోలేదు. రెస్టారెంట్లలో కూడా మాంసాన్ని రోజుల తరబడి ఫ్రిజర్లో పెట్టి వాటిపై ఆకర్షణీయమైన రంగుల చల్లి వంటల్లో వాడేస్తున్నారు. ఇదిలా ఇంటే నిల్వ ఉంచిన, పాడైపోయిన మాంసం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని.. డయేరియా, క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.