హోమ్ /వార్తలు /andhra-pradesh /

AP Fake challan Scam: ఇంజనీరింగ్ తెలివి అవినీతిలో చూపించాడు... ఏడాదిలోనే కోట్లలో స్కామ్..

AP Fake challan Scam: ఇంజనీరింగ్ తెలివి అవినీతిలో చూపించాడు... ఏడాదిలోనే కోట్లలో స్కామ్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని సబ్ రిజిస్ట్రాల్ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలానాల స్కామ్ (Fake Challan Scam) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని సబ్ రిజిస్ట్రాల్ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలానాల స్కామ్ (Fake Challan Scam) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని సబ్ రిజిస్ట్రాల్ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలానాల స్కామ్ (Fake Challan Scam) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

  అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

  ఆంధ్రప్రదేశ్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలానాల స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు చెల్లించిన చనాల్సను మార్ఫింగ్ చేసి ఎక్కువగా చూపిస్తూ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు చేసిన అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బయటపడుతున్నాయి. ఐతే రిజిస్ట్రేషన్ శాఖలో వెలుగు చూసి స్కామ్ ప్రతిఒక్కరూ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. కృష్ణాజిల్లాలోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఓ డాక్యుమెంటర్ రైటర్ చేసిన స్కామ్ ఉన్నతాధికారుల్నే ఆశ్చర్యపోయేలా చేసింది. మండవల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం తమ భూములు రిజిస్ట్రేషన్ కోసం చాలామంది అక్కడకు వచ్చారు కానీ అక్కడ ఒకే ఒక్క డాక్యూమెంట్ రైటర్ ఉన్నాడు అతనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు చూస్తుంటాడు మరియు క్రయ విక్రయ దారులకు దస్తావేజులు రాయటం వాటికి సంబంధించిన వ్యవహారాలు అన్ని తానే చూసుకునేవాడు.

  ఈ మధ్య కాలం లో స్థిరాస్తి వ్యాపారం ఉపందుకోవటంతో తన కుమారుడు సహాయకునిగా పెట్టుకున్నాడు. ఐతే అసలు కథ ఇక్కడే మొదలయింది. ఇంజినీరింగ్ చదివిన ఆ యువకుడు తనలోని కంప్యూటర్ ప్రతిభను ఇక్కడ ప్రదర్శించాడు. పది లక్షలు కాదు 20 లక్షలు కాదు ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలకు గండి కొట్టాడు. ప్రభుత్వానికి చెల్లించవలసిన స్టాంప్ డ్యూటీకి సంబంధించిన చలానాలను తన కంప్యూటర్ పరిజ్ఞానంతో మార్ఫింగ్ చేశాడు. లక్ష రూపాయలు చెల్లించాల్సిన చోట 10వేలు మాత్రమే చలానాలు కట్టించి వాటిని మార్ఫింగ్ చేసి సిఎంఎఫ్ విధానంలో అప్లోడ్ చేయించాడు. అలా అందినకాడికి దోచుకున్నాడు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరియు రొయ్యల చెరువులలో పెట్టుబడులుగా పెట్టి తన సంపాదనను పెంచుకున్నాడు. ఇక్కడ సంవత్సరానికి సుమారు 9 కోట్ల ఆదాయం ఉంటె 2 .5 కోట్ల రూపాయలు వీరు అవినీతికి పాల్పడ్డారు.

  ఇది చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త అడ్డుగా ఉన్నాడని మేనల్లుడితో కలిసి మర్డర్ స్కెచ్..

  రిజిస్ట్రేషన్ శాఖలో వెలుగుచూసిన అవినీతి కుంభకోణంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణానికి సంబంధించి 258 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐతే నోటీసులు అందుకున్న క్రయదారుల రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాకపోవటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కుంభకోణంలో క్రయదారుల పాత్ర లేకపోయినప్పటికీ ఇప్పుడు వారే బాధితులుగా మిగిలారు. దస్తావేజు లేఖరి డబ్బు క్రయదారులకు చెల్లించక పోయిన క్రయదారులే మళ్లీ డబ్బు చెల్లించి తమ దస్తావేజులను చెల్లుబాటులోకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నోటీసులు అందుకున్నవారిలో కొందరు కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్ కు సంబంధించిన రొయ్యల చెరువులు, ఇతర స్థలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు స్కామ్ వెలుగు చూడటంతో మండవల్లి సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

  First published:

  ఉత్తమ కథలు