హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada Rahul Murder Case: సత్యం స్కెచ్.. సీతయ్య యాక్షన్.. రాహుల్ హత్య కేసులో షాకింగ్ నిజాలు..

Vijayawada Rahul Murder Case: సత్యం స్కెచ్.. సీతయ్య యాక్షన్.. రాహుల్ హత్య కేసులో షాకింగ్ నిజాలు..

రాహుల్, కోగంటి సత్యం (ఫైల్)

రాహుల్, కోగంటి సత్యం (ఫైల్)

Vijayawada: సంచలనం సృష్టించిన విజయవాడ యువ పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసులో మిస్టరీ వీడింది.

సంచలనం సృష్టించిన విజయవాడ యువ పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆర్ధిక లావాదేవీల్లో రేగిన వివాదమే హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. రాహుల్ ను పక్కా స్కెచ్ వేసి హతమార్చినట్లు నిర్ధారించారు. కేసులో కీలకంగా మారిన రౌడీ షీటర్ కోగంటి సత్యంను అదుపులోకి తీసుకోవడంతో ఇందులోని అన్ని చిక్కుముడులు వీడిపోయాయి. హత్యలో కోరాడ విజయ్ కుమార్, ఆయన భార్య పద్మజ, కోగింటి సత్యం, గాయత్రి అనే మహిళ, సీతయ్య, బాబూరావు అనే వ్యక్తుల ప్రమేయమున్నట్లు తేలింది. మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ గాయత్రి వద్ద రాహుల్ రూ.6కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీటు ఇప్పించకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గాయత్రి.. రాహుల్ పై ఒత్తిడి తెచ్చింది రాహుల్ తండ్రి రాఘవరావు తొలుత రూ.50 లక్షలు ఇస్తామని గాయత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలో ఈనెల 18న రాత్రి 7.30 నిముషాలకు గాయత్రి.. రాహుల్ కు ఫోన్ చేయగా.. ఒక్కడే కారులో బయటకు వెళ్లాడు. ఆమె మాట్లాడిన తర్వాత రాహుల్ కారులో కోరాడ విజయ్, సీతయ్య, బాబూరావు ఎక్కారు. ఈ క్రమంలో డబ్బులు తెచ్చావా..? అని నిదీశాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. కారులో ఉన్న సీతయ్య అనే వ్యక్తి రాహుల్ మెడకు వైరు బిగించగా.. బాబూరావు దిండుతో మొహాన్ని అదిపట్టుకున్నాడు. దీంతో అక్కడికక్కడే రాహుల్ మృతి చెందాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఇది చదవండి: ఫోన్లో మహిళల వలపు వల.., ఇంటికి పిలిపించి ఏకాంతంగా ఉన్నసమయంలో...


ఆ రోజు రాత్రంతా రాహుల్ ఇంటికి రాకపోవడంతో తర్వాతి రోజు ఉదయం అతడి తండ్రి రాఘవరావు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో గుణదల వద్ద కారులో గుర్తుతెలియని శవమున్నట్లు సమాచారం అందింది. అది రాహుల్ మృతదేహంగా గుర్తించి పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం హత్య కేసు నమోదు చేసున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా కోరాడ విజయ్ కుమార్, కోగంటి సత్యం పాత్ర ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

ఇది చదవండి: భర్త జైలుకెళ్లడంతో వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. కట్ చేస్తే అడవిలో శవమై తేలింది...


మాస్టర్ మైండ్ కోగంటి..?

రాహుల్ హత్యకు విజయవాడకు చెందిన రౌడీ షీటర్ కోగంటి సత్యం స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాహుల్ ను ఎలా హతమార్చాలి. ఎవరిని రంగంలోకి దించాలి. హత్య తర్వాత ఎలా వ్యవహరించాలి.. పోలీసులకు అనుమానం రాకుండా ఎలా ఉండాలనేదానిపై కోగంటి సత్యం నిందితులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హత్య తర్వాత పేరు బయటకు వస్తే ఎలా లొంగిపోవాలనేది కూడా కోరాడ విజయ్ కుమార్ కు కోగంటి సత్యమే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.  కోగంటి సత్యం 2019లో హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో నిందితుడిగా  ఉన్న సంగతి తెలిసిందే..!

ఇది చదవండి: అన్నకు ఆనందంగా రాఖీ కట్టిన చెల్లెలు.. కానీ కాసేపటికే అతడు విషాద వార్త వినాల్సి వచ్చింది...


రాహుల్ హత్య తర్వాత కోగంటి పేరు బయటకు రావడంతో అతన్ని మీడియా సంప్రదించింది. ఐతే హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఎవరో అనవసరంగా తనపేరు బయటకు తెచ్చారని సత్యం బుకాయించారు. కానీ అతడే హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి విజయవాడ తరలించారు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Murder, Vijayawada

ఉత్తమ కథలు