హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అక్కడ ఒకేసారి వెయ్యి పందులు మృతి.. వింత వ్యాధి కమ్మేస్తోందా..?

అక్కడ ఒకేసారి వెయ్యి పందులు మృతి.. వింత వ్యాధి కమ్మేస్తోందా..?

X
ఎన్టీఆర్

ఎన్టీఆర్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇప్పటికే హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) తో మనుషులు ఇబ్బందులు పడుతుంటే. మరోవైపు జంతువులు కూడా అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Jaggaiahpet (Jaggayyapeta), India

Yashwanth, News18, Jaggayyapeta

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇప్పటికే హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) తో మనుషులు ఇబ్బందులు పడుతుంటే. మరోవైపు జంతువులు కూడా అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు గ్రామంలో పందులు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. గత పదిరోజుల్లో దాదాపు వెయ్యి పందులు మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది. పెనుగంచిప్రోలు గ్రామంలోని తిరుపతమ్మ దేవస్థానం దిగుబాగాన ఉన్న ప్రాంతంలో పందులు పెంపకం చేస్తూ ఉంటారు. ఇవన్నీ పెనుగంచిప్రోలు మున్నేరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. స్థానికంగా ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికివచ్చిన భక్తులు మెుక్కులు చెల్లించిన అనంతరం స్థానికంగా ఉన్న మామిడి తోటల ఫంక్షన్ హాల్స్ లో కార్యక్రమాలు నిర్వహించుకొని వెళుతూ ఉంటారు.

ఆ సమయంలో మిగిలిన ఆహారాన్ని అక్కడ నుంచి తీసుకువచ్చి పందులకు మేతగా పెడుతూ ఉంటారు అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తూ మేత మేస్తూ ఉంటాయి. గత కొన్ని రోజుల నుంచి మేతకు వెళ్ళిన పందులు ఎక్కడివి అక్కడే మృతి చెందడంతో పెంపకదారులు ఆందోళన గురయ్యారు. గత పది నుంచి పదిహేను రోజుల్లోనే సుమారు 1500పైగా పందులు మృతి చెందాయి. వాటిని ఎక్కడివి అక్కడే గొయ్యి తీసి పూడ్చి పెట్టారు.

ఇది చదవండి: ఏపీని వ‌ణికిస్తున్న ఫ్లూ భ‌యం.. సర్వేలో సంచలన నిజాలు..!

గ్రామపంచాయతీ వారి సహాయంతో జెసిబితో భారీ గుంతతీసి బ్లీచింగ్ చల్లి పూడ్చిపెట్టారు. పందులు మృతి చెందటంతో పెంపకదారులు స్థానికంగా ఉన్న పశువు వైద్యులను సంప్రదించగా వారు పలు సూచనలు చేసి వైద్య సేవలు అందించారు. అయినా అవి మృతి చెందడంతో మరుసటి రోజున జిల్లా వైద్యులు పెనుగంచిప్రోలు గ్రామానికి చేరుకొని విచారణ జరిపారు. పందులు సంచరించిన ప్రదేశాలను పరిశీలించి పెంపకదారుల నుంచి మరిన్ని వివరాల సేకరించారు.

పందులు చనిపోయిన ప్రదేశాలలో వివరాలు నమోదు చేసుకొని అవి తినే ఆహారాన్ని ఏమిటని వివరాలు నమోదు చేశారు. అక్కడే తీవ్ర అస్వస్థతకు గురైన పందుల నుంచి నమూనాలు సేకరించి టెస్టులకు పంపారు. పరీక్షల రిజల్ట్ వస్తే పందులకు వచ్చిన వ్యాధి ఏంటనేది నిర్ధారిస్తామన్నారు. అలాగే స్థానికులు కొంతకాలం పందులకు దూరంగా ఉండాలని, పందిమాంసం కూడా తినరాదని సూచనలిచ్చారు. ఇప్పటికే జనం ఫ్లూ జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే పందులకు సోకిన రోగం తమకూ సోకుతందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు