Home /News /andhra-pradesh /

VIJAYAWADA MUSLIM ASSOCIATION CELEBRATING SANKRANTHI FESTIVAL IN VIJAYAWADA ANDHRA PRADESH PRN

Sankranthi Festival: సంక్రాంతి ముబారక్..! హిందూ-ముస్లిం భాయ్..భాయ్..! ఇదే అసలైన పండగ..

విజయవాాడలో ముస్లింల సంక్రాంతి సంబరాలు

విజయవాాడలో ముస్లింల సంక్రాంతి సంబరాలు

తెలుగువారి పండుగలలో సంక్రాంతికి విశేష ప్రాధాన్యత ఉంది. పంట చేతికి వచ్చిన సమయంలో అన్నదాతలు సంతోషంగా నిర్వహించుకునే వేడుక సంక్రాంతి (Sankranthi Festival)

  సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ. సంక్రాంతి వస్తే చాలు హిందువులు భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. అందుకే తెలుగువారి పండుగలలో సంక్రాంతికి విశేష ప్రాధాన్యత ఉంది. పంట చేతికి వచ్చిన సమయంలో అన్నదాతలు సంతోషంగా నిర్వహించుకునే వేడుక సంక్రాంతి. సాధారణంగా సంక్రాంతి పండుగను హిందువులు ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మత సామరస్యానికి ప్రతీకగా కృష్ణాజిల్లా, విజయవాడలోని ముస్లిం సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. బందరు రోడ్డు వైవీ రావు ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముస్లింలు, హిందువులు హాజరైన సంతోషంగా పండుగను జరుపుకున్నారు. తొలుత ముస్లిం మత పెద్దలు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  రంగవల్లులు, హరిదాసులు, పిండివంటలు, గంగిరెద్దులతో హిందువులకు ధీటుగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా మత సామరస్యానికి ప్రతీకగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నామన్న మత పెద్దలు తెలిపారు. హిందూ, ముస్లింలు కలిసి సంక్రాంతి జరుపుకోవడం సంతోషాన్ని ఉందని స్థానికులు అంటున్నారు.  అన్ని మతాల సమానమేనని, అందరిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు తెలిపారు. మతాల పేరుతో మనుషుల మధ్యన విద్వేషాలు సృష్టించడం సరికాదన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ సంక్రాంతి సంబరాలకు పోలీసులు కూడా హాజరై ముస్లిం సంక్షేమ సమితి సభ్యులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఐక్యమత్యం పెరుగుతుందని.. విద్వేషాలకు తావుండే అవకాశముండదని చెప్తున్నారు.

  మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం ప్రజలంతో భోగి మంటలతో సంతోషంగా గడిపారు. కొత్త అల్లుళ్లు, రంగ వల్లులు, గంగిరెద్దులు, పిండివంటలు, కొత్తబట్టలతో అందరూ సందడిగా గడుపుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కోడి పందేలు కూడా జోరుగా సాగుతున్నాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందలాది బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులే పందేలను ప్రారంభించారు. నిన్నటి వరకు అనుమతులు లేవంటూ హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు పండుగ వచ్చేసరికి కాస్త మెత్తబడ్డారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Muslim Minorities, Sankranti 2021, Vijayawada

  తదుపరి వార్తలు