Andhra Pradesh: ప్రభుత్వం నుంచి బిల్లులు ఇలా కూడా వసూలు చేస్తారా...? కోర్టు సంచలన తీర్పు..

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రభుత్వమైనా, ప్రైవేట్ వ్యక్తులైనా చేయించుకున్న పనులకు సకాలంలో బిల్లులు చెల్లించాలి. కానీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (Vijayawada Municipal Corporation) అధికారుల నిర్లక్ష్యంతో పరువు పోయే పరిస్థితి వచ్చింది.

  • Share this:
    ప్రభుత్వ పనులంటే కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తాయి. కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు సకాలంలో బిల్లులు చెల్లించాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అసత్వంతో కాంట్రాక్టర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి తిరిగినా బిల్లులు విడుదల చేయరు. కొందరు కాంట్రాక్టర్లైతే తమకున్న పలుకుబడిని ఉపయోగించి బిల్లులు రిలీజ్ చేయించుకుంటుంటారు. అలా కాని పక్షంలో కోర్టులకు వెళ్తారు. అదేంటి ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తే గెలుస్తామా..? సెటిల్ చేసుకుంటే ఎంతో కొంత వస్తుందిగా అని అనుకుంటున్నారా..? కానీ ఆంధ్రప్రదేశ్ లో ఓ కాంట్రాక్టర్ తన బిల్లుల కోసం కోర్టుకెళ్లి గెలిచాడు. తీర్పులో భాగంగా కోర్టు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే ఎటాచ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ మున్సిపల్ కమిషనర్ పరిధిలోని బీఆర్టీఎస్ రోడ్డు వెంట పలు ప్రాంతాల్లో కాలువలపై బ్రిడ్జిల నిర్మాణాన్ని హైదరాబాద్ కు చెందిన కాంటెక్ సిండికేట్ అనే కాంట్రాక్ట్ సంస్థ చేపట్టింది. సకాలంలో పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పజెప్పింది.

    అయితే పనులు చేయించుకున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్.. బిల్లులు మాత్రం విడుదల చేయలేదు. అధికారులు నిర్లక్ష్యంతో నిధులు విడుదల కాలేదు. దీంతో కాంట్రాక్ట్ సంస్థ కోర్టుకు వెళ్లింది. దీంతో ధర్మాసనం అర్బిట్రేటర్ ను నియమించింది. ఐతే సమస్యను బయట సెటిల్ చేసుకుంటామంటూ కార్పొరేషన్ కోర్టుకు చెప్పింది. దీంతో న్యాయమూర్తి ఆధ్వర్యంలో చర్చలు జరిపిన తర్వాత మొత్తం రూ.18 కోట్ల బిల్లులకు గానూ రూ.9 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత నిధులు మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో కాంట్రాక్టర్ మరోసారి కోర్టును ఆశ్రయించి అవార్డు పొందారు.

    ఇది చదవండి: ఏపీలో మరోసారి లాక్ డౌన్... నాలుగు గంటలే పర్మిషన్.. ఎక్కడో తెలుసా..?


    ఆవార్డును అమలు చేయాలంటూ ఎగ్జిక్టూటివ్ పిటిషన్ వేసి.. అందులో కమిషనర్ బంగ్లాను అటాచ్ చేయాలని కోరారు. దీంతో కాంట్రాక్టర్ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. దీంతో బందర్ రోడ్డులోని 2,592 చదర మీటర్ల విస్తీర్ణంలోని బంగ్లాను అటాచ్ చేసింది. ఈబంగ్లా విలువ రూ.23.25 కోట్లు ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం.., అధికారుల అలసత్వం వెరసి.. ఏకంగా కమిషనర్ బంగ్లాను అటాచ్ చేసే స్థితికి తెచ్చింది. 50శాతం బిల్లులు చెల్లించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తువం విజయవాడలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్టర్ కు డబ్బులు చెల్లించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ పరువు పోతోందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం స్పందించి సకాలంలో బిల్లులు చెల్లింస్తుందో లేదో వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published: