హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: ముంబై టు విజయవాడ.. ఆట వస్తువుల మాదిరి చిన్నపిల్లల అమ్మకం...!

Vijayawada: ముంబై టు విజయవాడ.. ఆట వస్తువుల మాదిరి చిన్నపిల్లల అమ్మకం...!

కిడ్నాప్ కలకలం

కిడ్నాప్ కలకలం

మహారాష్ట్ర లోని పర్భాని జిల్లా కొత్వాలిలో అపహరణకు గురైన పిల్లలు ను ఇక్కడ కు తీసుకొచ్చి విక్రయించడంలో విజయవాడకు చెందిన శ్రావణి, జగ్గయ్యపేట కి చెందిన శిల్ప అసలు సిసలైన పా త్రలు పోషించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

రిపోర్టర్ : పవన్ కుమార్

లొకేషన్ : విజయవాడ

చిన్న పిల్లలు అంటే ఇష్టపడని వారు ఎవరుండరు. ప్రతి ఇంట్లో పిల్లల అల్లరి, వారి నవ్వులతో ఇల్లు అంతా సందడి చేస్తూ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ ఆశ కొందరికి నెరవేరుతుంది.. మరికొందరికి ఆ అదృష్టాన్ని దూరం చేస్తుంది విధి. కానీ వారి దురదృష్టాన్ని ఆసరాగా చేసుకుని ఒక ముఠా వ్యాపారం సాగిస్తుంది. మహారాష్ట్ర నుండి పిల్లలుని తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకి ఆశ కల్పించి లక్షలకు బేరం పెట్టేస్తున్నారు. జిల్లాలోని జగ్గయ్యపేట చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఇలాగే బేరం పెట్టారు. ఈ ముఠా లక్షల్లో లాభాలు చూసుకుని పిల్లలని ఒ క వస్తువు మాదిరి అమ్మేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా వరకు విస్తరించిన ఈ కిడ్నాప్ రాకెట్ లో కీలకపాత్ర మహిళలదే కావడం విశేషం. గత సంవత్సరం నుండి ఈ ముఠా ఈ తరహా కిడ్నాప్, అమ్మకాలు సాగించగా.. ముఠా పాపం పండి దొరికిపోయారు. ఈ కిడ్నాప్ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మహిళ భర్తే అమ్మకాలలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 20 మందికి పైగా బ్రోకర్లును ఈ రాకెట్ లో వినియోగిస్తున్నట్టు సమాచారం. అసలు పిల్లలు లేని వారిని, మగ పిల్లలు లేని వారిని ఆసరాగా చేసుకుని ఈ వ్యాపారం మొదలు పెట్టగా.. కరోనా సమయంలో పిల్లల తల్లిదండ్రులు చనిపోయారని, పిల్లలును పోషించడానికి సరైన తిండి, సరైన పోషణలేక అమ్మేశారని నమ్మించి ఇక్కడ అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది నమ్మిన పిల్లలు లేని దంపతులు వారి అడిగినంత భారీ మొత్తంలో డబ్బు చెల్లించి పిల్లలను కొంటున్నారు. పిల్లలపై ఉన్న ఇష్టంతో వారిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వారిపై ఆశలు పెట్టుకున్న అనంతరం మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఆ పిల్లలను తీసుకెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఈ ముఠాలో ఇక్కడ పిల్లల అమ్మకంలో విజయవాడకు చెందిన శ్రావణి, జగ్గయ్యపేటకి చెందిన శిల్ప అసలు సిసలైన పాత్రలు పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలోని పర్భాని జిల్లా కొత్వాలిలో అపహరణకు గురైన పిల్లలను ఇక్కడకు పంపించడంలో మహారాష్ట్రకు చెందిన సమీరా, నూర్జహాన్, సుల్తానా ముఠా పాత్ర పోషించినట్లు కనుకొన్నారు. మహారాష్ట్ర ముఠాతో శ్రావణి, శిల్ప సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఇక్కడ అమ్మకాలు జరిపారు. ఈ ముఠా ఇప్పటికే నలుగురు మగ పిల్లలను స్థానికంగా కొంతమందికి అమ్మేసినట్లు తెలుస్తుండగా.. మహారాష్ట్రకి చెందిన ఈ నలుగురు పిల్లలని రూ.1 లక్ష నుండి రూ.3 లక్షల వరకు అమ్మినట్లు భావిస్తున్నారు. అయితే, ఆ పిల్లలు ఉన్న అడ్రెస్ తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు మళ్ళీ ఆ పిల్లలను మహారాష్ట్రకి తరలిస్తున్నారు.

ఐదు రోజుల క్రితం జగ్గయ్యపేటలోని మార్కెట్‌ యార్డ్‌లో ఆదివారం పాఠశాల వార్షికోత్సవం జరుగుతుండగా.. జగ్గయ్యపేట పోలీసులతో కలిసి వచ్చిన మహారాష్ట్ర పోలీసులు.. పక్కా ఆధారాలు, కేసు పత్రాలు చూపించి ఒక బాలుడిని తీసుకెళ్లిపోయారు. ఏడాదిగా పెంచుకుంటున్న బాలుడిని మహారాష్ట్ర పోలీసులు తీసుకువెళ్తుంటే.. పెంచిన తల్లి బోరున విలపించారు. ఈ కేసులో విజయవాడకు చెందిన శ్రావణి, మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన శిల్పను అదుపులోకి తీసుకుని విచారించడంతో.. బాలుడి ఆచూకీ లభించగా.. పూర్తి సమాచారం, పత్రాల ఆధారంగానే మహారాష్ట్ర పోలీసులకు అప్పగించినట్లు జగ్గయ్యపేట పోలీసులు వెల్లడించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఈ ఘటన తర్వాత కూపీ లాగడంతోనే మరో ముగ్గురు బాలురను ఇలాగే అమ్మేసినట్లు తెలియగా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది.

First published:

Tags: Kidnap, Local News, Vijayawada

ఉత్తమ కథలు