హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

VIjayawada: ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అక్కడ మరో ముఖ్యమైన మునేశ్వరుడు ఉన్నాడని తెలుసా..!

VIjayawada: ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అక్కడ మరో ముఖ్యమైన మునేశ్వరుడు ఉన్నాడని తెలుసా..!

దుర్గమ్మకు

దుర్గమ్మకు పరమభక్తుడికా మౌనస్వామి

బెజవాడ అనగానే ముందుగా గుర్తొచ్చేది దుర్గమ్మ (Kanakadurgamma). అలాంటి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం (Durga Temple Darshan) మాత్రమే కాదు మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ కొండపైన ఉన్న ప్రతి రాయి, ప్రతి చెట్టు పవిత్రమైనదే.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  బెజవాడ అనగానే ముందుగా గుర్తొచ్చేది దుర్గమ్మ (Kanakadurgamma). అలాంటి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం (Durga Temple Darshan) మాత్రమే కాదు మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ కొండపైన ఉన్న ప్రతి రాయి, ప్రతి చెట్టు పవిత్రమైనదే. మరి ముఖ్యంగా ఈ ఇంద్రకీలాద్రిపై మౌనస్వామి అనే వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటుంటారు. ఈ తరానికి పెద్దగా తెలియని ఆ ముని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పూర్వం దుర్గమ్మ వెలసిన ఇంద్రకీలాద్రి పై అనేక మంది యోగులు ఉండేవారని పూర్ణాలు,ఇతిహాసాలు చెబుతన్నాయి. అలా వచ్చిన వారిలో మౌన స్వామి ఒకరు. యోగులు ఎందరున్నా మౌనస్వామికి మాత్రం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకస్థానం ఉంది. ఆయన కొండపై జీవించినంత కాలం మౌనంగా ఉంటూ అమ్మ సేవలో నిమగ్నం అయి ఉండేవారట.

  ఇంద్ర కీలాద్రిపైన కలియుగం వచ్చాక అనేకమంది యోగులు వచ్చి అమ్మవారిని అర్చించి ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు. ముందుగా శంకరాచార్యులు వారు వచ్చి అమ్మవారిని కనకధార స్తోత్రం చదివి ప్రసన్నురాలిని చేశారు. అందుకే అమ్మవారికి కనుక దుర్గ అనే పిలుపు వచ్చింది. కనక వర్షం కురిపించి ఈ ప్రాంతం కనకవాడగా వెలసిల్లుతుందని ఆశీర్వదించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

  ఇది చదవండి: కోర్కెలు తీర్చే కొంగు బంగారం కనకదుర్గ.. ఇంద్రకీలాద్రికి అంతటి విశిష్టత ఎందుకు..?

  ఆ తర్వాత ఈ అమ్మలగన్న అమ్మకు సేవ చేయడం కోసం మౌన స్వామి అనే మునేశ్వరుడు ఈ ఇంద్రకీలాద్రికి చేరుకున్నాడు. ఆయన అమ్మవారికి సేవ చేసినన్ని రోజులు ఏ ఒక్కరితో ఒక్కమాట కూడా మాట్లాడేవారు కాదు. మౌనంగా ఎవ్వరితో ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటూ అమ్మవారి సేవ చేసేవారట. నిత్యం ఆలయాన్ని శుభ్రం చేయడం, ఆయనకు ఉన్నటువంటి శక్తి మేరకు జలం తీసుకొచ్చి శుద్ధి చేయడం, అక్కడ లభించినటు వంటి పండ్లు, ఫలాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేవారట. అలా ఏళ్ల పాటు అమ్మవారి సేవలోనే ఆయన జీవితాన్ని గడిపేవారట.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  నిత్య దూప,దీప నైవేద్యాలు పెడుతూ అమ్మవారికి ఏ లోటు కలగకుండా మౌనంగా స్వామి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సేవ చేసుకున్నారు. ఘాట్ రోడ్ లో నైరుతిలో ఉన్నటువంటి కొండప్రాంతంలో చిన్న గుహలో ఆయన ఉండేవారట. చివరకు ఆయనకు ఇక్కడే అమ్మవారి సేవ చేసుకుంటూనే గతించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.

  ఇంద్రకీలాద్రి కొండపై డెవలప్‌మెంట్‌ పనులు చేసేటప్పుడు కాలక్రమేణా ఆ మౌనస్వామి ఉండే గుహను తొలగించాల్సి వచ్చిందట. దీంతో మౌనస్వామి విగ్రహాన్ని ఇంద్రకీలాద్రిపై అధిష్టించారు ఆలయ అధికారులు. అమ్మవారికి అత్యంత చేరువులో ఉంటూ నిత్యం అమ్మకు ఎదురుగా ఉండేలా ఏర్పాటు చేశారు. కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న భక్తులు అందరూ కూడా మౌన స్వామిని కూడా దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Vijayawada, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు