హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్..? ఏప్రిల్ 3న ఏం జరగనుంది..? సీఎం సంచలన నిర్ణయం తీసుకుంటారా?

CM Jagan: ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్..? ఏప్రిల్ 3న ఏం జరగనుంది..? సీఎం సంచలన నిర్ణయం తీసుకుంటారా?

వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

CM Jagan: అధికార వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్టన్ నెలకొంది. ఇంత అర్ధాంతరంగా ఎందుకు సమావేశం పెట్టారు.. ఢిల్లీ నుంచే ఎందుకు సమాచారం అందించారు.. ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారు..? ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అని ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

CM Jagan:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికార వైసీపీ (YCP) ఎమ్మెల్యే టెన్షన్ టెన్షన్ పెరుగుతోంది. ఢిల్లీ పర్యటన (Delhi Tour) లో ఉండగానే.. అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారా..?  ఇంత సడెన్ గా ఎందుకు మీటింగ్ ఫిక్స్  చేశారు.. ఏప్రిల్ 3వ తేదిన ఎమ్మెల్యేలు, కోర్డినేటర్లకు ఏం చెప్పనున్నారు. ఎమ్మెల్యేలు, రిజనల్  కోర్డినేటర్లు అందరూ తప్పక హాజరుకావాలని సీఎం చెప్పడంతో.. ఆయన ఏదో చెప్పబోతున్నారన భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఎవరిపైనా వేటు వేసే విషయం చెబుతారా.. లేక ఎన్నికలకు సమయం ఎక్కవ లేకపోవడంతో.. సీట్లు ఎవరికి ఇవ్వడం లేదన్నదానిపై క్లారిటీ ఇస్తారా? ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికల్లో వైసీపీ  ఓటమి.. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రలోభాల పర్వంపై ఆరోపణలు ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏం  చెబుతారు అనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.

వచ్చే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 13న చివరిసారిగా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఆ తర్వాట పార్టీలో కీలక మార్పులు జరిగాయి. ఇక, ఏప్రిల్ లో జరిగే సమావేశం ద్వారా నేతల పనితీరుపై సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికలు ఎప్పుడుంటాయి.. టికెట్లు ఎవరికి ఇస్తారు అన్నదానిపైనా అధినేత క్లారిటీ ఇస్తారని సమాచారం..

ఈసారి సమావేశంలో ఎవరి భవిష్యత్తు ఏంటి అనే దానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల పనితీరుపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు పార్టీ నేతలు. ఇక ఈ నెల 18 నుంచి 26వరకు జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో వచ్చే నెల రెండో వారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించే అవకాశం ఉంది. దీన్ని ఎలా నిర్వహించాలి అనే దానిపై కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.

ఇదీ చదవండి : ఆనంద నిలయం అంటే ఏంటి? బంగారు ఆనంద నిలయంపై ప్రత్యేకత ఏంటంటే..?

జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ ద్వారా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అందించిన పాలన, అభివృద్ధి, సంక్షేమం, పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించేలా ప్రభుత్వం ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుమారు 8వేల సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఇక మిగిలిన సచివాలయాల్లో కూడా త్వరితగతిన కార్యక్రమం పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు.

ఇదీ చదవండి : వైభవంగా హనుమంతుడిపై శ్రీ వెంకటాద్రి రాముడి విహారం.. నేడు బంగారువాకిలిలో శ్రీ రామ పట్టాభిషేకం.. ఎన్నిగంటలకు అంటే..?

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి ఊహించని ఫలితాలు ఎదురవడంతో ఈసారి సమావేశంలో అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఎందుకంటే పలుసార్లు చాలామంది ఎమ్మెల్యేలకు పని తీరు మెరుగు పరుచుకోవాలని హెచ్చరికలు చేస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ రాయలసీమల్లో వైసీపీ ఘోరంగా ఓడింది. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.. అంతేకాదు ముందస్తు ఎన్నికలపైనా ఏదైనా సమాచారం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా తమను ప్రలోభాలు పెట్టారని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. అయితే ముందే తమకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని.. చెబితే పరిస్థితి వేరాలా ఉండేది కదా అని.. జగన్ నేతనలు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics

ఉత్తమ కథలు