చట్టాలున్నాయి.. వాటి ద్వారా పడే శిక్షలు ఉన్నాయి. కానీ నేరాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట బాలికలపై అకృత్యాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District)పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండలంలో ఘోరం జరిగింది. చినపాండ్రాక పంచాయతీలోని సీతారామపురం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను.. అదే గ్రామానికి చెందిన ముగ్గురుకు యువకులు గురువారం రాత్రి సమీపంలోని పశువల పాకలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఐతే బయటకి వెళ్లిన కుమార్తె ఎంతకి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఊరంతా గాలించినా ఆమె ఆచూకి తెలియలేదు.
ఐతే తర్వాతి రోజు మధ్యాహ్నం బాలిక ఇంటికి వచ్చింది. ఎక్కడికెళ్లావని తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా విజయవాడ (Vijayawada) వెళ్లినట్లు సమాధానమిచ్చింది. ఐతే గ్రామ సర్పంచ్ వచ్చి బాలికను విచారించగా అసలు విషయం చెప్పింది. జరిగిన ఘోరాన్ని వివరించింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఇటీవల కర్నూలు జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.... కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కామినేని పల్లెలో నివాసం ఉంటున్నాడు లక్క అనిల్ కుమార్. ఇరుగు పొరుగుతో సన్నిహితంగా మెలిగి... వారి పిల్లలతో చనువుగా ఉండేవాడు. పొరుగు ఇంటి వారు ఏమిచెప్పిన కాదనే వాడు కాదు. అయితే పసిపాపలను చెల్లెళ్లుగా చూస్తూ ఆడించాల్సిన వాడు కీచకుడిగా మారాడు. వారిపైనే కన్నేసే వాడు. ఎవరు లేని సమయంలో చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. రోజు సాయంత్రం అనిల్ కుమార్ నివాసముంటున్న వీధికి చెందిన ఓ మైనర్ బాలిక వీధిలో ఆడుకుంటూ ఉంది. చుట్టుప్రక్కల ఎవరు లేరని గ్రహించిన అనిల్ కుమార్ చిన్నారిని దగ్గరకు రమ్మన్నాడు. చాక్లెట్ ఇస్తాను రమ్మంటూ ఇంటికి తీసుకెళ్లాడు. అది నమ్మిన బాలిక అనిల్ తో పాటు అతడి ఇంటికెళ్లింది. ఆ చిన్నారి అడిగినవన్నీ ఇస్తూనే ఆమె ఒంటిపై మెల్లగా చేతులు వేశాడు.
దీంతో భయాందోళనకు గురైన బాలిక అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంటికెళ్లి బిగ్గరగా ఏడవడంతో ఏమైందని తల్లితండ్రులు అరా తీశారు. దీంతో జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పింది. ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడని చెప్పింది. దీంతో ఆ చిన్నారి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు అనిల్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Krishna District, Rape on girl, Vijayawada