హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Roja: దుర్గమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టిన రోజా.. మంత్రిగారి మొక్కు అందుకే..!

Minister Roja: దుర్గమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టిన రోజా.. మంత్రిగారి మొక్కు అందుకే..!

దుర్గగుడిలో 108 టెంకాాయలు కొట్టిన మంత్రి రోజా

దుర్గగుడిలో 108 టెంకాాయలు కొట్టిన మంత్రి రోజా

రాజధాని రాజకీయం విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ (Kanakadurgamma) వరకు చేరింది. ఏపీ టూరీజం శాఖ మంత్రి ఆర్కే రోజా (AP Minister RK Roja) రాజధాని అంశాన్ని దుర్గగుడికి చేర్చారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం రాజధాని (AP Capital) రాజకీయం నడుస్తోంది. మూడు రాజధానులంటూ అధికార వైసీపీ, ఒకేరాజధాని అంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అమరావతి (Amaravati) నే రాజధానిగా ఉంచాలంటూ భూములిచ్చిన రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. ఇప్పుడీ రాజధాని రాజకీయం విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ (Kanakadurgamma) వరకు చేరింది. ఏపీ టూరీజం శాఖ మంత్రి ఆర్కే రోజా (AP Minister RK Roja) రాజధాని అంశాన్ని దుర్గగుడికి చేర్చారు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలంటూ దుర్గమ్మకు మొక్కారు. రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా మంత్రి ఆర్కే రోజా కనకదుర్గమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టారు. దసరా పండగ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు.

  దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రి రోజాను స్వాగతం పలికారు. వేదాశీర్వచనం అందజేశారు వేద పండితులు. అనంతరం మంత్రి రోజాకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ. ఈ సందర్భంగా రాష్ట్రప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని రోజా తెలిపారు. అమ్మవారి చల్లని చూపుతో దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకున్నారు.

  ఇది చదవండి: ఏపీకి తుఫాన్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలర్ట్..

  పండగ రోజు అమ్మవారిని వికేంద్రీకరణ త్వరగా జరగాలని వేడుకున్నట్లు మంత్రి రోజా తెలిపారు. వికేంద్రీకరణకు న్యాయపరమైన చిక్కులు వీడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె చెప్పారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని..వికేంద్రీకరణ జరగాలని అమ్మవారికి 108 టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు మంత్రి రోజా.

  టీడీపీ వాళ్లలా తొడలు కొట్టి సవాళ్లు చేయం.. కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని వేడుకుంటామని తనదైన శైలిలో రోజా చెప్పారు. వికేంద్రీకరణ జరిగిన తర్వాత మళ్లీ వచ్చి అమ్మవారి మొక్కు తీర్చుకుంటానని మంత్రి ఆర్కే రోజా తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Durga temple, Local News, Minister Roja

  ఉత్తమ కథలు