హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Roja: ఆ ఇద్దరు చరిత్ర హీనులే.. వచ్చే ఎన్నికల్లో టీడీపికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన రోజా

Minister Roja: ఆ ఇద్దరు చరిత్ర హీనులే.. వచ్చే ఎన్నికల్లో టీడీపికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన రోజా

ఎమ్మెల్సీ ఫలితాలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఫలితాలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Minister Roja: తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీలోకి అడుగు పెట్టను అన్న చంద్రబాబు శపథం ఏమైందని ప్రశ్నించారు..? అసెంబ్లీకి రాను అన్న ఆయన.. ఎందుకు వచ్చారని నిలదీశారు..? టీడీపీకి అనుకూలంగా ఓటు వేసిన ఇద్దరూ చరిత్ర హీనులుగా నిలిచిపోతారని జోస్యం చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా అంచనా వేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Krishna, India

Minister Roja: తాజా ఎమ్మెల్సీ ఫలితాలు (MLC Election Result) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరింత హీటును పెంచుతున్నాయి. అస్సలు బలం లేని టీడీపీ (TDP) .. ఇటు మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC ELections) నెగ్గిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని కూడా సొంతం చేసుకుంది. ఈ ఓటమని అధికార వైసీపీ అస్సలు అంచనా వేయలేకపోయింది. వాస్తవం బలం ప్రకారం ఏడు సీట్లలో నెగ్గాల్సిన వైసీపీ.. అనూహ్యంగా ఓడిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోతున్నారు. వైసీపీ శ్రేణులు ఢిఫెన్స్ లో పడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)కి ఇది ఊహించని షాక్ అయ్యింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై మంత్రి రోజా (Minister Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన భార్యని తిట్టారని అబద్ధాలుచెప్పి ఏడ్చిన చంద్రబాబు, మళ్లీ సీఎం అయిన తరువాతనే అసెంబ్లీ‌లో అడుగు పెడతానని చెప్పారని.. కానీ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఎందుకు అసెంబ్లీలోకి వచ్చారంటూ ఆమె ప్రశ్నించారు. అంటే ఆయన రాజకీయ స్వార్థం కోసం తన భార్య పరువు పోయినా పర్లేదు, తన నీచ రాజకీయంకోసం వచ్చారాఅని రోజా నిలదీశారు.

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లు కాకుండా.. మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పంచమర్తి అనురాధకు ఓటు వేయడంతోనే ఆమె నెగ్గింది. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో కూడా తమకు తెలుసు అంటున్నారు వైసీపీ నేతలు. కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం పర్యటించిన మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ని ఎవరు వ్యతిరేకిస్తే వారికే నష్టం జరుగుతుంది, జగన్‌కు, వైసీపీ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు.

వచ్చే ఎన్నికల్లో వారిద్దరికీ సీట ఉండదని తెలిసే.. ప్రత్యర్థి పార్టీకి ఓటేశారని విమర్శించారు. అయితే వారికి ఏ పార్టీ‌లో సీటు ఇచ్చిన ప్రజలు ఓడిస్తారని చెప్పారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో అందరికీ తెలుసు, వారికి రాజకీయ భవిషత్తు ఉండదంటూ రోజా ఫైర్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లో వారిద్దరూ చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. చరిత్రను ఒక్కసారి తిరగేసుకుంటే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు.

ఇదీ చదవండి : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడ.. నేటి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా.. ఆయన బెంగళూర్ వెళ్లారా..?

విలువలు ఉన్న రాజకీయ నాయకులకు డబ్బు ముఖ్యం కాదు, ప్రజల్లో అభిమానం, ఆదరణ ఉండాలి అన్నారు. నాలుగు ఎమ్మెల్సీలు వస్తే చంకలు గుద్దుకుని సంబరు పడిపోతున్నారని.. వాళ్లు ఎంత పిచ్చోల్లో అర్థం అవుతుందన్నారు. మరోవైపు ఈ ఫలితాలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ బాస్ కు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో అనుభవం ఉంది. డబ్బుతో ెలాంటి పనులైనా చేయగల సమర్ధులని మరోసారి రుజువైంది అన్నారు. తమ ఇద్దరు ఎమ్మెల్యేలను కొనడంతోనే టీడీపీ అభ్యర్థి గెలిచారని.. ఆయన ఆరోపించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap mlc elections, AP News, AP Politics, Minister Roja

ఉత్తమ కథలు