K Pawan Kumar, News18, Vijayawada
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పలు రకాల సేవలను వేగంగా, సులభంగా అందించాలానే ఉద్దేశం తో ప్రభుత్వం మీ సేవా (Mee Seava Centres) కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఐతే వీటిపై పర్యవేక్షణ కొరవ అవ్వ డంతో లక్ష్యం నీరు గారి పోతుంది. ప్రభుత్వం నిర్దేశించిన డబ్బులు కంటే కూడా ప్రజల దగ్గర నుండి నిర్వాహకులు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని శాఖలను అందించడంతో అవినీతికి కూడా చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇష్టానుసారంగా అందినకాడికి దోచుకుంటున్నారు మీ సేవ నిర్వాహకులు. విజయవాడ (Vijayawada) లోని పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎదురుగా ఉన్న మీ సేవ కేంద్రంలో ప్రజల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
మీ సేవ నిర్వా హకులు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయానికి సంబంధించి నకళ్ళు, ఈసీలు, సొసైటీ రిజిస్ట్రేషన్ ల కోసం వచ్చే వినియోగదారుల నుంచి అధిక రుసుమును వసూలు చేస్తున్నారు మీసేవ నిర్వాహకులు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా ముందుగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందుకు ప్రభుత్వం ఏ సేవకు ఎంత రుసుము అన్న వివరాలతో కూడిన పట్టికను మీసేవ కేంద్రా ల్లో అందుబాటులో ఉంచింది.
దరఖాస్తు దారులు కట్టిన ఫీజు నుంచి కొంత శాతం కమీషన్ ను మీసేవ నిర్వాహకులకు ప్రభుత్వం అందజేస్తోంది. కమీషన్లకు కక్కుర్తి పడి 'మీసేవ' యజమానులు రూటు మారుస్తున్నారు. 'మీసేవ' కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగు తున్నా కట్టడి చేయాల్సిన అధికారులు కార్యాలయా యలకే పరిమితమయ్యారు. అధికారులు కాలయాపన చేయడమే తప్పా మీసేవ కేంద్రాల పర్యవేక్షణ మరిచారని, అధికారుల పర్వవేక్షణ లోపంతో మీసేవ కేంద్రాల నిర్వాహకుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
జిల్లా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మీసేవ నిర్వాహకుల దోపిడీని అరికట్టాలని చూసి చూడనట్లుగా వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారికి నచ్చినట్టుగా ప్రజలు వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తారని త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada