K Pawan Kumar, News18, Vijayawada
నిత్యం వందల మంది టూరిస్ట్‌లతో ఆ పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంటుంది. అత్యంత భక్తి శ్రద్దలతో భక్తులు ప్రార్థనలు చేస్తుంటారు. తమ కష్టనష్టాలను మరియమ్మ తల్లితో చెప్పుకుంటూఉంటారు. అన్ని సమస్యలకు జవాబును ఇస్తుందని అక్కడి విశ్వాసులకు ప్రగాఢమైన నమ్మకం. ఈ మరియామాత పుణ్యక్షేత్రం తెలుగురాష్ట్రాల్లో బాగా ప్రసిద్దిగాంచింది.
మెుదటగా క్రైస్తవులు మాత్రేమే కాగా ఇక్కడికి అన్ని మతాల వారు తరలివస్తుంటారు. అక్కడ మరియతల్లికి తమ మెుక్కులు కూడా చెల్లించుకుంటారు. మరి మీరు కూడా ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లాలి అనుకుంటున్నారా..? ఆంధ్రపదేశ్‌లోని విజయవాడకు సమీపంలో ఉన్న గుణదల.. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తోకొచ్చేది మేరిమాత చర్చి. చెన్నైవేళాంగిణి మాత చర్చ్ అనంతరం మేరీ మాత చర్చ్ అనగానే విజయవాడలోని గుణదల గుర్తుకురావాల్సిందే. అంతటి ప్రాచుర్యం పొందింది ఈ పుణ్యక్షేత్రం...క్రిస్మస్ , జనవరి ఫస్ట్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగ సందర్భంగా ...పెద్ద సంఖ్యలోభక్తులు ఇక్కడికి వస్తారు.
దక్షిణ భారతదేశంలోని క్రైస్తవపుణ్య క్షేత్రాల్లో రెండవ అతిపెద్ద పుణ్య క్షేత్రం ఈ విజయవాడలోనిగుణదల మేరీమాత మందిరం.ఫ్రాన్సులోని లూర్థు నగరం సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చ్‌ను పోలినట్టుగా విజయవాడ శివారులోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ది చెందింది.కేవలం పండుగ దినాల్లోనే కాకుండా... సాధారణ రోజుల్లో శుక్ర, శని, ఆదివారాల్లో కూడా ఈ చర్చి వద్ద రద్దీగా ఉంటుందని భక్తులు చెబుతున్నారు. ఇక ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 దినాల్లో చర్చి ప్రాంగాణంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా కొన్ని లక్షలమంది భక్తులు ఈ ఉత్సవాలకు వస్తారని అక్కడి మత గురువులు చెబుతారు.
ఫ్రాన్సు దేశంలోనిలూర్థు నగరం ఉంది. దీనికి అతి సమీపంలో ఓ కొండ ఉంది. ఇక్కడ మెుత్తంఅడవిలా ఉంటుంది. ఇక్కడికి ఓ 14 సంవత్సరాలు ఉన్న అమ్మాయి... వంట చేసేందుకు కట్టేలకు వచ్చి ఉంటుంది. ఈ బాలిక పేరుబెర్నాడెట్ సోబిరస్.. ఈ అమ్మాయి కట్టెలు ఏరుకుంటుండగా...అక్కడ మరియమ్మను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని వెంటేనే ఆ బాలిక ఆ విషయాన్ని తల్లికి చెప్పిందని...ఆ తేదీ ఫిబ్రవరి 11 కావటంతోనే ప్రతి ఏడాది... ఆ రోజున మరియమాత భక్తులకు కనిపించిదని విశ్వాసిస్తూ... అక్కడ ఉత్సవాలు జరుపుకోవటం ఆనావాయితీగా వచ్చింది.
అందుకనే...గుణదలలో కూడా ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఫాదర్స్ చెబుతున్నారు.ప్రతి సంవత్సరంజనవరి 31న నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గతంలో ఫిబ్రవరి 11న ఒక్కరోజే ఉత్సవాలు జరిపేవారు... అయితే భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో 3 రోజులు ఈ ఉత్సవాలు జరిగేలా ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుందని తెలుపుతున్నారు మత గురువులు. ప్రతి సంవత్సరంఫిబ్రవరి 9, 10, 11 న గుణదల మాత ఉత్సవాలు జరుగుతాయి.
గతంలో కంటే ఇప్పుడు అక్కడి వాతవరణం చాలా బాగుంటుందని భక్తులు చెబుతున్నారు. ఇప్పుడు కొండపైకి కాలినడకన వెళ్లేందుకు అటుఇటు ఆర్చిలను ఏర్పాటు చేశారు. యేసు ప్రభు సిలువ చెంతకు వెళ్లేందుకు గతంలో సరైన మార్గం ఉండేది కాదు.. ఇప్పుడుస్టేప్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కాలినడకన వెళ్తునప్పుడు...క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల గొప్పతనం గురించి ఉంటుంది. క్రీస్తు జీవిత ఘట్టాలను మనం చూడవచ్చిను. ప్రతి ఏటా నవదిన ప్రార్థనల్లో పుణ్యక్ష్రేతం వద్ద దివ్యసత్ ప్రసాద పూజను చేస్తారు.
ఇక్కడే జరిగే ఉత్సవాలకు తెలుగు ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా తరలివచ్చి...మెుక్కులు చెల్లించుకుని తమ కోర్కెలను తీర్చుకుంటు ఉంటారు. క్రైస్తవులే కాక అన్ని మతాల వారు ఇక్కడి రావటంతో గుణదల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada