అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18
రంక్షా బంధన్ సందర్భంగా ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ ఆనందంగా గడిపారు. అన్న ఇంటికి రావడంతో అతడికి రాఖీ కట్టింది. చెల్లెలికి కానుక ఇచ్చి ఆనందంగా వెనుదిగిరిన అన్నకు ఫోన్ వచ్చింది. అవతలివారు చెప్పిన వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అన్న క్షేమంగా ఉండాలని రాఖీ కట్టిన చెల్లెలు... అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అత్తింటి వేధింపులో లేక మరేదైనా కారణమో గానీ అనుమానాస్పద స్థితితిలో మృతి చెందింది. అన్నకు రాఖీ కట్టిన రెండు గంటల్లోనే చెల్లెలు మృతి చెందడంతో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామానికి చెందిన ఉష అనే యువతి రెండేళ్ల క్రితం అరండల్ పేటకు చెందిన ఫణి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఫణి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుండగా.. ఉష సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తోంది.
ఇదిలా ఉంటే ఆదివారం రాఖీ పౌర్ణమి కావడంతో ఆమె సోదరుడు సూర్యనారాయణ సాయంత్రం 4గంటలకు ఉ ష ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్లాడు. అన్నకు ఆనందంగా రాఖీ కట్టిన ఉష.. అతడికి స్వీట్ తినిపించి సాగనంపింది. అతడు వెళ్లిన రెండు గంటలకే ఉష చనిపోయిందంటూ అత్తింటివారు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి వెళ్లిన సూర్యనారాయణ చెల్లెలు మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. రాఖీ పండుగ రోజే తోడబుట్టిన చెల్లెలలు దూరమైపోయిందని బోరున విలపించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Raksha Bandhan, Vijayawada