పెద్దలు తప్పుచేస్తే పిల్లలు నష్టపోతారనడానికి ఈ ఘటనలో ఒక ప్రత్యక్ష ఉదాహరణ. తల్లి చెడుదారిలో వెళ్లడంతో కూతురి జీవితం బుగ్గిపాలైంది. అభం శుభం తెలియని వయసులో అమ్మయింది. మహిళో వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీనం చేస్తున్న వ్యక్తి.. ఆమె కుమార్తెకు తండ్రిస్థానంలో నిలబడాలి. కానీ.. ఆ పసిమొగ్గ పాలిట మృగాడిలా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) మచిలీపట్నంకు చెందిన ఓ మహిళ.. కొంతకాలంగా ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రస్తుతం అతడితోనే సహజీవనం చేస్తోంది. ఐతే ఆమెకు అప్పటికే టీనేజ్ కి వచ్చిన కుమార్తె ఉంది. ఐతే తల్లితో ఉంటూనే ఆమె కుమార్తెపై కన్నేశాడు.
తల్లిలేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పది నెలలుగా అతడి కీచకపర్వం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చగా బంధువులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఘటనపై బంధువులు ఫిర్యాదు చేయగా పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది విజయనగరం జిల్లాలో ప్రియురాలి కూతురిపై పైశాచికంగా వ్యవహరించాడో మృగాడు. త్రినాథ్ అనే వ్యక్తి.. నాగమణి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటికే భర్తను వదిలేసిన నాగమణి.., త్రినాథ్ తో వ్యవహారం నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఓ రోజు నాగమణి బంధువుల ఇంటికి వెళ్తే.. రెండేళ్ల పాపను చూసుకోమని త్రినాథ్ కు అప్పగించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ మృగాడు.. పాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ చిన్నారిని ఒంటిపై కొరడంతో పాటు బ్లేడుతో గాయపరిచి పైశాచికానందం పొందాడు. గత ఏడు నెలలుగా పశువులా మారి చిన్నారిపై అకృత్యానికి పాల్పడుతున్నాడు. ప్రియుడు తన కన్నకూతురి పాలిట మృగంలా ప్రవర్తిస్తున్నా నాగమణి మాత్రం పట్టించుకోలేదు. చిన్నారి గాయాలపై ఇరుగుపొరుగువారు ప్రశ్నించినా ఏదో సమాధానం చెప్పి తప్పించుకునేది.
ఇలా ఒంటిపై అనేక గాయాలతో ఉన్న పాపను ఒకరోజు బయట కూలీ పనికి వెళ్తూ తన తల్లి నాగమణి దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో దించి వెళ్లింది. చిన్నారి ఒంటిపై గాయాలను చూసిన అంగన్వాడీ సిబ్బంది వెంటనే అందుబాటులో ఉన్న మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహిళా పోలీసులు చిన్నారి పరిస్థితిపై నాగమణిని నిలదీశారు. కొరికిన, కొట్టిన గాయాలపై ప్రశ్నించినా సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని పాపను చంపేందుకు యత్నించినట్లు తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Extramarital affairs, Krishna District, Minor girl pregnant