VIJAYAWADA MAN KILLED HIS NEIGHBOR FOR MAKING BAD WORDS IN VIJAYAWADA ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VPR NJ
Vijayawada: భార్య గురించి అంత మాటనేసరికి తట్టుకోలేకపోయాడు.. ఆ టైమ్ లో ఏమీ ఆలోచించలేదు..
నిందితుడు గడ్డం బాబు
Vijayawada: అయినవారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కోపం నషాలానికంటుతుంది. అదే కట్టుకున్న భార్య గురించి చులకనగా మాట్లాడితే భర్త ఎవర్నీ లెక్కచేయడు. అలా తన భార్య గురించి ఓ వ్యక్తి తప్పుగా మాట్లాడటంతో ఓ వ్యక్తి ఏకంగా హత్య చేసేవరకు వెళ్లాడు.
అయినవారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కోపం నషాలానికంటుతుంది. అదే కట్టుకున్న భార్య గురించి చులకనగా మాట్లాడితే భర్త ఎవర్నీ లెక్కచేయడు. అలా తన భార్య గురించి ఓ వ్యక్తి తప్పుగా మాట్లాడటంతో ఓ వ్యక్తి ఏకంగా హత్య చేసేవరకు వెళ్లాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) లో నడిరోడ్డుమీద దారుణ హత్య కలకలం రేపింది. తన భార్య గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తి పాశవికంగా హత్య చేసిన ఘటన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు రోడ్ సీతారాంపురం సిగ్నల్స్ కొత్తవంతెన వద్ద నివాసం ఉండే గడ్డం చందు అనే వ్యక్తికి జయశ్రీతో కొన్నేళ్ల క్రితం వివాహ మైంది.
దంపతులకు ఇద్దరు పిల్లలు. గడ్డం బాబు సొంత ఊరు నెల్లూరు జిల్లా (Nellore District)కావలి. రెండేళ్ల క్రితం ఫ్యామిలీతో కలిసి విజయవాడకు వచ్చాడు. సెల్ ఫోన్లు వ్యాపారం చేస్తూ జీవించేవాడు. కానీ కొన్ని రోజుల క్రితం ఆ వ్యాపారం మానేసి.. ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఉన్నట్టుండి చందు ఆ షాప్ ఎందుకు మూసేశాడో ఎవ్వరికి తెలియదు. అతని భార్య జయ శ్రీ చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త ఖాళీగా ఉంటున్నా.. తానే కుటుంబ భారాన్ని మోస్తోంది. జీవితం సాఫీగా జరుగుతుందని అనుకునేలోపే… సీన్లోకి ప్రవేశించాడు రత్నాల తంబి.
గడ్డం బాబు ఇంటికి సమీపంలో జామకాయల అమ్మకుంటూ జీవిస్తుంటాడు ఈ తంబి. తంబి, గడ్డం చందూ కలిసి బుధవారం రాత్రి మద్యం పార్టీ చేసుకున్నారు. ఆ మద్యం మత్తులో తంబి నోరుజారాడు. అంతేకాదు గడ్డం బాబు భార్యపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఏంటి రా నీకు సంపాదన లేదు అని నీ భార్య రెండో పెళ్లి చేసుకోబోతుంది అంట కదా అంటూ తంబి తప్పుగా మాట్లాడేసరికి బాబుకు విపరీతమైన కోపం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.
బుధవారం రాత్రి రోడ్డుపై తంబీతో గొడవపడి.. తాగిన మైకంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒంటి నిండా గాయాలతో తంబి పక్కనే ఉన్న శ్రీ అపర్ణ హాస్పిటల్లోకి వెళ్లి పడిపోయి.. అక్కడే ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. సమాచారం తెలియడంతో అక్కడ నుంచి పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి అన్ని స్టేషన్లకు సమాచారం అందించి.. ముద్దాయి గడ్డం బాబుని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం అనంతరం మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.