Home /News /andhra-pradesh /

Cyber Crime Training: సైబర్ క్రైమ్ లో ట్రైనింగ్.. ప్రాక్టికల్స్ పేరుతో జనానికి టోకరా.. వీళ్లది మామూలు బుర్రకాదు..!

Cyber Crime Training: సైబర్ క్రైమ్ లో ట్రైనింగ్.. ప్రాక్టికల్స్ పేరుతో జనానికి టోకరా.. వీళ్లది మామూలు బుర్రకాదు..!

cyber crime

cyber crime

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా (Manchiriyal District) భీమారం మండలం రెడ్డిపల్లికి చెందిన దాసరి రవి అనే యువకుడు కొంతకాలం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాడు. అక్కడ సైబర్ నేరాలు (Cyber Crimes) ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తనకు వచ్చిన ఈ చీటింగ్ టాలెంట్ ను నలుగురు పంచాలన్న కన్నింగ్ ఐడియా వచ్చింది. అందుకే గ్రామంలోని నలురుగు యువకులను పిలిచి ట్రైనింగ్ ఇచ్చాడు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  సాధారణంగా కోచింగ్ సెంటర్లు అనగానే మనకు ఎంసెట్ కోచింగ్. నీట్ కోచింగ్, సాఫ్ట్ వేర్ కోచింగ్ లేదా బ్యాంక్, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ కోసం ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లు కనిపిస్తాయి. కానీ ఓ కేటు గాడు మాత్రం నేరాల్లో ట్రైనింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్లు పెట్టాడు. ఎవరికీ దొరక్కుండా అమాయక జనం నుంచి డబ్బులు గుంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తాను నేర్చుకున్న విద్యను.. పదిమందికి నేర్పించి జనాల మీదపడి బ్రతకడం నేర్పించాడు. ఐతే వీరి ట్రాప్ లో పడిన ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఈ కేటుగాళ్ల క్లాస్ రూమ్ బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా భీమారం మండలం రెడ్డిపల్లికి చెందిన దాసరి రవి అనే యువకుడు కొంతకాలం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాడు. అక్కడ సైబర్ నేరాలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు.

  తనకు వచ్చిన ఈ చీటింగ్ టాలెంట్ ను నలుగురు పంచాలన్న కన్నింగ్ ఐడియా వచ్చింది. అందుకే గ్రామంలోని నలురుగు యువకులను పిలిచి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎంచక్కా కూర్చొని సంపాదించే పని అని భావించిన ఆ కుర్రాళ్లు మనోడి దగ్గర సైబర్ క్రైమ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ కోర్సులో భాగంగా తన శిష్యగణానికి ప్రాక్టికల్స్ కూడా వారికి నేర్పించాడు రవి. ప్రాక్టికల్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన యువతిని దారుణంగా మోసం చేశారు.

  ఇది చదవండి: ఒకేసారి ఇద్దరితో మహిళ ఎఫైర్... ఓ రోజు ఆ ఇద్దరూ ఎదురుపడ్డారు.. తర్వాత ఏం జరిగిందంటే..!


  జగ్గయ్యపేటకు చెందిన బాధిత యువతి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 18న పేపర్లే వచ్చిన ఉద్యోగ ప్రకటన చూసి అందులోని నెంబర్ కు ఫోన్ చేసింది. అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసిన దాసరి రవి అండ్ కో.. తాము దివాన్ అగ్రో కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. ఉద్యోగానికి సంబంధించిన ప్రాసెస్ గురించి యువతి ఆరా తీసింది. దీంతో ఆ కేటుగాళ్లు ఎస్బీఐ ఎకౌంట్ నెంబర్ 20127972087 ఇచ్చి అందులో రూ.1600 డిపాజిట్ చేయాలని కోరారు. దీంతో వెంటనే ఆమె జమ చేసింది.

  ఇది చదవండి: పిల్లల పుట్టాక భర్త లింగ మార్పిడి.. మరొకరితో భార్య సహజీవనం.. ఈ కథకు అనుకోని ముగింపు..


  ఆ తర్వాత ఇన్సూరెన్స్ పేరుతో రూ.4,500 చెల్లించాలన్నారు. కొన్ని రోజుల తర్వాత ఇన్సూరెన్స్ మీ పేరుమీద ట్రాన్స్ ఫర్ చేయాలంటే రూ.28,500 చెల్లించాలన్నారు. ఆ మొత్తం కూడా ఆమె ఎకౌంట్లో వేసింది. మరుసటి రోజు ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ కోసం రూ.21,000 చెల్లించింది. మరో రోజు రూ.10వేలు చెల్లించాలని కోరడంతో వెంటనే గూగుల్ పే చేసింది. అలా మొత్తం రూ.65,500 దోచేసిన కేటుగాళ్లు.. మరో రూ.7వేలు డిపాజిట్ చేయాలని కోరగా.. తన దగ్గర డబ్బులు లేవని.. తనకు ఉద్యోగం వద్దని తాను చెల్లించిన డబ్బులన్నీ తిరిగిచ్చేయాలని గట్టిగా నిలదీసింది. దీంతో 15 నిముషాల్లో డబ్బులు ఇస్తామని ఫోన్ కట్ చేసిన ముఠా.. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  ఇది చదవండి: మమ్మల్ని దత్తత తీసుకుంటారా..? ఆశగా ఎదురుచూస్తున్న పులులు, సింహాలు, ఏనుగులు..


  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. తెలంగాణలో ఇలాగే 30 నుంచి 40 మందిని మోసం చేసి రూ.8లక్షల వరకు దోచేసినట్లు తెలిసింది. ఉద్యోగాల కోసం డబ్బులు కట్టలేని వారి నుంచి బ్యాంక్ పాస్ బుక్, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులను కొరియర్ ద్వారా తెప్పించుకొని ఎలాంటి ఎకౌంట్ల ద్వారా మోసం చేసి డబ్బులు జమ చేయించుకున్నట్లు గుర్తించారు. వీరిపై హైదరాబాద్ రాయదుర్గం, ఏపీలోని విశాఖపట్నంలో కేసులు నమోదైనట్లు దర్యాప్తులో తేలింది.

  మీ నగరం నుండి (​విజయవాడ)

  ఆంధ్రప్రదేశ్
  ​విజయవాడ
  ఆంధ్రప్రదేశ్
  ​విజయవాడ
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, CYBER CRIME

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు