హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

OMG: బెజవాడలో బ్లడ్ మాఫియా.. వాట్సాప్ మెసేజ్ తో టోకరా

OMG: బెజవాడలో బ్లడ్ మాఫియా.. వాట్సాప్ మెసేజ్ తో టోకరా

విజయవాడలో రక్తదానం పేరుతో మోసం

విజయవాడలో రక్తదానం పేరుతో మోసం

Vijayawada: ఆరోగ్యవంతులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ రక్తదానం చేయచ్చు.. ప్రాణాదాతలుగా మారవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో ఈ రక్తాన్ని కూడా పలువురు ఉచితంగా పొంది.. లాభాలకు అమ్ముతున్నారు. ఇలాంటి విషయాల్లో రక్తదాతలు జాగ్రత్తగా వ్యవహరించండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

అన్ని దానల్లో కెల్లా అన్నదానం ఒకరిని ఆకలి నుంచి రక్షిస్తే..!. రక్తదానం మనుషుల ప్రాణాలను కాపాడుతుంది. రక్తదానం చేసిన వారు... తిరిగి మూడు నెలలకోసారి రక్తం దానం చేయచ్చు. వీరినే రక్తదాతలు అని అంటారు. కానీ మనలో చాల మందికి రక్తదానంపై పలు అనుమానాలుండి ఎవరు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావటం లేదు. పద్దెనిమిది ఏళ్లు నిండి... ఆరోగ్యవంతులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ రక్తదానం చేయచ్చు.. ప్రాణాదాతలుగా మారవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో ఈ రక్తాన్ని కూడా పలువురు ఉచితంగా పొంది.. లాభాలకు అమ్ముతున్నారు. ఇలాంటి విషయాల్లో రక్తదాతలు జాగ్రత్తగా వ్యవహరించండి.

రక్తదానం అని దేనికి అంటారంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నైతిక విలువలు ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలుని కంటి పొర,గుండె,మూత్రపిండాలు వగైరా మరొకరి అవసరానికి వాడదలుచుకున్నప్పుడు వాటిని స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వాటిని అమ్మ కూడదు కనుక ప్రపంచంలో చాలా మంది రక్తాన్ని దానం చేస్తారు.

ఇది చదవండి: వైసీపీ బెజవాడ మార్క్ రాజకీయం.. మరీ అంత అరాచకమా..?

రక్తదానాన్ని మహాదానం అనిచెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే రక్తం ఇంకొకర్ని ప్రాణాపాయం నుంచి రక్షిస్తుంది. అందుకే ఎవరైనా సరే రక్తదానం చేస్తే ఇంకొకరి ప్రాణాలను రక్షించిన వారమవుతారు. అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేసిన వారిని దేవుడిలా కూడా భావించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రజల అవసరాలు, నమ్మకాలు, బలహీనతలే ఆసరాగా తీసుకుని ఎన్నో మోసాలు జరుగుతున్నాయి.

ఇది చదవండి: బెజవాడ బెస్ట్ బిర్యానీల్లో ఇదీ ఒకటి..! అడ్రస్ ఎక్కడంటే..!

కష్టపడి డబ్బులు సంపాదించడానికి ఈరోజుల్లో చాలా మంది కష్టంగా భావిస్తున్నారు. ఐతే ఒక్కసారిగా కోట్లు సంపాదించి అందలం ఎక్కేయాలని ఉద్దేశముతో ప్రజలను గుడ్డిగా నమ్మిస్తూ మోసాలు చేస్తూ సులభంగా డబ్బు సంపాదించడమే మార్గంగా పెట్టుకున్నారు. ఐతే అలా డబ్బు సంపాదించడానికి వెనకా ముందు ఆలోచించకుండా ఎంతకైనా తెగిస్తూ ఉన్నారు. అలాంటి సంఘటనా విజయవాడలో చోటుచేసుకుంది.బ్లడ్ ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసి ఘరానా మోసాలు చేస్తున్నాడు.

కొంగళ్ల నవీన్‌ టీమ్‌ సభ్యులు ఆన్‌ లైన్‌ బ్లడ్‌ డోనర్స్‌ పేరుతో ఒక టీమ్ ఏర్పాటు చేసి వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ప్రచారం చేస్తూ ఉచితంగా రక్తదానం చేస్తున్నారు. వీరి గ్రూపులో చేరిన సందీప్ రెడ్డి అనే యువకుడు రక్తం కావాల్సిన వారితో రానుపోను చార్జీలకు డబ్బులు అకౌంట్‌లో వేయించుకుంటూ రక్తదానం చేయడం లేదు. గమనించిన నవీన్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రాణాపయంలో ఉన్నవారి అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీన్ కోరాడు.

First published:

Tags: Andhra Pradesh, Blood, Local News, Vijayawada

ఉత్తమ కథలు