Home /News /andhra-pradesh /

Blackmailing: ఆన్ లైన్లో పరిచయమయ్యాడు... అన్నిరకాలుగా దగ్గరయ్యాడు.. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలతో...

Blackmailing: ఆన్ లైన్లో పరిచయమయ్యాడు... అన్నిరకాలుగా దగ్గరయ్యాడు.. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలతో...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కృష్ణాజిల్లా (Krishna District) విజయవాడ (Vijayawada) సమీపంలోని పెనమలూరు మండలం కానూరుకు చెందిన యువతి.. ఆన్ లైన్లో పలు వ్యాపారాలు చేసేది. ఈ క్రమంలో తెలంగాణకు (Telangana) చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  ఆమె ఆన్ లైన్లో వ్యాపారం (Online Business) చేస్తుండేది. అందులో భాగంగా సోషల్ మీడియాలో (Social Media) తన ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేస్తుండేది. ఈ క్రమంలో అ యువకుడు పరిచయమయ్యాడు. చాటింగ్ చేస్తూ మెల్లగా దగ్గరయ్యాడు. ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేసి అన్ని రకాలుగా వాడుకున్నాడు. పెళ్లి మాటెత్తేసరికి ముఖం చాటేయడమే కాకుండా.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ (Blackamiling) చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కృష్ణాజిల్లా (Krishna District) విజయవాడ (Vijayawada) సమీపంలోని పెనమలూరు మండలం కానూరుకు చెందిన యువతి.. ఆన్ లైన్లో పలు వ్యాపారాలు చేసేది. సోషల్ మీడియాలో తన వ్యాపారానికి సంబంధించిన ప్రచారం చేసేది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చింతలపల్లికి చెందిన సులేమాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

  అదికాస్తా ప్రేమగా మారడంతో మరింత దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుంటానని సులేమాన్ చెప్పిన మాటలు నమ్మిన యువతి.. అతడికి శారీరకంగా దగ్గరైంది. ఐతే తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరిన ప్రతిసారీ సమాధానం దాటవేస్తూ వచ్చాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని యువతి సులేమాన్ పై ఒత్తిడి తెచ్చింది. దీంతో అతడు తనలోని సైకోని బయటపెట్టాడు.

  ఇది చదవండి: ట్రైన్లో కలిసిన టీటీఐతో ఎఫైర్... నాలుగేళ్లలో రూ.14కోట్ల బిజినెస్.. కట్ చేస్తే కటకటాల్లోకి.. అసలేం జరిగిందంటే..!


  అప్పటికే ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసిన సులేమాన్... నగ్నఫోటోలు ఇంటర్నెట్ లో పెడతానని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు యువతికి వచ్చిన సంబంధాలను కూడా చెడగొడుతూ వేధించసాగాడు. నీకు పెళ్లికానివ్వనని.. తనతోనే ఉండాలని బలవంతం చేస్తున్నాడు. కొన్నాళ్లు అతడి వేధింపులను భరించిన యువతి... చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది చదవండి: భర్తను అడ్డుతొలగిస్తే సుఖానికి సుఖం.. డబ్బుకు డబ్బు... ప్రియుడితో కలిసి భార్య స్కెచ్..


  ఇటీవల కర్నూలు జిల్లా (Kurnool District)లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గపర్తి గ్రామానికి చెందిన అన్వేష్ అనే యువకుడు అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అన్వేష్.. అమ్మాయిల మొబైల్ నెంబర్లు సేకరించి వారితో చాటింగ్ చేసేవాడు. ఒకరితో అన్వేష్ గా.., మరొకరితో భరత్, ఇంకొకరితో చరణ్ అనే పేర్లతో చాటింగ్ చేసేవాడు. కొన్నిరోజుల తర్వాత వారిని ప్రేమిస్తున్నట్లు నటించి ట్రాప్ లో వేసేవాడు.

  ఇది చదవండి: పెళ్లై ముగ్గురు పిల్లలున్నా ప్రియుడి మోజులో మహిళ... ఓ అర్ధరాత్రి భర్తను ఏం చేసిందంటే..!


  ఈ క్రమంలో ఓ యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు ఆమెకు పెళ్లైంది. తర్వాత కూడా తనతో చనువుగా ఉండాలని వేధించేవాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో యువతి ఫోటోలను సేకరించి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులకు పంపాడు. విషయం తెలుసుకున్న యువతి కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కర్నూలు కలక్టరేట్ వద్ద అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

  మీ నగరం నుండి (​విజయవాడ)

  ఆంధ్రప్రదేశ్
  ​విజయవాడ
  ఆంధ్రప్రదేశ్
  ​విజయవాడ
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Nude videos blackmails, Telangana, Vijayawada

  తదుపరి వార్తలు