Home /News /andhra-pradesh /

VIJAYAWADA MAN BOOKED FOR ATTACK ON YOUNG MAN PRIVATE PARTS IN ELURU DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

AP News: ఏపీలో ఉప్పెన తరహా సీన్.. కూతురు వెంటపడుతున్నాడని యువకుడి మర్మాంగం చితక్కొట్టిన తండ్రి..? పోలీసుల రియాక్షన్ ఇదే..!

బాధితుడు శ్రీకాంత్ (ఫైల్)

బాధితుడు శ్రీకాంత్ (ఫైల్)

టాలీవుడ్(Tollywood) లో వచ్చిన ఉప్పెన సినిమా (Uppena Movie) లో సీన్ అందరికీ తెలిసిందే. హీరో తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో విలన్.. అతడి మర్మాంగాన్ని తొలగిస్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
  టాలీవుడ్(Tollywood) లో వచ్చిన ఉప్పెన సినిమా (Uppena Movie) లో సీన్ అందరికీ తెలిసిందే. హీరో తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో విలన్.. అతడి మర్మాంగాన్ని తొలగిస్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు తన కుమార్తె వెంట పడుతున్నాడనే కోపం.. యువతి తండ్రి.. యువకుడిపై దాడిచేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి తన కుమార్తె వెంట పడుతున్నాడంటూ కక్ష పెంచుకున్న అదే గ్రామానికి చెందిన జాన్ అనే వ్యక్తి.. అతడ్ని చీకటి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. అతడి కోపం చల్లారకపోవడంతో శ్రీకాంత్ కాళ్లు చేతులు కట్టేసి మర్మాంగాన్ని రోకలిబండతో చితక్కొట్టినట్లు అతడి బంధువులు ఆరోపిస్తున్నారు.

  తీవ్రంగా గాయపడిన అతడ్ని కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించగా.. అక్కడి నుంచి నూజివీడు ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: పగలు పోలేరమ్మ జాతర.. కానీ రాత్రంతా రచ్చ రంబోలా.. 


  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాట్లాడాలి రమ్మని శ్రీకాంత్ ను ఇంటికి పిలిచిన జాన్.. అతడ్ని చీకటి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది. శ్రీకాంత్ నిజంగానే నిందితుడి కుమార్తెను ఏడిపిస్తున్నాడా..? లేక ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం ఉందా..? కుమార్తె వెంట పడుతుంటే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బంధించి చిత్రహింసలు పెట్టేంతగా ఏం జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు.

  ఇది చదవండి: భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. ఆరు నెలల తర్వాత ఇలా అవుతుందని ఎవరూ ఊహించలేదు..


  ఐతే పోలీసులు మాత్రం శ్రీకాంత్ పై దాడి జరగలేదని  చెబుతున్నారు. అతడ్ని చీకటిగదిలో పెట్టి కొట్టారనడంలో నిజం లేదని.. పెద్ద మనుషుల సమక్షంలోనే చేయిచేసుకున్న మాట వాస్తవమేనన్నారు.  ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని.. విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తే.. వాటిపైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం చేతులతోనే శ్రీకాంత్ పై దాడి చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.

  ఇది చదవండి: ఒకే వ్యక్తిని పెళ్లాడిన అక్కాచెల్లెళ్లు.. ఓ రోజు చెల్లి మిస్సింగ్.. అరా తీస్తే షాకింగ్ నిజాలు..


  ఇదిలా ఉంటే కుమార్తెలపై ప్రేమతో యువకుల్ని బలితీసుకుంటున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి (Bhuvanagiri)జిల్లాలో మరో పరువు హత్య తెరపైకి వచ్చింది. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన రామకృష్ణగౌడ్ (Ramakrishna Goud)అనే మాజీ హోంగార్డ్ (Homeguard)మృతదేహం సిద్దిపేట దగ్గర లభ్యమైంది. రామకృష్ణగౌడ్‌ భార్య భార్గవి(Bhargavi) ఈనెల 15వ తేదిన ఇంట్లోంచి వెళ్లిన తన భర్త ఇంటికి తిరిగి రాలేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా రామకృష్ణది హత్యగా గుర్తించిన పోలీసులు హత్య చేయించింది రామకృష్ణగౌడ్‌ పల్లెపాటి వెంకటేష్‌(Venkatesh)గా గుర్తించారు. అయితే హత్య చేయించడానికి గల కారణాలు తెలిసి షాక్ అయ్యారు. కేవలం 20నెలల క్రితం రామకృష్ణగౌడ్ తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని తమకు దూరం చేశాడన్న కోపంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Vijayawada

  తదుపరి వార్తలు