VIJAYAWADA MAN ATTEMPTED TO KILL HIS LOVER AFTER THEY HAVING EXTRAMARITAL AFFAIR IN KRISHNA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Affair: ఆమెకు భర్త లేడు.. అతడికి భార్యలేదు.. ఇద్దరికీ మిస్డ్ కాల్ పరిచయం.. ఓ అర్ధరాత్రి షాకింగ్ ఘటన
ప్రతీకాత్మక చిత్రం
Affair : అతడికి భార్య లేదు.. ఇద్దరూ విడిపోయి చాలా కాలమైంది. ఆమెకు భర్త లేడు.. ఆమె కూడా సింగిల్ గా ఉండటం మొదలుపెట్టి ఏళ్లు గడుస్తోంది. ఇద్దరికీ సినిమా స్టైల్లో ఓ ఫోన్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది.
అతడికి భార్య లేదు.. ఇద్దరూ విడిపోయి చాలా కాలమైంది. ఆమెకు భర్త లేడు.. ఆమె కూడా సింగిల్ గా ఉండటం మొదలుపెట్టి ఏళ్లు గడుస్తోంది. ఇద్దరికీ సినిమా స్టైల్లో ఓ ఫోన్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. చివరకు హత్యాయత్నం వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెంకు చెందిన నారపోగు ఏసురాజు తన భార్యతో విడిపోయాడు. కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా తెలంగాణలోని వరంగల్ కు చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి (Extramarital Affair) దారితీసింది.
ఏసురాజు ఆమె కోసం తరచూ వరంగల్ కు వెళ్లి వస్తుండేవాడు. ఇద్దరి మధ్య వ్యవహారం బాగా ముదిరింది. ఈ క్రమంలో ఓ రోజు ఆమెకు ఫోన్ చేసిన ఏసురాజు సుబ్బాయిగూడెం రావాలని చెప్పాడు. దీంతో ఆమె వచ్చింది. ఇద్దరూ భోజనం చేసి పడుకున్న తర్వాత ఉన్నట్లుండి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో ప్రియురాలిపై ఆవేశంతో ఊగిపోయిన ఏసురాజు బ్రేడుతో ఆమె గొంతుకోసి.. తాను కూడా చేయి కోసుకొని అత్మహత్యకు యత్నించాడు.
స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ చిన్నగాయాలే కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఐతే ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు ప్రియురాలు ముందుకురాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.
ఇదిలా ఉంటే గతంలో గుంటూరుకు చెందిన మహిళకు.. తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడితో షేర్ చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ యువకుడు గుంటూరు వచ్చి మహిళతో గడిపి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో సదరు మహిళ యువకుడి వద్ద కొంత డబ్బు అప్పుతీసుకుంది. తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులివ్వడంతో తనకు తిరిగిచ్చేయాలని యువకుడు మహిళను నిలదీశాడు.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో యువకుడు ఆమెను నెట్టగా.. కిందపడి మృతి చెందింది. దీంతో నిందితుడు ఆమె వద్ద ఉన్న బంగారం తీసుకొని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఫోన్ కాల్ డేటా అధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయాలు ప్రాణాలమీదకు తెస్తున్నాయని.. అలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.