Maha Shivaratri 2023: చెంబుడు నీళ్లు పోస్తే చాలు.. ఆ భోళాశంకరుడు కోరిన కోర్కెను తీర్చుతాడు. అలాంటిది ఆ పార్వతీ రామలింగేశ్వరుడిని (Parvati Lingeswara Swamy Temple) ఒక్కసారి దర్శిస్తే చాలు.. అందులోనూ మహా శివరాత్రి (Maha Shivaratri) రోజు దర్శించుకుంటే.. వెయ్యిమంది మునుల ఆశీస్సులు అందినట్లే. ఎక్కడో సూదూర ప్రాంతాల్లో కాదు.. మన విజయవాడ (Vijayawada) కు అతి చేరువలోనే ఈ ఆలయం ఉంది..! పూర్వ కాలం మునులు, ఋషులు, తప్పస్సు చేసుకోవడానికి వీలుగా నది తీర ప్రాంతాలను ఎంచుకునేవారు.అలా ఎంచుకున్న ప్రాంతాలలో విజయవాడలోని వేయ్యినిమునులకుదురు అని పిలిచే వారు. కాలక్రమేణా దాని పేరు యనమల కుదురుగా మారింది. ఈ ప్రాంతాన్ని అప్పటిలో వేయ్యీన్ని మునుల కుదురు గా పిలిచే వారు కాల క్రమేణా అది మునిగిరి అని ఆ తరువాత యనమల కుదురుగా మారింది.
కృష్ణానదీ తీరాన సుమారు 612 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన శ్రీ పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ శివుడు స్వయంభూవుగా వెలసిన ఈ రామలింగేశ్వరుడికి పరుశురాముడు ప్రాణ ప్రతిష్ట చేశాడని పురాణాలు చెబుతున్నాయి.
ఒకప్పుడు యనమలకుదురు ప్రాంతం ఎంతో ప్రశాంతంగా తపసుకు యోగ్యంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అందువల్లనేమో విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరుశురాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి శివునికోసం తపస్సు చేసుకున్నాడట. ఆ సమయంలోనే అక్కడ వెయ్యి మంది మునులు కొలువుతీరి యజ్ఞం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. పరుశురాముడు వారు చేస్తున్న యజ్ఞాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు.
ఇదీ చదవండి : టీడీపీ నేతకు.. వైసీపీ బంపర్ ఆఫర్.. చంద్రబాబుకు సీఎం జగన్ మాస్టర్ స్ట్రోక్
పరిసమాప్తి అయ్యాక ఆ ప్రాంతంలో పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్టించి ప్రాణ ప్రతిష్ట చేశాడని స్థల పురాణం చెబుతుంది. ఆయన ప్రతిష్ఠ చేసిన కారణంగానే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడుగా భక్తులు ప్రేమగా పిలుచుకుంటారు ఈ గిరి చుట్టూ 1000 మంది మునులు కూర్చుని శివుని గురించి తపస్సు చేశారు కనుక ఈ ప్రాంతాన్ని వెయ్యి మునుల కుదురు అని పిలిచేవారట. కుదురు అంటే వెయ్యి మంది సమావేశం. కాలక్రమమైన స్థానికుల భాషలో అధికాస్తా మారిపోయింది.
ఇదీ చదవండి : సీఎం నివాసంలో గోశాలను చూసి మైమరచిన చాగంటి.. సీఎం పై ప్రశంసల వర్షం
వైభవోపేతంగా శివరాత్రి ఉత్సవాలు
మహాశివరాత్రి ఉత్సవాలకు యనమలకుదరు శివాలయం ప్రసిద్ధి. ఇక్కడ మహాశివరాత్రిని మూడురోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. తొలిరోజు ప్రభోత్సవం, రెండోరోజు కల్యాణోత్సవం, మూడోరోజు వసంతోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం ధ్వజ అవరోహణం సమయంలో స్వామికి సమర్పించే నంది ముద్ధలు అంత్యంత మహిమాన్వితమైనవి. సంతానం లేని వాళ్లు వాటిని తింటే కచ్చితంగా వారికి పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం.
ఆలయాలను విద్యుత్తు దీపకాంతులతో, పుష్పాలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి పక్క గ్రామాల నుండే కాక జిల్లా నలుమూల నుండి ప్రజలు వస్తారు. గ్రామస్థులు తమ బంధువులను ఆహ్వానించి విందు ఇవ్వటం ఆనవాయితీ. కార్తీకమాసంలోనూ, దసరా ఉత్సవాలను వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. వనవాస సమయంలో సాక్షాత్తూ సీతారాములు ఈ పార్వతీ రామలింగేశ్వరుడిని దర్శించి పూజించారని ప్రచారంలో ఉంది. అంతేకాదు ఆ తర్వాత ఎంతో మంది రాజులు, చాళుక్యులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు ఈ మునిగిరి క్షేత్రంలో కొలువై ఉన్న మహాశివుడిని దర్శించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయం గురించి, ఆలయంలో జరిగే పూజలు లాంటి మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ ఆలయ వెబ్‌సైట్ http://sriramalingeswara.com/ ను ఒక్కసారి పరిశీలించండి.
ఇదీ చదవండి : లోకేష్ అన్నది నిజమే..? ఏ కలర్ చీర కావాలో చెబితే పంపిస్తానన్న రోజా
అడ్రస్ : కొండ రోడ్డు, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు, విజయవాడ , ఆంధ్రప్రదేశ్- 520007
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 7386160555
ఎలా వెళ్లాలి?
విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల నుంచి యనమలకుదురుకు బస్సులు అందుబాటులో ఉంటాయి. పండిట్‌నెహ్రూ బస్టాండ్, ఆటోనగర్ బస్టాండ్, బెంజ్ సర్కిల్ నుంచి ఆటోలు దొరుకుతాయి. రైలుమార్గం ద్వారా కూడా వెళ్లొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Lord Shiva, Maha Shivaratri 2023