Andhra Pradesh: 100 కి.మీ వేగంతో వస్తున్న రైలు.. ట్రాక్ పై యువకుడు.. లోకో పైలెట్ ఏం చేశాడంటే..!

ప్రతీకాత్మక చిత్రం

Suicide: రైలు కింద పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. ట్రాక్ పై పడుకున్నవారిని చూసినా అయ్యేపాపం అనుకోవడం తప్ప లోకోపైలెట్లు ఏమీ చేయలేని పరిస్థితి.

 • Share this:
  రైలు కింద పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. ట్రాక్ పై పడుకున్నవారిని చూసినా అయ్యోపాపం అనుకోవడం తప్ప లోకోపైలెట్లు ఏమీ చేయలేని పరిస్థితి. సడన్ బ్రేక్ వేస్తే ట్రైన్ పట్టాలు తప్పేప్రమాదముంటుంది. పైగా వేగంగా వస్తున్న రైలును ఆపేందుకు వీలుండదు. కానీ ఓ ట్రైన్లోని లోకోపైలెట్లు మాత్రం ట్రాక్ పై పడుకున్న యువకుడ్ని చూసి సడన్ బ్రేక్ వేశారు. అంతేకాదు గాయపడ్డ అతడ్ని ట్రైన్లోనే ఎక్కించుకొని తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి కాకినాడకు వస్తున్న లోకమాన్య తిలక్ విజయవాడ వస్తోంది. ఈ క్రమంలో కృష్ణాకెనాల్ రైల్వేస్టేషన్ దాటి వేగంతో వస్తోంది. స్టేషన్ సమీపలో ఓ యువకుడు సూసైడ్ చేసుకునేందుకు ట్రాక్ పై పడుకున్నాడు. ఐతే ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్లకు కేవలం 100 మీటర్ల దూరంలోనే అతడు కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. ట్రైన్ సడన్ గా ఆగిపోవడంతో ఏం జరిగందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు.

  మరోవైపు ట్రైన్ ఇంజన్ మాత్రం యువకుడి కాళ్లపై నుంచి వెళ్లడంతో రెండు పాదాలు తెగిపడిపోయాయి. ఇంజన్ నుంచి దిగిన లోకోపైలెట్ హనుమతరావు, అసిస్టెంట్ రఘురామరాజు వెంటనే వెనుక బోగీ వద్దకు పరుగులు పెట్టి యువకుడ్ని బయటకు తీశారు. రక్తపుమడుగులో ఆర్తనాదాలు చేస్తున్న అతడి కాళ్లకు గుడ్డచుట్టి రక్తం కారకుండా చేశారు. తెగిపడిన పాదాలను పాలిథిన్ కవర్లో వేసి అదే ట్రైన్లోని బోగిలో ఎక్కించారు. ఘటన జరిగిన ప్రాంతం వరకు అంబులెన్స్ రావడం సాధ్యం కాదని గ్రహించారు. వెంటనే కృష్ణాకెనాల్ స్టేషన్ అధికారులకు సమాచారమివ్వగా.. అప్పటిలోగా యువకుడి పరిస్థితి విషమించే అవకాశముండటంతో విజయవాడ తీసుకెళ్లాలని సూచించారు.

  ఇది చదవండి: ఏపీలో మళ్లీ లాక్ డౌన్.. మధ్యాహ్నం 2గంటల వరకే పర్మిషన్... ఎక్కడో తెలుసా..?


  వెంటనే విజయవాడ రైల్వే స్టేషన్ కు సమాచారం అందించడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమై 5వ నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. ట్రైన్ విజయవాడ చేరుకోగానే అతడ్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటకు చెందిన పృథ్వీగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఐతే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడేని మాత్రం తెలియలేదు.

  ఇది చదవండి: మ‌ళ్లీ భ‌గ్గుమంటున్న తాడిప‌త్రి రాజ‌కీయం.. అగ్గి రాజుకోవడానికి కారణం ఇదేనా..?  ప్రస్తుతం అతడు మాట్లాడలేక పోతున్నాడని, ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. యువకుడ్ని గమనించి ట్రైన్ ను ఆపడమే కాకుండా... అతడి ప్రాణాలు కాపాడినంద లోకో పైలెట్లను ప్రయాణికులు అభినందించారు. దీనిపై రైల్వే ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

  ఇది చదవండి: ప్రియురాలి మోజులో భర్త... ఆమె భర్తతోనే మర్డర్ ప్లాన్ వేసిన భార్య.. చివరికి ఏమైందంటే..


  Published by:Purna Chandra
  First published: