హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

VIjayawada: తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు..! తీరా అందులో ఉన్నది చూసి షాక్..!

VIjayawada: తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు..! తీరా అందులో ఉన్నది చూసి షాక్..!

ఆటోను ఆపిన పోలీసులకు షాక్

ఆటోను ఆపిన పోలీసులకు షాక్

Vijayawada: తనిఖీల్లో భాగంగా ఓ ఆటోను పోలీసులు ఆపారు.. కానీ డ్రైవర్ తీరుతో అనుమానం మరింత పెరిగింది. దీంతో క్షుణ్నంగా పరిశీలించిన పోలీసులకు ఊహించని షాక్ తగిలింది.. ఏమైందంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada.

  తెలంగాణ  (Telangana) రాష్ట్రానికి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఎన్టీఆర్‌ జిల్లా (NTR District)లో చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు వివిధ అసాంఘిక కార్యకలాపాల నివారణకు, అక్రమ రవాణా నివారణకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గంపలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పెనుగొలను గ్రామ శివారులో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక ఆటోను పోలీసులు గుర్తించారు.

  అక్రమ మద్యం సీసాలను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో గంపలగూడెం ఎస్.ఐ. సతీష్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఆటోను ఆపి చెక్‌ చేయగా..అందులో అక్రమంగా తరలిస్తున్న 718 తెలంగాణా మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు.

  వాటిని తరలించడానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ స్వస్థలం నూజివీడు మండలం రావిచర్ల గ్రామం.

  ఇదీ చదవండి : బీచ్‌రోడ్‌కు వెళ్తున్నారా.. ఈ స్నాక్‌ ఐటమ్‌ అస్సలు మిస్‌ కావద్దు..! స్పెషల్‌ ఏంటో తెలుసా..?

  మద్యంసీసాలను ధ్వంసం చేయనున్న పోలీసులు                    నందిగామ సబ్‌ డివిజన్‌లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సరుకును పోలీసులు ధ్వంసం చేయనున్నారు. ఆ పరిధిలో పోలీసులు పట్టుకున్న మద్యం సీసాల విలువ దాదాపు రూ.5.75 కోట్లు ఉంటుందని పోలీసుల అంచనా. ఈ మద్యం సీసాలను పెనుగంచిప్రోలు మండలం, తోటచర్ల గ్రామo, NH-65కి ప్రక్కన ఉన్న ప్లాట్‌లో ధ్వంసం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 2.5 లక్షలు మద్యం సీసాలను ద్వంసం చేయనున్నారు.

  ఇదీ చదవండి : బిడ్డకు ప్రాణం మెడిసన్ విద్యార్థి.. ట్రైన్ లో నిండు గర్భిణికి డెలివిరీ.

  ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, రూరల్ డి.సి.పి. మేరీ ప్రశాంతి, SEB అడిషినల్‌ SP మోకా సత్తిబాబు, ఎస్.ఈ.బి అధికారులు పాల్గొంటారు. గతంలో కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట సమీపంలో కార్ బోల్తా కొట్టడంతో కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు గుర్తించారు.

  ఇదీ చదవండి : కృష్ణ జింక దీక్షతో దిగివచ్చిన అధికారులు..! షాక్ అవుతున్నా ఇది నిజం.. మీరే చూడండి..

  పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అక్రమంగా మద్యం తరలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. విస్తృత తనిఖీలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Local News, Vijayawada

  ఉత్తమ కథలు