హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: వాట్‌ యాన్‌ ఐడియా..! బుల్లెట్‌ బార్బిక్యూ.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే..?

Vijayawada: వాట్‌ యాన్‌ ఐడియా..! బుల్లెట్‌ బార్బిక్యూ.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే..?

బార్బిక్యూ

బార్బిక్యూ రెస్టారెంట్

Vijaywada: నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. డుగు డుగు డుగు.. ఈ పాట ఎంతలా ఉర్రూతలూగించి రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు అదే బుల్లెట్‌ బండితో ఓ కుర్రాడు వ్యాపారం చేస్తున్నాడు. ఓ చిన్న ఐడియాతో ఫుడ్‌ బిజినెస్‌లో రాణిస్తున్నాడు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఫుడ్ లవర్స్ (Food Lovers) కొత్త కొత్త రుచులను కోరుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టే కొత్త కొత్త ఐడియాలతో యువకులు.. ఫుడ్ లవర్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. డుగు డుగు డుగు.. ఈ పాట రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది. ఈ పాటకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. మామూలుగానే చాలా మంది యువకులు బుల్లెట్ బండి కొనుక్కొని రయ్‌ రయ్‌ మంటూ పోవాలని కలలు కంటూ ఉంటారు.. కానీ విజయవాడ (Vijayawada) కు చెందిన ఓ కుర్రాడు కూడా బుల్లెట్‌ బండి (Bullet Bike) తో రోడ్ల మీద తిరుగుతున్నాడు..కానీ జల్సాల కోసం కాదండి..! బిజినెస్‌ కోసం..!

  ఒక్క చిన్న ఐడియాతో ఇప్పుడు వ్యాపారంలో రాణిస్తున్నాడు. అతనికున్న క్రియేటివికి కాస్త పట్టుదల తోడైంది… ఇంకేముంది ఆ వ్యాపారం మూడు గ్రిల్స్‌ చికెన్‌, ఆరు స్మోక్‌ చికెన్‌ పీస్‌లా కళకళలాడుతుంది. ఇదేంటి సామెత మార్చారని అనుకుంటున్నారా?  ఆ కుర్రాడి సక్సెస్‌ స్టోరీ తెలుసుకోవాల్సిందే.

  విజయవాడకు చెందిన వంశీ అనే యువకుడు.. ఉదయం కాలేజీలో చదువుకుంటాడు. కానీ సాయంత్రం అయితే చాలు డ్యూటీ ఎక్కేస్తాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన కాళ్ల మీద తాను నిలబడాలనుకునే సంకల్పం అతనిది. తనలాగే యువతకు ఇష్టమైనదేంటో ఆ నాడిని పట్టేశాడు. అదే నండి బుల్లెట్‌ బండి, బార్బిక్యూ… ఇక ఆ రెండింటి కాంబినేషన్‌తోనే వ్యాపారం చేయాలనుకున్నాడు.

  ఇదీ చదవండి : నిజమే టీడీపీ నుంచే వచ్చాం.. నాని భాష సరైందే..? లోకేష్ ను కొట్టిస్తానంటూ మంత్రి రోజా వార్నింగ్

  ఇంకేముంది వచ్చిన ఆలోచనకు కాస్త పదును పెట్టి ఫుడ్‌ బిజినెస్‌లో అడుగుపెట్టాడు. బుల్లెట్‌ బండిపై బార్బీక్యూ అంటూ సరికొత్త బిజినెస్‌ స్టార్ట్‌ చేశాడు. ఇప్పుడు ఆ ఐడియా సక్సెస్‌ అయ్యి మరో మూడు బ్రాంచ్‌లు పెట్టే లెవల్‌కు వెళ్లింది.

  ఇదీ చదవండి : నిరుద్యోగుల సమస్యపై సభలో టీడీపీ ఆందోళన.. బయట ఉద్రిక్తత.. చంద్రబాబుపై మంత్రి కీలక వ్యాఖ్యలు

  సామాన్యులు బార్బీ క్యూకు వెళ్ళాలి అంటే భారీగా ఖర్చు అవుతుంది. సేమ్ టు సేమ్ బార్బీ క్యు స్టైల్‌లో గ్రిల్ చికెన్ , స్మోక్ చికెన్ వంటి రకరకాల వెరైటీ ఐటమ్స్‌ను ఫుడ్ లవర్స్‌కు అందించడమే ధ్యేయంగా ఈ బార్బీ క్యు ప్రారంభించినట్లు నిర్వాహకులు వంశీ తెలిపారు.

  ఇదీ చదవండి : భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు.. ఎందుకంటే..?

  బుల్లెట్ బండి అంటే కుర్ర కారుకు బాగా ఇష్టమని… అందుకే ఈ బుల్లెట్ బండి మీద వ్యాపారం స్టార్ట్‌ చేశానని వంశీ చెబుతున్నాడు. ప్రస్తుతం బిఆర్‌టీఎస్‌ రోడ్డులో, సిద్దార్థ కాలేజీ సమీపంలో ఒకటి  పటమట దగ్గర మరో బ్రాంచ్‌ను ప్రారంభించామని చెబుతున్నాడు.

  ఇదీ చదవండి : చిరుతను సైతం పరిగెత్తించగల సత్తా ఆ కుక్కలది..! అందుకే అక్కడ దొంగల భయం లేదు.. ఫారెన్‌లో ఫుల్‌ డిమాండ్‌..!

  కరోనా తరువాత చాలా మంది యువత చిన్న చిన్న వ్యాపారులు ప్రారంభించి జీవనం సాగిస్తున్నారు. అలా ఒకరికి ఒకరు ఆదర్శంగా మారుతున్నారు. ముఖ్యంగా హై వేల పక్కన చాలా టీ స్టాల్ , ఫుడ్ సెంటర్‌లు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో ఇటువంటి బార్బీ క్యు లేదు .కొత్తదనంతో పాటు రుచికరమైన వంటకాలు అందిస్తున్నారని కస్టమర్లు కొనియాడుతున్నారు. ఇక్కడ ఫుడ్‌ చాలా టేస్టీగా ఉంటుందని..రెగ్యులర్‌గా ఇక్కడకు వస్తుంటామని కస్టమర్స్‌ తెలిపారు.

  అడ్రస్‌: పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, బెంజ్‌ సర్కిల్‌, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌-520010

  ఫోన్ నంబర్ :- 7386373848

  ఎలా వెళ్ళాలి ?

  పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు లో క్లబ్ ఫైవ్ ఎదురుగా బెజవాడ బార్బిక్యు ఉంటుంది. ఆటోలు ,సిద్దార్థ కాలేజీ కి వెళ్ళే బస్సులు ఎక్కితే బార్బిక్క్యు కు వెళ్లొచ్చు .

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Food Items, Local News, Vijayawada

  ఉత్తమ కథలు