Home /News /andhra-pradesh /

VIJAYAWADA LANDSLIDES AND FLOODS KILL AT LEAST 31 IN NORTHEAST BRAZIL PVN

Brazil Floods : బ్రెజిల్‌లో భారీ వ‌ర్షాలు,వరదలు..31మంది మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

 Landslides and floods in brazil : బ్రెజిల్‌(Brazil)లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అవుతున్నాయి. దీంతో ఆ దేశ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల, సుమారు 1,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఇంకా చదవండి ...
Landslides and floods in brazil : బ్రెజిల్‌(Brazil)లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అవుతున్నాయి. దీంతో ఆ దేశ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల, సుమారు 1,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు పేర్నొన్నారు. సుమారు 32 వేల కుటుంబాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయాయని చెప్పారు.నిరాశ్రయుల కోసం రిసిఫ్​ నగరంలోని పాఠశాలల్లో శిబిరాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. వరదల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈశాన్య బ్రెజిల్​లోని పెర్నాంబుకోలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి 29 మంది దుర్మరణం చెందగా, అలగోస్​ పరిధిలో ఇద్దరు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. భారీ వర్షాల ప్రభావంతో అలగోస్ లోని 33 మున్సిపాలిటీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. పరైబా, రియో గ్రాండే డో నార్టే, అలగోవాస్ సహా ఈశాన్య బ్రెజిల్ తీరంలోని పలు ఇతర రాష్ట్రాల్లో బ్రెజిల్ జాతీయ వాతావరణ అథారిటీ ఐఎన్ఎంఈటీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. వరదలపై స్పందించిన ప్రెసిడెంట్​ జైర్​ బొల్సోనారో.. సహాయక చర్యల కోసం భద్రతా దళాలను పంపుతామని తెలిపారు.

ALSO  READ Zircon Missile : అమెరికా వెన్నులో వణుకు..రష్యా జిర్కాన్‌ మిసైల్ పరీక్ష విజయవంతం

ఇదిలా ఉండ‌గా,మ‌న దేశంలో అస్సాంను కూడా వ‌ర్షాలు వ‌ద‌ల‌డం లేదు. దీని వ‌ల్ల వ‌ర‌ద పోతెట్టుతోంది. ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించిన డేటా ప్రకారం వ‌ర‌ద వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 30 మంది మ‌ర‌ణించారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నాగావ్, కాచర్, మోరిగావ్, డిమా హసావో, గోల్‌పరా, గోలాఘాట్, హైలకండి, హోజాయ్, కమ్‌రూప్, కమ్రూప్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, సోనిత్‌పూర్ 12 జిల్లాల్లోని దాదాపు 5.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని అధికారులు చెప్పారు.

ఈ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల నాగావ్ జిల్లాలో 3.68 లక్షల మందికి పైగా ప్రభావితం అయ్యారు. అలాగే కాచర్ లో దాదాపు 1.5 లక్షల మంది, మోరిగావ్ లో 41,000 మందికి వ‌ర‌ద‌ల దాటికి గుర‌య్యారు. వ‌ర‌ద వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 30 మందికి పైగా మ‌ర‌ణించారు. కాగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT) రాష్ట్రానికి చేరుకొంది. రాష్ట్రవ్యాప్తంగా 47,139.12 హెక్టార్లలో పంట నష్టం జరిగింద‌ని అధికార యంత్రాంగం తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Brazil, Floods

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు