Shock to Fish Lover: మీకు చేపలంటే ఇష్టమా...! ఇది మీకు కచ్చితంగా బ్యాడ్ న్యూసే..!

కొర్రమీను (ఫైల్)

గోదావరిలో (Godavari River) దొరికే పులచేపకు (Pulasa Fish) ఎక్కడాలేని డిమాండ్ ఉంది. చేప ధర వేలల్లో పలుకుతుంటుంది. పులస మాదిరిగానే కొల్లేరులో (Kolleru Lake) దొరికే కొర్రమీనుకు (Korrameeu) అదేస్థాయిలో డిమాండ్ ఉంటుంది. నల్లజాతి చేపల్లో కొర్రమీను చాలా స్పెషల్. కొల్లేరు కొర్రమీనంటే.. గోదావరి పులసతో సమానం.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నాన్ వెజ్ ప్రియులు (Non-veg Lovers కాస్త ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో (Coastal Andhra Districts) ముక్కలేనిదే ముద్దదిగదు అనే మాట ప్రతిచోటా వినిపిస్తుంటుంది. అలాగే చేపలన్నా ఆంధ్రులు పడిచస్తారు. సాధారణంగా దొరికే పండుగప్ప, బొచ్చె, రాగండి వంటి చేపలు తింటుంటారు. ఇక గోదావరి (Godavari River)లో దొరికే పులసచేపకు (Pulasa Fish) ఎక్కడాలేని డిమాండ్ ఉంది. చేప ధర వేలల్లో పలుకుతుంటుంది. పులస మాదిరిగానే కొల్లేరులో దొరికే కొర్రమీనుకు అదేస్థాయిలో డిమాండ్ ఉంటుంది. నల్లజాతి చేపల్లో కొర్రమీను చాలా స్పెషల్. కొల్లేరు కొర్రమీనంటే.. గోదావరి పులసతో సమానం. ఐతే ఇప్పుడు పులసమాదిరిగానే కొర్రమీను లభ్యత కూడా తగ్గిపోతోంది. మంచినీటి సరస్సులో హాయిగా జీవించే కొర్రమీనుకు కష్టకాలం వచ్చింది. ప్రస్తుతం వాటి మనుగడ ప్రమాదంలో పడింది. ఎప్పుడో ఓసారి తప్ప కొర్రమీను లభ్యం కావడం లేదు.

  సాధారణంగా కొర్రమీను చేపలు కృష్ణా, గోదావరి నది తీరప్రాంతాలు, పంటకాలువలు, గుంతలు, బోదెలు, సహజంగా ఉండే చెరువుల్లో పుట్టిపెరుగుతాయి. కొర్రమీనును ఆయా ప్రాంతాల్లో మట్టమీను, బురదమట్ట, బుట్టపూమేను అని పిలుస్తుంటారు. ఈ జాతి చేపలు నీటి అడుగున జీవిస్తూ నాచు వంటివాటిని తింటాయి. బురదలోనే ఉండటం వల్ల నల్లగా ఉంటాయి. చెరువులు, కాలువలు ఇంకిపోయినప్పుడు బురదలోకి చొచ్చుకుపోయి ఆ తేమను జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతాయి. చేపల్లో ఇవి చాలామొండివి. నీరు తక్కువగా ఉన్నా హాయిగా జీవిస్తాయి.

  ఇది చదవండి: మార్కెట్లోకి కొత్తరకం పుచ్చకాయలు.. కిలో గింజలు రూ.30వేలు.. స్పెషాలిటీ ఇదే..!


  కొల్లేరు సరస్సు కొర్రమీనుకు ఆలవాలం. గతంలో ఇక్కడ ప్రతిఏటా భారీగా కొర్రమీనులు మత్స్యకారులకు లభించేవి. కానీ ఇప్పుడు వాటి లభ్యత బాగా తగ్గిపోయింది. కాలుష్యమే ఈ అరుదైన చేపలన ఉనికికి ప్రమాదంగా మారింది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన కొల్లేరు ఇప్పుడు పూర్తిగా కలుషితమైంది. చుట్టుపక్కల ఆక్వా చెరువుల నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా సరస్సులో ఉప్పుశాతం పెరిగిపోతోంది. సరస్సులోకి ఏటా 17 వేల టన్నుల వ్యర్థ జలాలు చేరుతున్నట్టు ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అంచనా వేసింది. కేవలం పెద్ద కర్మాగారాల నుంచే రోజుకు 7.2 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలు కొల్లేరులో కలుస్తున్నాయి.

  ఇది చదవండి: పండగ చేసుకుంటున్న ఏపీ మత్స్యకారులు.. కారణం ఇదే..!


  ఇక విజయవాడ, ఏలూరు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి చేరుతున్న వాగులు, కాలువల ద్వారా వచ్చి సరస్సులో కలుస్తున్న వ్యర్థ రసాయనాలు మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాగే సముద్రపు నీరు కొల్లేరులోకి ఎగదన్నుతోంది. కొర్రమీను పూర్తిగా మంచినీటిలో పెరిగే చేప.. ఉప్పునీటిలో అస్సలు మనుగడ సాగించలేదు. ప్రస్తుతం కొల్లేరులో ఉప్పు శాతం 3–15 శాతంగా ఉంది. దీంతో సరస్సులో చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీనివల్ల శరీరంపై పుండ్లు, రక్తస్రావం కావడం, ఎదుగుదల లోపించడం, సంతానోత్పత్తి నశించడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కొల్లేరులో బొమ్మిడాయి, గురక, మట్టగిడస, జెల్ల, ఇంగిలాయి, మార్క్ వంటి నల్లజాతి చేపలు దాదాపు కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో కొర్రమీను కూడా చేరుతుండటం చేపల ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది.
  Published by:Purna Chandra
  First published: