K Pawan Kumar, News18, Vijayawada
ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు వారి ఇబ్బందులు కనిపిస్తాయి. మిగిలిన రోజుల్లో వారిని కన్నెత్తి చూసే వారే లేరని ,వారిని పట్టించుకునే వారు లేరని మరోసారి రుజువు అయ్యింది. ఎన్డీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో దోమల బెడదఎక్కువగా ఉంది. విజయవాడ శివారు ప్రాంతం కావడం, చుట్టూ అటవీ ప్రాంతం,కొండలు ఉండటం వలన దోమలు జనాన్ని పీక్కుతింటున్నాయి.మున్సిపాలిటీ కౌన్సెలర్లు వారి వార్డులో దోమల మందు కొట్టమని అధికారులను కోరారు.
కానీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు చెప్పిన అధికారులు స్పదించకపోవడంతో ఒకటో వార్డుకు చెందిన కౌన్సిలర్ చంద్రంతానే స్వయంగాదోమల మందు స్ప్రే చేసుకునే మిషన్ తీసుకుని తానే వార్డులోదోమలమందు కొట్టాడు. అక్కడ ఉన్నవారంతా పారిశుధ్య కార్మికుడు అనుకున్నారు .తర్వాత తీరాచంద్రాన్ని చూడగానే అక్కడవారంతఆశ్చర్యపోయారు.
చంద్రాన్ని నువు దోమల మందు కొడుతున్నావేంటి అని ఆరా తీయగా జరిగినదంతా వివరంగా చెప్పడంతో అసలు నిజం బయట పడటంతో అందుకే స్వయంగా నేను రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రం వివరించడం తో అక్కడి వారికి తెలిసింది. ఏరియాలో దోమలు ఎక్కువగా ఉన్నాయని దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అని పలుమార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో విసుగు చెంది తానే స్వయంగా దోమల మందు కొట్టాల్సి వచ్చిందని కౌన్సిలర్ చంద్రం వివరించాడు. ఇలా పట్టించుకోకపోవడంతోనే నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించడంతో దాన్ని బట్టి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మరోసారి రుజువు అయ్యింది.
అంటే దీన్నిబట్టి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నామని తెలియజేసిన ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు టైంలో అది చేస్తాం ఇది చేస్తాం అని ఎన్నో కబుర్లు చెప్తారు తీరా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసిన పట్టించుకోడం లేదని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada