Home /News /andhra-pradesh /

VIJAYAWADA KONDAPALLI BOMMALU LOSING THEIR IDENTITY AS THE ARTISTS COMMUNITY URGES FOR GOVERNMENT SUPPORT FULL DETAILS HERE PRN VPR NJ

Kondapalli Bommalu: కొండపల్లి బొమ్మా.. నీకెంత కష్టమొచ్చిందమ్మా..! ప్రమాదంలో ప్రాచీన కళ..

కొండపల్లి

కొండపల్లి బొమ్మలు (FIle)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొండపల్లి అంటే తెలియనివారుండరు. విజయవాడ (Krishna District) కు సమీపంలో ఉన్న కొండపల్లిలో తయారు చేసే బొమ్మలు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొండపల్లి అంటే తెలియనివారుండరు. విజయవాడ (Krishna District) కు సమీపంలో ఉన్న కొండపల్లిలో తయారు చేసే బొమ్మలు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ కొండపల్లి బొమ్మలకు 400 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. కొండపల్లి గ్రామం ఎన్టీఆర్ జిల్లా (NTR District) ఇబ్రహింపట్నం మండలంలో ఉంది. కొండపల్లి బొమ్మలు కొండపల్లి చుట్టుపక్కల అడవులలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్కనుండి తయారవుతాయి. కొండపల్లి కళాకారులు ఏకాగ్రతతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. ముందుగా బొమ్మల విడిభాగాలు తయారు చేస్తారు. ఉదాహరణకు కాళ్లు, చేతులు, తల మొదలగు భాగాలను విడి విడిగా తయారుచేసి తరువాత వీటన్నిటినీ చింతగింజల పొడుంతో తయారు చేసిన బంకతో ఒకటిగా అంటిస్తారు.

  అష్ట వంకర్లున్న తెల్ల పొనికికి బొమ్మ రూపంలో సజీవకళ ఉట్టి పడిందంటే అది కచ్చితంగా కొండపల్లి బొమ్మే. వాటిలో బాగా గుర్తింపు పొందినవి ఏనుగు అంబారీలు, గీతోపదేశం, తాటిచెట్టు క్రింద కల్లుతాగుతున్న వ్యక్తి, కృష్ణుడు గోపికలు, కొబ్బరి చెట్టు, డాన్సింగ్‌ డాల్‌, పెళ్లి పల్లకి, గ్రామీణ నేపథ్యం ఉట్టిపడే ఎడ్లబండి, వివిధ రకాల పక్షులు, హిందూ దేవతామూర్తుల బొమ్మలు. ఇవి బహుమతులుగా ఇవ్వటానికి చాలా బాగుంటాయి. దివంగత నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్‌లకు కొండపల్లి బొమ్మలను పలువురు బహూకరించారు. ఎక్కువగా సహజ రంగులనే వాడతారు (చెట్ల ఆకులు, బెరడుల నుండి తయారు చేసినవి) ఈ మధ్య సింథటిక్ కలర్స్ కూడా ఉపయోగిస్తున్నారు.

  ఇది చదవండి: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. ఇంతకన్నా వెరైటీగా ఎవరైనా బొమ్మలు గీస్తారా..?


  కొండపల్లి బొమ్మల చరిత్ర
  ముమ్మాటికీ అది కొండపల్లి బొమ్మే. దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కొయ్యబొమ్మల కళ అప్పటి కళాకారులైన రాజుల నేతృత్వంలో కొండపల్లికి వచ్చింది. కాలక్రమేణ ఊరిపేరునే తన పేరుగా మార్చుకొని కొండపల్లి కొయ్యబొమ్మగా మారింది. రాజస్థాన్ నుంచి తరతరాల క్రితం వలసవచ్చిన నిపుణులు ఈ బొమ్మలు రూపొందిస్తూంటారు. ఈ బొమ్మలురూపొందించే నిపుణుల్ని ‘ఆర్యక్షత్రియులు’గా పిలుస్తూంటారు. వాళ్లు రాజస్థాన్‌ నుంచి వలస వస్తూ16వ శతాబ్దంలో తమతో పాటుగా ఈ బొమ్మలు తయారు చేసే కళను తీసుకువచ్చినట్టు చెబుతుంటారు. ఈ నాలుగు వందల ఏళ్ల సంప్రదాయం ఒక తరం నుంచి మరో తరానికి అందుతూ వచ్చింది.

  ఇది చదవండి : ఈయన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది.. పూచికపుల్లకు కూడా ప్రాణం పోస్తాడు..


  కొండపల్లిలోని బొమ్మల కాలనీలోని దాదాపు అన్ని కుటుంబాలు ఈ బొమ్మలు రూపొందించుకోవడంలో పాలుపంచుకుంటున్నారు. ఈ ఊరి గురించి బ్రహ్మాండ పురాణంలో కూడా ప్రస్తావన ఉంది. శివుడి నుంచి కళలు, నైపుణ్యం పొందిన ముక్తాఋషి తమకు ఆద్యుడని చెబుతుంటారు. ఈ నిపుణులు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ఆలయాల్లో గరుడ, నంది, సింహం, వాహనాలు వంటివాటి విగ్రహాలను తమ పూర్వీకులు చెక్కినట్టుగా చెబుతారు.

  ఇది చదవండి: పోలవరంలో అద్భుతం.. అది అషామాషీ శివలింగం కాదు.. పురావస్తు శాఖ ఏం చెప్పిందంటే..!


  కొండపల్లి బొమ్మ లేకుండా బొమ్మల కొలువుండదు
  దసరా, సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు సంప్రదాయంలో ఈ కొయ్యబొమ్మలు అంతర్భాగం. ఏ ఇంట్లో బొమ్మల కొలువు జరిగినా అందులో కొండపల్లి బొమ్మలు ఉండాల్సిందే. ఈ వేడుకల్లో స్రీలు తాము సేకరించిన వివిధ కొయ్య బొమ్మలను ప్రదర్శిస్తారు. ప్రధానంగా ఆ సమయంలో కొండపల్లి బొమ్మల తయారీదారులు తమ వ్యాపారం ఎక్కువగా చేసుకుంటారు. ఈ కొండపల్లి బొమ్మలను లేపాక్షి షోరూంల నుండి కొనవచ్చు. లేక కొండపల్లి గ్రామానికి వెళ్లిన వారు అక్కడ స్థానికంగా వీటిని కొనవచ్చ. బొమ్మల వ్యాపారంలో యంత్రాల వినియోగం వంటివి వచ్చి చేరి కొండపల్లి నిపుణుల వ్యాపారం దెబ్బతీస్తున్నాయి.

  ఇది చదవండి: జీవం ఉట్టిపడటం అంటే ఇదే.. వారెవా ఏం టాలెంట్ గురూ..! చరిత్రకు జీవం పోస్తున్నారు..


  బుట్టబొమ్మను తీర్చిదిద్దే వారి జీవితాల్లో వెలుగేది?
  బొమ్మలను అందంగా తీర్చి తీర్చిదిద్దుతున్న వీరి జీవితాల్లోవెలుగు లేదనే చెప్పాలి. ఒక వైపు కరోనా ప్రపంచ దేశాలనువణికించి జీవితాలను చిన్నాభిన్నం చేస్తే.. మరో వైపు నిత్యావసర ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. కరోనా కష్ట కాలంలోతమ వైపు చూసిన నాధుడే లేరని కొండపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బొమ్మలకుగిట్టుబాటు ధరలు లభించక అవస్తలు పడుతున్నామని బొమ్మల తయారీదారులు చెబుతున్నారు. కొండపల్లి లో లభించే తెల్ల పోనిక అనే చెక్కను వినియోగించి బొమ్మలు తయారు చేస్తుంటారు , ప్రస్తుతం ఆ చెక్క కూడా రేటు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

  ఇది చదవండి: ఏపీలో కేజీఎఫ్ తరహా గోల్డ్ మైన్స్..? ఆ కొండల కింద అంతా బంగారమే..!


  క్రమంగా తగ్గిపోతున్న తయారీదారులు
  ప్రస్తుతం బొమ్మలు తయారు చేసే కళాకారుల సంఖ్య క్రమేపీ తగ్గుతూవస్తుంది . గిట్టు బాటు ధరలు లేకపోవడంతో కొంతమంది కళాకారులు వలస వెళ్ళిపోయీ ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ వృత్తి చేస్తూ జీవించి ఒక్కసారిగా ఇప్పుడు బయటికి వెళ్ళి వేరే పని చేయడం కష్ట తరమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.కళాకారుల కుటుంబాల్లోని యువతరం ఈ కళకు దూరంగానే ఉండాలని భావిస్తూ సాంకేతిక చదువులు, ఇతర వృత్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ తరం తర్వాత ఈ కళ ప్రశ్నార్థకమేనని నేటితరం కళాకారులు వాపోతున్నారు.

  ఇది చదవండి: ముగ్గురు మిత్రుల వినూత్న ఐడియా.. ఇప్పుడు కాసులు కురిపిస్తోంది..!


  టెక్నాలజీ పేరుతో దళారులు మరింత మోసం
  మార్కెటింగ్‌ సౌకర్యంతో 2010 - 2014 మధ్య దేశంలో అనేక ప్రాంతాలకు కొండపల్లి బొమ్మలు విస్తరించాయి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కొండపల్లి బొమ్మకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంతో పాటు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించాయి. అయితే ఆన్ లైన్‌లో బొమ్మలకు గిట్టుబాటు ధరలు లభిస్తుందని భావించివెబ్ సైట్స్‌లో బొమ్మలు అప్‌లోడ్ చేస్తే మధ్యలో దళారీ వ్యవస్థలు అడ్డంకిగా మారాయని,మరో పక్క సైబర నేరాలు అధికమవడంతో ఆన్ లైన్ విక్రయాలకుస్వస్తి పలకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న టెక్నాలజీ వల్ల కూడా తమకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా మరింత ఉబిలోకి నెట్టేస్తుందేమో అని భయపడుతున్నారు.

  ఇది చదవండి: మనకు తెలియని ఉయ్యాలవాడ చరిత్ర ఇదే..! పాలెగాడు పోరాటయోధుడు ఎలా అయ్యాడు..?


  కనుమరుగయ్యే దశలో కొండపల్లి బొమ్మలు!
  తాతల కాలం నుంచి తర తరాలు బొమ్మలు తయారు చేయడం జీవనోపాధిగా మారిందని, బ్రతుకు తెరువు కష్టంగా మారడంతో ఈ రంగం వైపు చూసే వాళ్ళు లేరని తమ పిల్లలు సైతం ఈ రంగానికి దూరంగా వెళ్లిపోతున్నారని రాబోయే రోజులు బొమ్మలు తయారి పరిశ్రమ కనుమరుగు అయే ప్రమాదం కూడా లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ కళను గుర్తించినా ఫలితం మాత్రం శూన్యంగా మారిందని… తమ తర్వాత ఈ కళను కాపాడాలని వేడుకుంటున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు