Home /News /andhra-pradesh /

VIJAYAWADA KBN COLLEGE GIVING FREE TRAINING TO UNEMPLOYED WOMAN IN LOOM DESIGNING WORK IN VIJAYAWADA FULL DETAILS HERE PRN VPR NJ

Vijayawada: మహిళల స్వయం ఉపాధికి ఇదే పర్ఫెక్ట్ ఛాయిస్.. కాలేజీలోనే ఫ్రీ ట్రైనింగ్.. వివరాలివే..!

శిక్షణ

శిక్షణ పొందుతున్న మహిళ

ఈ రోజుల్లో మగవాళ్లకు ధీటుగా మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్థిరపడుతున్నారు. కొందరకి ఇంటి నుంచే గైడెన్స్ ఉంటుంది. మరికొందరికి ఏదో చేయాలన్న తపన ఉన్నా సరైన దారి దొరకదు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) లో కేబీఏన్ కాలేజీ యాజమాన్యం మాత్రం మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తోంది.

ఇంకా చదవండి ...
  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  ఈ రోజుల్లో మగవాళ్లకు ధీటుగా మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్థిరపడుతున్నారు. కొందరకి ఇంటి నుంచే గైడెన్స్ ఉంటుంది. మరికొందరికి ఏదో చేయాలన్న తపన ఉన్నా సరైన దారి దొరకదు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) లో కేబీఏన్ కాలేజీ యాజమాన్యం మాత్రం మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా సులువైన మగ్గం వర్క్‌ పై ఉచిత శిక్షణ కార్యక్రమం మహిళలకు, యువతులకు మహాదావకాశంగా నిలుస్తోంది. ఆదాయాభివృద్ధికి, ఆర్థిక సాధికారత సాధించే దిశగా ఉచిత మగ్గం శిక్షణ నిర్వహిస్తున్నారు కేబీఎన్‌ కాలేజీ యాజమాన్యం. పలు స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపడుతూ చేయూతనందిస్తున్నది. ప్రస్తుతం మగ్గం వర్క్‌ శిక్షణ నిరుద్యోగ యువతులకు ఎంతో ఉపయోగపడుతున్నది. ట్రెండ్‌కు తగ్గట్టుగా వేసుకునే జాకెట్టు నుంచి కట్టుకునే భర్త వరకు మహిళల అభిరుచులు మారిపోతున్నాయ్.

  మార్కెట్‌లో మగ్గం వర్క్‌ కి మంచి డిమాండ్‌ ఉంది. పేద, మధ్యతరగతి యువతులు ప్రైవేటు కేంద్రంలో ఈ పని నేర్చుకోవడం ఖరీదైనది. ఈ పరిస్థితుల్లో విజయవాడలోని కేబీఎన్‌ కాలేజీ నిర్వహణలో అందిస్తున్న ఉచిత మగ్గం వర్క్‌ శిక్షణ మహిళలకు వరంగా మారింది.

  ఇది చదవండి: మహిళల చేతిలో బ్రతుకు బండి.. స్పూర్తినిస్తున్న జీవిత గాధలు


  2500మంది మహిళలకు శిక్షణ
  గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతులకు విజయవాడలోని కేబీఎన్‌ కాలేజీలో ఇస్తున్న శిక్షణ కేంద్రం చక్కని అవకాశంగా మారింది. కేంద్రంలో మగ్గం వర్క్‌ శిక్షణ చురుగ్గా సాగుతున్నది. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా 2500 మంది మహిళలకు మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ అందింస్తున్నారు. మారుతున్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు. చీరలు ,జాకెట్లు రకరకాల డిజైన్లు వర్క్ పై శిక్షణ అందిస్తే ఈ రంగం పై ఆధారపడి జీవిస్తున్న వారి కోసమే కాకుండా …. మగ్గం వర్క్‌పై ఆసక్తి ఉన్నవాళ్ళకి మరింతగా తోడ్పడతుందని శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న మహిళ సాధికారత సభ్యురాలు శైలజ అన్నారు.

  ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


  మగ్గం వర్క్ నేర్చుకోవడం వల్ల ప్రయోజనాలు:
  నగరంలో గత కొన్నేళ్ళుగా టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మగ్గం వర్క్ నేర్చుకోకపోవడం వల్ల బ్లౌజ్‌లకు, చీరలకు వర్క్ చేయించాలంటే బయట వారిని ఆశ్రయించాల్సి వస్తోందని.. అలా చేయడం వల్ల ఆర్థిక ఎదుగుదలకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం మగ్గం వర్క్‌కు మార్కెట్లో డిమాండ్ ఉందని.., ఈ శిక్షణ పొందడం వల్ల మహిళల జీవనానికి తోడ్పతుందని శైలజ తెలియచేశారు.

  ఇది చదవండి: ఆ ఇల్లే ఓ మాయాద్వీపం.. అంతకంటే పెద్ద మ్యూజియం.. అక్కడ అద్భుతాలెన్నో..!


  సర్టిఫికేషన్ అందజేత
  ఇక్కడ శిక్షణ పొందిన మహిళలందరికి సర్టిఫికేషన్‌ కూడా ఇస్తున్నారు. ఈ సర్టిఫైడ్ కోర్స్ వల్ల తాము లబ్ధి పొందడమే కాక మరికొంత మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఉంటుందని శిక్షణ పొందుతున్న మహిళలు తెలిపారు. ప్రస్తుతం నగరం లో అనేక మంది టైలరింగ్ చేసి జీవనం సాగిస్తున్నారని.. మగ్గం వర్క్ కూడా నేర్చుకోవడం వల్ల కుటుంబ పోషణకు మరింత ఉపయోగపడతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


  మగ్గం వర్క్‌ పై గృహిణుల మాటలు
  చీరలు, జాకెట్లు మరింత అందంగా తీర్చిదిద్దడం కోసం చాలా డబ్బులు కేటాయించాల్సి వస్తుంది. అదే మగ్గం వర్క్ నేర్చుకోవడం వల్ల సమయంతో పాటు డబ్బును ఆదా చేయొచ్చు అంటున్నారు గృహిణులు , ఉచితంగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు హాజరవడం వల్ల ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో తామే వర్క్ చేసుకోవచ్చని తెలిపారు.

  అడ్రస్‌: 9-42-104 కేటీ రోడ్‌, శ్రీనివాస మహల్‌ ఎదురుగా, కొత్తపేట్‌, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌-520001.
  కాలేజ్‌ వెబ్‌సైట్‌ : https://www.kbncollege.ac.in/
  మెయిల్‌ఐడీ : info@kbncollege.ac.in
  కాంటాక్ట్‌ నెంబర్‌: +91-866 -2565679

  KBN College Vijayawada

  శిక్షణ తరగతులపై కేబిఎన్ కళాశాల యాజమాన్యం స్పందన
  మహిళ సాధికారతే ప్రధాన లక్ష్యంగా గత కొన్నేళ్లుగా మహిళలకు వివిధ రకాల కోర్సలను ఉచితంగా నిర్వహిస్తున్నామన్నాని కాలేజీ ప్రిన్సిపల్‌ నారాయణరావు తెలిపారు. రాబోయే రోజులు మరిన్ని కోర్స్ లను ఏర్పాటు చేసి మహిళలకు తోడ్పాటుగా నిలుస్తున్నామంటున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు