Vijayawada Durga Temple: వెండి సింహాల మాయంలో ట్విస్ట్..

వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఈవో సురేష్ బాబు..గత ఏడాది ఉగాది తర్వాత రథాన్ని బయటకు తీయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

news18-telugu
Updated: September 17, 2020, 2:35 PM IST
Vijayawada Durga Temple: వెండి సింహాల మాయంలో ట్విస్ట్..
రథంపై వెండి సింహం విగ్రహాల మాయం
  • Share this:
విజయవాడ దుర్గమ్మ రథంపై ఉండే మూడు సింహాల మాయంపై ఏపీలో దుమారం రేగుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విగ్రహాలు లాకర్‌లో ఉండవచ్చని నిన్న ఆలయ ఈవో చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎక్కడా విగ్రహాలు లేకపోవడంతో దుర్గ గుడి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఈవో సురేష్ బాబు..గత ఏడాది ఉగాది తర్వాత రథాన్ని బయటకు తీయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో ఉత్సవాలు నిర్వహించలేదని తెలిపారు. 17 నెలల తర్వాత ఇంజినీరింగ్ పనుల నిమిత్తం పరిశీలిస్తే సింహాలు కనిపించలేదని వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బుధవారం సింహాలు కనిపించకపోవడంతో స్టోర్ రూమ్‌లో ఉన్నాయేమోనని.. అధికారులు తనిఖీ చేసినట్లు ఆలయ ఛైర్మన్ సోమినాయుడు అన్నారు. ఆ సింహాలు స్టోర్ట్‌రూమ్‌లో లేవని ఆయన చెప్పారు. పోయిన సింహాలను తయారు చేసి రథానికి అమర్చే ప్రక్రియను నిన్ననే ప్రారంభించమని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న సెక్యురిటి అధికారులు... కొత్తగా వచ్చిన మాక్స్ సెక్యురిటి వాళ్ళకి వెండి సింహాలను అప్పజెప్పలేదని స్పష్టం చేశారు. సింహాలు ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు సోమినాయుడు.

కాగా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఉత్సవాల్లో వినియోగించే వెండి రథం సింహాలు మాయమైన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు సింహాలకు గాను ఒక్కటే మిగిలి ఉంది. దానిని కూడా పెకిలించేందుకు ప్రయత్నించి విఫలమయినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారని తెలుస్తోంది. ఈ లెక్కన రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైంది. కానీ ఈవో మాత్రం వెండి పూతే ఉంటుందని చెబుతున్నారు. అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో.. సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు విజయవాడ నగర కమిషనర్ శ్రీనివాస్‌ ఆలయ రథాన్ని పరిశీలించగా వెండి సింహాలు మాయమైన విషయం తెలిసింది.
Published by: Shiva Kumar Addula
First published: September 17, 2020, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading