Home /News /andhra-pradesh /

ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో ఉండాలి. త్వరలో మీ ముందుకొస్తాను. పవన్ భావోద్వేగ లేఖ

ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో ఉండాలి. త్వరలో మీ ముందుకొస్తాను. పవన్ భావోద్వేగ లేఖ

పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్ (Twitter/Photo)

పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్ (Twitter/Photo)

కరోనా బారిన పడ్డ తరువాత పవన్ కళ్యాణ్ తొలి సారి స్పందించారు. తాను త్వరగా కోలుకుంటున్నాను అన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు మరింత సన్నద్ధంగా ఉండాలని కోరారు.

  తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు పూర్తి సన్నద్ధతతో ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రస్తుతం ఆయన త్వరగా కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఇంట్లోనే డాక్టర్ ఉపాసన ఉండడంతో ఆయనకు మెరుగైన చికిత్స అందుతోంది. దీంతో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులకు లేఖ రాశారు. కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉందని.. ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు. కరోనా సోకిన వారే కాకుండా.. ప్రజలంతా వైద్యులు, నిపుణులు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. తన ఆరోగ్యం కుదుటపడుతోందని చెప్పారు. తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పవన్‌ పేరిట జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.

  ప్రస్తుతం తన ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతోంది అన్నారు. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తున్నాన్నారు. వీలైనంత త్వరగా కోలుకొని అందరి ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. తాను కరోనా బారినపడ్డానని తెలిసినప్పటి నుంచి నా యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ని కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు అందరూ తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారని. సందేశాలు పంపించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, అభిమానులు తాను ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, యాగాలు చేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. తమ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారని.. అందుకే కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో తన భావోద్వేగాన్ని వెల్లడించలేను అన్నారు.

  ప్రస్తుతం ఏపీలో అధికారిక లెక్కల ప్రకారం ప్రతి రోజు ఏడు వేలకు అటు ఇటుగా, తెలంగాణలో 4వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన పెంచుతోంది అన్నారు. అధికారిక లెక్కలు పక్కన పెడితే.. నిపుణులు, వైద్యాధికారులు మాత్రం అంతకు కొన్ని రెట్లు కేసులున్నాయని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని ఆ లేఖలో కోరారు పవన్. 

  ఏపీలో కరోనా బారిన పడిన వారికి అవసరమైన మేరకు బెడ్స్‌, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడం చాలా బాధ కలిగిస్తోంది అన్నారు. పరిస్థితిని ముందే అంచనా వేసి వాటిని ఏర్పాటు చేయకపోవడం వల్లే ఆందోళనకర స్థితి నెలకొందన్నారు. చాలా వరకు ఆస్పత్రుల్లో బెడ్స్‌ లేవని రోగులను చేర్చుకోలేని పరిస్థితి ఉన్నట్టు వస్తున్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రోగులకు అవసరమైన మందుల కొరత కూడా ఏర్పడినట్లు తెలుస్తోందన్నారు. వీటిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అత్యవసరంగా కొవిడ్‌ కేంద్రాలను భారీగా తెరిచి వైద్య పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు వైరస్‌ వ్యాప్తిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. కరోనా వ్యాప్తి నిరోధంలో ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నా ప్రజలు తమ వంతు బాధ్యతగా స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి అని పవన్ కోరారు.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Corona, Corona cases, Janasena, Pawankalyan, Telangana

  తదుపరి వార్తలు